12 నెలల్లో ఆసియాలోని 12 దేశాలను చుట్టేయండి | 12 Destinations in Asia

Share This Story

నెలకో డెస్టినేషన్ చొప్పున ఆసియాలో 12 నెలలకు సరిపోయే విధంగా 12 దేశాలను ( 12 Destinations in Asia )  మీకు సూచించబోతున్నాను. స్పెషల్ టైమ్, వేడుకలు ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మీ కోసం ఈ జాబితా సిద్ధం చేశాను.

ఈ రోజుల్లో టూరిస్టు అవడం అంత కష్టం కాదు. నాలుగు రాళ్లు, నాలుగు రోజుల సెలవు, నాలుగు రోజులు వీసా గడవు ఉంటే దేశం దాటేయొచ్చు. విదేశాల్లో ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఏ టైమ్‌లో ఎక్కడికి వెళ్లాలి అని తెలిస్తేనే కదా వేగంగా విహారయాత్ర ( Travel ) పూర్తి చేయగలము. అందుకే ఈ రోజు నెలకో డెస్టినేషన్ చొప్పున ఆసియాలో 12 నెలలకు సరిపోయే విధంగా 12 దేశాలను మీకు సూచించబోతున్నాను. 

స్పెషల్ టైమ్, వేడుకలు ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మీ కోసం ఈ జాబితా సిద్ధం చేశాను : –

1. జనవరి | సీయేమ్ రీప్, కాంబోడియా 

Biggest Hindu Temple in World : మీకో విషయం తెలుసా ?  ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం మన దేశంలో లేదు. ఇది కాంబోడియా దేశంలోని సియామ్ రీప్ అనే ప్రాంతంలో ఉంది. 

Angkor Wat, Combodia- Unsplash
| Image : Unsplash

Siem Reap, Cambodia :  యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన అంగ్‌కోర్ వట్ ( Angkor Wat ) అనేది అతి పురాతనమైన శ్రీ మహావిష్ణువు ఆలయం. జనవరిలో ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. దీంతో పాటు ఇక్కడ నైట్ మార్కెట్ మీకు తప్పకుండా నచ్చుతుంది.

2. ఫిబ్రవరి | హోయ్ ఆన్, వియత్నాం 

Hoi An, Vietnam- pexels
Hoi An, Vietnam- pexels

Hoi An, Vietnam : మన దేశంలాగా వియత్నాంలో కూడా కొత్త సంవత్సరాన్ని రెండు సార్లు సెలబ్రేట్ చేస్తారు. ఒకటి జనవవరి 1వ తేదీన తరువాత టెట్ అనే లూనార్ న్యూయర్‌ను ( Lunar New Year -Tết ) సెలబ్రేట్ చేస్తారు. మరీ ముఖ్యంగా హోన్ అన్ అనే ప్రాంతంలో కొత్త సంవత్సరం సందర్భంగా పూర్తిగా కొత్త వియత్నాంను చూస్తారు మీరు. ఈ ప్రాంతం పురాతనమైన నిర్మాణ శైలికి, రుచికరమైన భోజనానికి, అందమైన బీచులకు చాలా ప్రసిద్ధి చెందింది. 

3. మార్చి | చియాంగ్ మై , థాయ్‌లాండ్ 

Chiang Mai, Thailand : థాయ్‌లాండ్ వెళ్లడానికి మార్చి ఫిబ్రవరి అంటూ మంచి టైమ్ కోసం వెతికే అవసరం లేదు. అయితే మార్చి నెలలో సోంగ్‌క్రాన్ వాటర్ ఫెస్టివల్ ( Songkran Water Festival ) జరుగుతుంది. ఇది థాయ్‌లో ఉగాదిలాంటిది. థాయ్ సంప్రదాయం ప్రకారం ఈ రోజున వారు ఆలయాలకు వెళ్తారు. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెబుతారు.

చియాంగ్ మై నగరం అనేది థాయ్ సంప్రదాయాన్ని అందంగా చూపే ఒక మ్యూజియం లాంటిది. సోంగ్‌క్రాన్ సమయంలో మీరు నగరంలో ఎక్కడికి వెళ్లినా అందమైన అలంకరణలు కనిపిస్తాయి. కొత్త రకం ఫుడ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.ఇక్కడి డోయ్ సుతెప్ ఆలయాన్ని (Doi Suthep Temple ) ను తప్పుకుండా సందర్శించండి.

4. ఏప్రిల్ | బొరాకే, ఫిలిప్పిన్స్

Boracay, Philippines-pexels
| image : pexels

Boracay, Philippines :  పర్యాటకం పరంగా మార్చి అనేది ఆఫ్ సీజన్ ఇక్కడ. అందుకే మీరు ఇక్కడి అందమైన బీచుల్లో ప్రశాంతంగా ఎంజాయ్ చేయవచ్చు. చలికాలం, వర్షాకాలం ఎండింగ్‌లో ఇక్కడ రద్దీ చూసి చాలా మంది ఇది బీచా లేక రచ్చా అనుకుంటారు. బొరకే అనేది చాలా పాపులర్ బీచ్ డెస్టినేషన్. ఏప్రిల్లో వస్తే అంత పోటీ ఉండదు. చక్కగా బోటు తీసుకుని దగ్గర్లోని ద్వీపాలను చుట్టేయొచ్చు. దీంతో పాటు స్కోర్కిలింగ్ చేస్తూ పగడపు దిబ్బలను ( Coral Reefs) ను చూసేయొచ్చు.

