విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అది ఉద్యోగం కోసం అయినా లేక జస్ట్ జాలీ ట్రిప్ కోసం అయినా చాలా మంది భారతీయులు సముద్రాలను దాటేస్తున్నారు. అయితే చాలా మందికి వారి వద్ద ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ( Indian Driving License ) ఇండియా బయట కూడా కొన్ని దేశాల్లో పని చేస్తుందని తెలియదు. మరి ఆ దేశాలేమో నేను మీకు చెబుతాను ఈ స్టోరీ నచ్చితే నలుగురికి షేర్ చేయండి.
ముఖ్యాంశాలు
1. అమెరికా |
Indian License In United States Of America : అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో సుమారు ఒక ఏడాది వరకు భారతీయ లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది. అయితే అమెరికాలో రాష్ట్రాన్ని బట్టి రూల్స్ మారుతుంటాయి.అందుకే మీరు స్థానిక చట్టాలపై అవగాహన పెంచుకోండి. మీకు ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్ (international Drivers Permit) అవసరమో లేదో కనుక్కోండి .
2. యునైటెడ్ కింగ్డమ్
యునైటెడ్ కింగ్డమ్ ( United Kingdom ) లో భారతీయు లైసెన్స్‌ను వినియోగించి పర్యటకులు డ్రైవింగ్ చేయొచ్చు. మన లైసెన్స్ అక్కడ 12 నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. 12 నెలల తరువాత మీరు యూకే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి లేదా ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్‌తో డ్రైవింగ్ చేయవచ్చు.
Also Read : Oymyakon : ప్రపంచంలోనే అతిశీతలమైన గ్రామంలో ప్రజలు ఎలా జీవిస్తున్నారు ?
3. కేనడా
Canada : కేనడాలోని చాలా ప్రావిన్స్‌లో భారతీయ డ్రైవింగ్ లైసెన్సును యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఈ రూల్ అనేది ఒక్కో ప్రావిన్సులో ఒక్కో విధంగా ఉంటుంది. అందుకే మీరు మీతో పాటు ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్ క్యారీ చేస్తే మంచిది.
4. ఆస్ట్రేలియా
Australia : కంగారు దేశం ఆస్ట్రేలియాలో కూడా ఇండియన్ డ్రైవింగ్ లెసెన్స్ చెల్లుబాటు అవుతంది. అయితే మీతో పాటు ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్ కూడా క్యారీ చేయండి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కాలం ఉండటానికి లేదా కార్ అద్దెకు తీసుకోవడానికి మీకు ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్ అవసరం పడే అవకాశం ఉంది.
5. న్యూజీలాండ్
New Zealand: ఇండియన్ లైసెన్స్ అనేది 12 నెలల వరకు న్యూజీలాండ్‌లో చెల్లుబాటు అవుతుంది. అయితే సౌలభ్యం కోసం లేదా కార్ అద్దెకు తీసుకోవడం కోసం ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్ ఉండే బెటర్
6. సింగాపూర్
Singapore : సింగాపూర్‌లో మీరు ఇండియన్ లైసెన్స్‌తో (indian driving license) 12 నెలల వరకు ట్రావెల్ చేయొచ్చు. 12 నెలల తరువాత లోకల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్ ఉంటే కూడా సరిపోతుంది.
7. మలేషియా
మలేషియాలో 90 రోజుల వరకు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ (indian driving license) చెల్లుబాటు అవుతుంది. అయితే ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్ ఉంటే బెస్ట్.
8. సౌత్ ఆఫ్రికా
సౌత్ ఆఫ్రికాలో డ్రైవింగ్ చేయాలనుకుంటే భారతీయ లైసెన్స్ 12 నెలల వరకు సరిపోతుంది. అయితే ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్ ఉంటే మీకు స్థానిక అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీంతో పాటు లోకల్ వెహికల్ రెంటుకు తీసుకోవాలి అనుకుంటే ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్ (international Drivers Permit) బాగా ఉపయోగపడుతుంది.