ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు | Flamingos Festival 2025 Facts

Share This Story

విదేశీ పక్షులకు ఆవాసంగా మారింది తిరుపతిలోని నేలపట్టు బర్డ్ శాంక్చువరి . వేలాది కి.మీ ప్రయాణించి సైబీరియా, రష్యా ( Russia ), ఆఫ్రికా, శ్రీలంకా ( Sri Lanka ) వంటి దేశాల నుంచి వచ్చే ఎన్నో రకాల పక్షులను చూసేందుకు ఏపీ ప్రభుత్వం ఏటా ఫ్లెమింగోస్ ఫెస్టివల్ ( Flamingos Festival 2025 Facts ) నిర్వహిస్తుంది. ఈ ఫెస్టివల్ విశేషాలు ఇవే…

Prayanikudu WhatsApp2
| ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి
నేలపట్టు బర్డ్ శాంక్చువరీ ( Nelapattu Bird Sanctuary ) అనేది తిరుపతిలోని నాయుడుపేట సూళ్లూరుపేట మధ్యలో జాతీయ రహాదారికి చేరువలో వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
50 ఏళ్ల నుంచి విదేశీ పక్షులు ఇక్కడికి వలస వస్తున్నాయి.సహజసిద్ధమైన వాతావరణం, నిండుగా నీరు ఉండటంతో వేలాది పక్షులు ఇక్కడికి వలస వస్తున్నాయి.
చాలా కాలం నుంచి నేలపట్టు, పులికాట్, భీముని వారి పాలెం ప్రజలు వీటిని సంరక్షిస్తూ వస్తున్నారు.
నేలపట్టుకు బర్డ్ శాంక్చువరికి ఎక్కువగా పెలికాన్స్ పక్షులు వస్తుంటాయి.
ముఖ్యంగా బ్రీడింగ్ కోసం విదేశాల నుంచి వచ్చే ఈ పక్షుల కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తుంటారు.
15 కిమీ వరకు వెళ్లగలిగిన ఈ పక్షులు వాటికి కావాల్సిన ఆహారాన్ని తెచ్చుకుంటాయి.
ఇక్కడికి పక్షి ప్రేమికులతో పాటు, పర్యావరణవేత్తలు, ఇతర పరిశోధకులు, బర్డ్ వాచర్స్, టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు.
వీరి కోసం ఎత్తైన ప్రాంతాల నుంచి వీక్షించే విధంగా వాచ్ టవర్స్ ఏర్పాటు చేశారు.
2025 లో జనవరి 17 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ఇక్కడ సందర్భకుల కోసం విజిటింగ్ హార్స్ ఉంటాయి.పర్యాటకుల కోసం రిసార్ట్స్, అందమైన రోడ్లు, పార్కులు నిర్మించారు.

Related Stories:

మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఈ అందమైన పక్షుల పండగకు వెళ్లేందుకు ప్రయత్నించండి. ఒక వేళ మీరు గతంలో ఫ్లెమింగో ఫెస్టివల్‌కు వెళ్లి ఉంటే కామెంట్ చేసి ఆ అనుభవాలను మాతో పంచుకోండి.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

ప్రపంచ యాత్ర గైడ్

Share This Story

Leave a Comment

error: Content is protected !!