5. మే | కౌలాలంపూర్, మలేషియా

Kuala Lumpur, Malaysia : మలేషియా ట్రిప్పును మీరు మంచి బడ్జెట్‌లో ప్లాన్ చేసుకోవచ్చు. చాలా దేశాలతో పోల్చితే ఇక్కడ ట్రావెలర్స్‌ మరీ అంత ఖర్చు చేసే అవసరం ఉండదు. మే సమయంలో వెళ్తే మీరు ఇక్కడి ఐకానిక్ పెట్రోనాస్ జంట భవనాలు ( Petronas Twin Towers ) ను ఎలాగూ చూడొచ్చు…దీంతో పాటు స్థానిక బటు గుహలకు ( Batu Caves)  కూడా వెళ్లవచ్చు. నైట్ లైఫ్ ఇష్టపడే వారు జలాన్ అలోర్ నైట్ మార్కెట్‌ను సందర్శించి వెరైటీ అండ్ టేస్టీ ఫుడ్ ఆస్వాదించవచ్చు.

6. జూన్ | తైపీ, తైవాన్  | 12 Destinations in Asia

Taipei, Taiwan : తైవాన్‌ను ప్రపంచ ఎలక్ట్రానిక్ వస్తువుల రాజధాని అని కూడా అనవచ్చు. ఇక్కడ లభించే గ్యాడ్జెట్స్ మరెక్కడా లభించవు. తైపీలోని వైవిధ్యభరితమైన మార్కెట్లు, దీంతో పాటు ఇక్కడ లభించే నాన్‌వెజ్ నూడిల్స్ సూప్ మీరు ట్రై చేయవచ్చు. దీంతో పాటు లోంగ్‌షాన్ ఆలయాన్ని ( Longshan Temple ) ని కూడా మీరు సందర్శించవచ్చు. ఇది గునియిన్ అనే చైనీస్ దేవతకు సంబంధించిన ఆలయం. తనను ఓర్పు, క్షమాగుణానికి ప్రతీకగా చెబుతారు.

7. జూలై | లువాంగ్ ప్రబాంగ్, లావోస్

Luang Prabang, Laos : థాయ్‌లాండ్, వియాత్నం దేశాలకు దగ్గర్లో ఉన్న ఈ దేశానికి ఇప్పుడిప్పుడే భారతీయులు అధిక సంఖ్యలో వెళ్తున్నారు. థాయ్‌లాండ్ వెళ్లడానికి ముందు, లేదా థాయ్‌లాండ్ నుంచి వెళ్లే ముందు చాలా మంది లువాంగ్ ప్రబాంగ్‌కు వెళ్తుంటారు. 

ఈ స్టోరిపై WEB STORY కూడా చూడండి!

Places in Laos : ప్రపంచ వారసత్వం సంపదగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రాంతంలో 100 సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. ఇక్కడి గల్లీల్లో మీకు ఒకవైపు పురాతన బౌద్ధ కట్టడాలు కనిపిస్తే, మరోవైపు ఫ్రెంచు వాళ్ల నివాసాలు కనిపిస్తాయి. నదిలో ( Mekong River ) కలిసిపోయినట్టు ఉండే అడవి కనిపిస్తుంది. గుడిలో వెలిగిపోతున్న బౌద్ధ సన్యాసుల చిరునవ్వు కనిపిస్తుంది. 

మరింత సమాచారం కోసం ఈ ప్రాంత అధికారిక వెబ్‌సైట్ చూడండి .

8. ఆగస్టు | హా లాంగ్ బే , వియత్నం

Ha Long Bay, Vietnam : వియత్నాం లోని హాలాంగ్ బే అనేది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడి బీచులు ఎంత అందంగా ఉంటాయో అంతే చిన్నగా ఉంటాయి. నీటిలోంచి ఇప్పుడే బయట పడ్డట్టు ఉండే పచ్చని కొండల అనేవి విచిత్రంగా అందంగా కనిపిస్తాయి.

Ha Long Bay, Vietnam- pexels
| Image: pexels

ఇక్కడ మీరు ఓవరైట్ క్రూజ్( Halong Bay Cruise) తీసుకోవచ్చు. ఈ ప్రయాణంలో  మొదటి రోజు ఉదయం నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడి క్రిస్టల్ క్లియర్ నీటిలో స్మిమ్మింగ్ చేయవచ్చు . దీంతో పాటు కాయకింగ్ కూడా చేయవచ్చు.

