జపాన్ రాజధాని Tokyo. కానీ ఇప్పుడు మనం టూరిస్టుల మనసులను కొల్లగొట్టే Kyoto city గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా చలికాలంలో Kyotoలో ఆలయాలు, మంచు, గార్డెన్లు, అన్ని కూడా చాలా అందంగా కనిపిస్తాయి. క్యోటోలో అనువణువునా చరిత్ర తాలూకు లక్షణాలు కనిపిస్తాయి. ఇక్కడి వెళ్లే ప్రయాణికులు చాలా మంది మార్నింగ్ వాక్ చేయడాన్ని అస్సలు మిస్ చేయరు. ఒకప్పటి రాజధాని క్యోటో రాజుల కాలంలో జపాన్ రాజధాని. చలికాలం ఇది వింటర్ వండర్లాండ్‌లా మారిపోతుంది. వెదురుతో నిర్మించిన ఆలయాలపై, నడవడానికి అప్పట్లో ఏర్పాటు చేసిన రాతి రోడ్లపై సన్నని మంచు పొరలుగా పడి అందంగా కనిపిస్తుంది. ఈ నగరం కొన్ని శతాబ్దాలుగా తమ వారసత్వాన్ని అలాగే కాపాడుతూ వస్తోంది. అందుకే ఇక్కడికి వస్తే టైమ్ మిషన్‌లో వెనక్కి వెళ్లినట్టు అనిపిస్తుంది అని కొంత మంది ప్రయాణికులు అంటారు. తత్వవేత్తల తొవ్వ (Ha Ha Ha) | Philosophers Path క్యోటో వీధుల్లో చాలా తత్వవేత్తలు నడిచిన దారుల్లో మీరు కూడా నడవవచ్చు. ఆ తొవ్వలో నడుస్తూ జీవిత తత్వం బోధపడుతుందేమో ట్రై చేయండి. జస్ట్ జోకింగ్. చిన్న చిన్న సెలయర్లు, అందమైన దారులను కవర్ చేస్తూ అక్కడి టీ హౌసుల్లో ఉదయమే వేడివేడి ఛాయ్ తాగుతూ ప్రయాణికులు తమ మెమోరీస్‌ను సేవ్ చేసుకుంటారు. ఇక్కడ Matcha అనే జపానీస్ గ్రీన్‌టీతో పాటు ట్రెడిషనల్ స్వీట్స్ కూడా సర్వ్ చేస్తారు. ఉదయమే సాధువులు తమ మార్నింగ్ రిచువల్స్ పూర్తి చేసుకుంటే, స్థానికులు భక్తితో ఆలయాలను శుభ్రం చేస్తారు. సూర్యోదయం సమయంలో ఆకాశం బంగారు రంగులో మెరిస్తే నేలంతా కిరణాలతో తడుస్తుంది. (కొత్తగా ట్రై చేశాను) జపాన్ ఆలయాలు | Famous Shrines In Kyoto, Japan క్యోటోలో Fushimi Inari, Kinkaku-ji, Ginkaku-ji వంటి పురాతన ఆలయాలు మనం టీవీలో చూసే ట్రెడిషనల్ ఆలయాలను మించి ఉంటాయి. అలాగే ఆలయాలకు ముందు నిర్మించే Torii Gates ఉదయానే గోల్డెన్ కలర్ స్కై వల్ల మెరిసిపోతాయి. దూరంగా కనిపించే మంచు దుప్పటిలో పర్వతాలు అందానికి మరింత వన్నె తెస్తాయి. ఇక్కడ ఎప్పుడు వెళ్లినా సీజనల్ ఫ్రూట్స్, స్థానికులు తయారు చేసే వంటకాలను ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా Setsubun వేడుక సమయంలో వెళ్తే పైసా వసూల్ అనుభవం పొందవచ్చు. తెలుగు ఫ్యామిలీస్‌ గైడ్ | Telugu Families Travel Tips to Kyoto Flights: హైదరాబాద్ నుంచి Kansai Airportకు వయా ముంబై లేదా ఢిల్లీలో వెళ్లి వచ్చు. Layoversతో కలిపి సుమారు 10–12 గంటల ప్రయాణం ఉంటుంది. Local Transport: Haruka Express Trainలో ప్రయాణించి 75 నిమిషాల్లో Kyoto చేరుకోవచ్చు. లేదంటే బస్సుల్లో కూడా ప్రయాణించవచ్చు. రోడ్డులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. Subway, bus stands కనుక్కోవడం సులభం. Stay (ఎక్కడ ఉండాలి): Gion / Central Kyoto ప్రాంతాల్లో అందుబాటు ధరలో హోటల్స్ లభిస్తాయి. Winter Tips: Light jackets, waterproof shoes తీసుకెళ్లండి. Entry Fees: ఆలయాల్లో ఎంట్రీ దాదాపు ఉచితం; కొన్ని గార్డెన్స్‌లోపలికి వెళ్లేందుకు రూ.500–700 ఫీజు ఉంటుంది. Kyoto Japan Winter Travel Guide 1
|

Tokyo వద్దు Kyoto ముద్దు అంటున్న తెలుగు ప్రయాణికులు..ఎందుకో తెలుసా ? | Kyoto Japan Winter Travel Guide

Kyoto Japan Winter Travel Guide : వింటర్లో జీవితం మెల్లగా, చల్లగా ఎంజాయ్ చేయాలంటే Kyoto బాగా సెట్ అవుతుంది. క్యోటో ఎలా వెళ్లాలి ? ప్రశాంతంగా ఎలా ఎంజాయ్ చేయాలి ? తెలుగు వాళ్లు ఎందుకు ఇక్కడికి వెళ్తున్నారో తెలిపే ఈ చిన్న గైడ్‌లో మీ కోసం.

