మేఘాలయ నిజంగా చాలా అందమైన రాష్ట్రం. అయితే పర్యాటక రంగం అంతగా డెవలప్ అవకపోవడం వల్ల చాలా మంది వెళ్లడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే నగరాల్లో మేఘాలయ ( Meghalaya) రాజధాని షిల్లాంగ్ పేరు కూడా ఉండటం హైలెట్.
నిజంగా షిల్లాంగ్ సిటీ చాలా అందంగా ఉంటుంది. షిల్లాంగ్ సిటీ గురించి గతంలో ఒక పోస్ట్ పబ్లిష్ చేశాను. అది మీరు చదవగలరు. షిల్లాంగ్ దాటి ఈస్ట్ ఖాసీ హిల్స్, స్మిత్, మాసిండ్రూ వంటి ప్రాంతాలకు నేను కొంత మంది స్నేహితులతో కలిసి బైక్‌పై ట్రావెల్ చేస్తూ ( Travel ) వెళ్లాను. అప్పుడు కనిపించాయి నాకు ఈ అద్భుతమైన లొకేషన్స్…మీరు కూడా చూడండి.
చాలా బ్యూటిఫుల్ జర్నీ. నరుడు కనిపించలేదు. నేచర్ మాత్రమే కనిపించింది.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.