9. సెప్టెంబర్ | సియోల్ , దక్షిణ కొరియా

Seoul, South Korea : దక్షిణ కొరియాకు సోల్ లాంటిది సియోల్. ఇక్కడ జనాలు మర్యాద శాస్త్రం పుస్తకాన్ని ప్రతీ రోజు చదివినట్టు చాలా మర్యాదగా ఉంటారు. సెప్టెంబర్ నెలలో మీరు సియోల్‌లోని గియాంగ్‌బోక్‌గుంగ్ అనే ప్యాలెస్ ( Gyeongbokgung Palace ) సందర్శించవచ్చు. కొరియన్ రాజుల కాలం నాటి ఈ కోట, దాని ప్రాంగణం నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. నేటికీ ఈ కోటను సైనికులు పహరా కాస్తారు.

గార్డ్స్ డ్యూటీ మార్చే సమయంలో విన్యాసాలు చూసేందుకు చాలా మంది వెళ్తుంటారు. దీంతో పాటు ఇక్కడి మియాంగ్ గోండ్ నైట్ మార్కెట్‌ ( Myeong Dong Night Market ) ను మీరు సందర్శించవచ్చు.సియోల్‌లో ట్రెండీగా ఉండే ప్రదేశాలను చూడాలి అనుకుంటే మీరు హోంగ్డే ( Hongdae ) అనే ప్రాంతానికి వెళ్లవచ్చు.

10. అక్టోబర్ | బాలి, ఇండోనేషియా 

Bali, Indonesia : బాలి సముద్ర తీరాలు, బాలి సూర్యోదయం , సూర్యాస్తమయం చూడటానికి ఏడాది మొత్తంలో ఎప్పుడైనా వెళ్లవచ్చు. అయితే అక్టోబర్‌లో ఇక్కడ జరిగే గలుంగాన్ వేడుకను ( Galungan Festival ) చూసేందుకు చాలా మంది వస్తుంటారు. ఈ సమయంలో ఇక్కడ బాలి ఆచారాలు, సంప్రదాయాలను వాటి ఒరిజినల్ రూపంలో చూడవచ్చు. దీంతో పాటు ఇక్కడి ఉలువాటు ఆలయం ( Uluwatu Temple ) చూడవచ్చు. 

11. నవంబర్ | మాకావు , చైనా | 12 Destinations in Asia

Macau, China,Pexels
| Pexels

Macau, China : ఇది చైనాలోని మాకావ్ స్పెషనల్ అడ్మినిష్ట్రేటీవ్ రీజన్. ఒక దేశం రెండు పాలసీలు అనే విధానంలో భాగం అయిన మకావ్ హాంగ్‌కాంగ్‌కు ( HongKong ) చేరువలో ఉంటుంది. యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నగరం గేమింగ్ అండ్ టూరిజిం విషయంలో బాగా పాపాలర్. 

ఇక్కడ ఎన్ని కసీనోలు ( Casino ) ఉన్నాయి అంటే దీనిని ప్రపంచ గాంబ్లింగ్ రాజధాని అని కూడా పిలుస్తుంటారు. చైనీస్, పోర్చుగీస్ మిక్స్ అయిన కల్చర్ ఇక్కడ కనిపిస్తుంది. అందుకే ఇక్కడ చైనీస్, పోర్చుగీస్, ఆసియా ఫ్లేవర్ ఆహారపదార్థాలను మీరు ఎంజాయ్ చేయవచ్చు.

12.డిసెంబర్ | ఫుకెట్ , థాయ్‌లాండ్

Phuket, Thailand : బ్యాంకాక్ తరువాత, చాలా మంది థాయ్‌లాండ్ వెళ్లే ప్రయాణికులు… బాగా ఖర్చుచేసి ఫుకెట్ వెళ్తుంటారు. ఎందుకంటే ఇక్కడి అందమైన బీచులు, వాటర్ స్పోర్ట్స్ బీయర్ ఉన్నా లేకున్నా చియర్స్ చెప్పే మనుషులు ఇవన్నీ పర్యాటకులకు కిక్కునిస్తాయి. ఇక్కడ బోటు తీసుకుని ఫిఫి ఐల్యాండ్‌కు ( Phi Phi Island ) వెళ్లవచ్చు. అక్కడికి వెళ్లి స్కార్కిలింగ్ చేయవచ్చు, పగడపు దిబ్బలను చూడవచ్చు.

ఆసియా ఖండంలోని ( Places To Visit In Asia ) ఈ పర్యాటక స్థలాలను వాటి చరిత్ర, సంప్రదాయాలు, ఆచారాలు, వేడుకలు, గేమింగ్ వంటి పలు అంశాలను గమనించి ఎంపిక చేశాను.. మీ వెసులుబాటును బట్టి ప్లాన్ చేసుకోగలరు.

Watch Video : Pandharpur :  ఒక ఆధ్యాత్మిక ప్రపంచం
Prayanikudu WhatsApp2
| ప్రయాణికుడు వాట్సాప్ గ్రూపులో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Share This Story

Leave a Comment

error: Content is protected !!