3 Passport-Free People in the World Prayanikudu Travel Facts
| |

పాస్‌పోర్ట్ లేకుండా ఏ దేశానికైనా వెళ్లగలిగే ఆ ముగ్గురు ఎవరో తెలుసా? | Prayanikudu Travel Facts

Prayanikudu Travel Facts : ఈ భూమ్మీద అసలు పాస్‌పోర్ట్ అవసరం లేకుండా ముగ్గురు వ్యక్తులకు మాత్రం పాస్‌పోర్టు లేకుండా ఏ దేశానికి అయినా వెళ్లగలరట. ఎవరో మీరు guess చేయగలరా?

Air India : 30 నిమిషాలు సేవ్ చేయడం కోసం… ఢిల్లీ నుంచి టోక్యోకు డైరక్ట్ ఫ్లైట్స్
|

Air India : 30 నిమిషాలు సేవ్ చేయడం కోసం… ఢిల్లీ నుంచి టోక్యోకు డైరక్ట్ ఫ్లైట్స్

భారత్- జపాన్ మధ్య వైమానిక ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశలో ఎయిర్ ఇండియా (Air India) మరో అడుగు ముందుకు వేసింది. 2025 జూన్ 15వ తేదీ నుంచి ఢిల్లీ – టోక్యో హనెడాకు మధ్య డైరక్ట్ ఫ్టైట్స్ నడపనున్నట్టు ప్రకటించింది. 

UAE Visa On Arrival
| | | |

UAE Visa On Arrival : భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పిస్తోన్న యూఏఈ…

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లాలి అనుకుంటున్న భారతీయులకు శుభవార్త. వీసా ఆన్ అరైవల్ (UAE Visa On Arrival) పథకాన్ని కొనసాగింపుగా సింగాపూర్, జపాన్ వంటి ఆరు దేశాల వ్యాలిడ్ వీసా ఉన్న భారతీయులకు ఆన్ అరైవల్ వీసా అందించనుంది యూఏఈ. దీని వల్ల పర్యాటకంతో పాటు ఆర్థికంగా లాభం చేకూరుతుంది అని ఆశిస్తోంది.

Biggest Traffic Jams In World
| | | | |

11 Epic Traffic Jams: ప్రపంచంలోనే అత్యంత దారుణమైన 11 ట్రాఫిక్ జామ్స్ ఇవే !

చరిత్రను తవ్వి తీస్తే బయటికి వచ్చిన టాప్ 11 ట్రాఫిక్ జామ్స్ (11 Epic Traffic Jams)  ఇవే అని తెలిసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ మన దేశంలో ఈ పోస్టు పబ్లిష్ చేసే సమయానికి ఇంకా కొనసాగుతోంది. 

Lunar New Year 2025 dates and history and important
| | | | | |

Lunar New Year 2025 : లూనార్ న్యూ ఇయర్ అంటే ఏంటి ? దీనిని ఏఏ దేశాల్లో, ఎలా సెలబ్రేట్ చేస్తారు ? 

ప్రపంచ వ్యాప్తంగా లూనార్ న్యూ ఇయర్ సంబరాలు మొదలయ్యాయి. దీనిని చైనీస్ న్యూ ఇయర్ ( Lunar New Year 2025 ) అని కూడా అంటారు. లూనార్ న్యూ ఇయర్ ప్రత్యేేకతలు ఏంటి ? ఏఏ దేశాల్లో సెలబ్రేట్ చేస్తారు..మరెన్నో విశేషాలు తెలుసుకుందామా ..

Mumbai Hyderabad Bullet Train
| | |

India’s Fastest Train : 2 గంటల్లో 508 కిమీ ప్రయాణం…2026 లో తొలి బుల్లెట్ ట్రైన్ సిద్ధం

భారతదేశ ప్రజా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయి. ముంబై – అహ్మదాబాద్‌ను కనెక్ట్ చేసే తొలి బులెట్ ట్రైన్ ( India’s Fastest Train ) త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కేవలం 2 గంటల్లోనే 508 కిమీ దూరం ప్రయాణించడం సాధ్యం అవుతుంది.

Ha Long Bay, Vietnam- pexels
| | |

12 నెలల్లో ఆసియాలోని 12 దేశాలను చుట్టేయండి | 12 Destinations in Asia in 12 Months

నెలకో డెస్టినేషన్ చొప్పున ఆసియాలో 12 నెలలకు సరిపోయే విధంగా 12 దేశాలను ( 12 Destinations in Asia ) మీకు సూచించబోతున్నాను. స్పెషల్ టైమ్, వేడుకలు ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మీ కోసం ఈ జాబితా సిద్ధం చేశాను.

Travel Vlogger Tests Japan's Cleanliness With White Socks Results Shocked Social Media prayanikudu
| |

Japan : వావ్ జపాన్ మరీ అంత క్లీన్‌గా ఉంటుందా? టెస్ట్ చేసిన వ్లాగర్

ఎలాగూ జపాన్‌ (japan) లోనే ఉన్నాను కదా అని టెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది సిమ్రన్. ఆ టెస్టులో జపాన్ పాసయింది. ఈ వీడియో చూసి సోషల్ మీడియా ప్రజలు అవాక్కవుతున్నారు.