ఎండా కాలం, వర్షాకాలం, చలికాలంలో మీకు ఏ సీజన్ ఇష్టమంటే చాలా మంది చలికాలమే అని చెబుతారు. లైఫ్ కాస్త లేజీగా కాస్త క్రేజీగా ఉంటుంది .
అయితే క్షణాల్లో గడ్డకట్టుకుపోయే చలిలో ఉండమంటే మాత్రం ఈ చలికాలం ఇష్టం అన్నవాళ్లే వామ్మో మేము ఉండలేము అంటారు.
అలాంటిది ప్రపంచంలోనే అత్యంత శీతలమైన నివాసిత ప్రాంతం ఓమ్యాకాన్ అనే గ్రామంలో ప్రజలు ఎలా జీవిస్తున్నారో తెలుసుకుందామా ?
ఓమ్యాకాన్ ఎక్కడ ఉంది ?
Where Is oymyakon ? | ఓమ్యాకాన్ అనేది రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉంది. ఇది భూమిపైనే అత్యంత శీతలమైన నివాసిత ప్రాంతం.
Also Read : Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
ఈ ప్రాంతంలో ఉండేది ఒకే ఒక సీజన్. అది చలికాలం మాత్రమే. ఇక్కడ ప్రతీ రోజు మంచు తుపానులు వస్తుంటాయి. ఎందుకంటే ఇది ఆర్కిటిక్ సర్కిల్ నుంచి కొన్ని మైళ్ల దూరంలోనే ఉంటుంది. అందుకే ఇక్కడ ఉష్ణోగ్రతలో ఉష్ణం ఉండదు.
1.తీవ్రమైన చలి | Extreme Cold In Oymyakon
ఆర్కిటిక్ తరువాత కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యేది ఓమ్యాకాన్‌లోనే. 1933 ఫిబ్రవరిలో ఇక్కడ మైనస్ 67.7 వరకు ఉష్ణోగ్రత నమోదు అయింది.
దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత చల్లనైన నివాసిత ప్రాంతంగా రికార్డు సాధించింది.
- చిన్న కమ్యూనిటీ | Community In Oymyakon
ఓమ్యాకాన్ అనేది మానవ నివాసానికి అంత అనుకూలమైన ప్రాంతం కాదు. కానీ ఇక్కడ ఇప్పటికీ 500 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు.
వీళ్లు ఒకరిపై ఒకరు ఆధారపడి ఇక్కడి వాతావరణానికి తగిన విధంగా నివసిస్తున్నారు. వీళ్ల జీవితం అనేది అత్యంత కఠినమైనది అని చెప్పవచ్చు.
- చలితో పోరాడే యోధులు
How People Live In Oymyakon ? | ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుని బతికేందుకు స్థానికులు ఎన్నో విశిష్టమైన పద్ధతులను పాటిస్తున్నారు.
ఉదాహరణకు : తమ పూర్వికుల నుంచి లోపలి ఉష్ణోగ్రతను బయటికి వెళ్లనీయకుండా ( insulated wooden houses) వెచ్చగా ఉండేలా చేసే యర్ట్స్ ( Yurts ) అనే గుండ్రని ఆకారంలో ఉండే ఇళ్లలో ఉంటారు.
యర్ట్స్ అంటే జంతు చర్మాలతో నిర్మించే గుడారాలు
ఈ గుడారాలను నిర్మించేందుకు ఫెల్ట్ ( Felt ) అనే ఫ్యాబ్రిక్‌ను కూడా వినియోగిస్తుంటారు. ఈ ఫ్యాబ్రిక్‌ను తయారు చేసే విధానం ఏంటంటే కొన్ని గుడ్డముక్కలను ఒకదానిపై ఒకటి పరిచి వాటిని గట్టిగా ప్రెస్ చేస్తారు.
దీంతో అవి కలిసిపోయి ఒక గట్టి క్లాస్ పీస్‌లా చేసిన గుడ్డముక్కగా తయారు అవుతుంది. పాతకాలంలో పెళ్లిళ్లలో వేసే రగ్‌లా, ఇళ్లల్లో పరిచే కార్పెట్‌లా ఉంటుంది.
ఈ ఫెల్ట్‌తో ఇంటిని గోడలను బయటి నుంచి లేదా లోపలి నుంచి కవర్ చేసి చలి నుంచి తమను తాము కాపాడుకుంటారు.
దీంతో పాటు వీళ్లు తమ ఇళ్లను కలపతో కూడా నిర్మించుకుంటారు. వీళ్లలో కొంతమంది టాయిలెట్స్‌ను ఇంటి బయట నిర్మిస్తారు. అక్కడ టాయిలెట్ యాక్టివిటీస్ అనేవి ఒక సాహసయాత్ర అనే చెప్పాలి.
ఓమ్యాకాన్‌లో ఎప్పుడూ ఎముకలు గడ్డకట్టేంత చలి ఉంటుంది. స్నో పడుతూనే ఉంటుంది. దీనికి తోడు ఎండ అంతగా ఉండదు. దాదాపుగా ఉండదు అని చెప్పాలి.
Also Read : Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
- మంచునేలే వారి మట్టినేల
దీంతో ఇక్కడి నేల అంతా కూడా శాశ్వతంగా మంచుతో కవర్ అయి ఉంటుంది. దీనిని పెర్మాఫ్రోస్ట్ ( Permafrost) అని కూడా అంటారు. భూమి ఉపరితం నుంచి సుమారు 2 కిమీ లోపలి వరకు మొత్తం మంచే ఉంటుంది.
దీని వల్ల ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం. వ్యవసాయం అనేది దాదాపు అసాధ్యం. వ్యవసాయానికి బదులు పశువులను పెంచుతారు.
ఇక్కడి వాతావరణాన్ని తట్టుకునేలా ప్రత్యేక శైలిలో ఇళ్లను నిర్మిస్తారు.
5. తీవ్రాతితీవ్రమైన ఉష్ణోగ్రత
Extreme Temperature In oymyakon | ఓమ్యాకాన్‌లో ఉష్ణోగ్రతలు క్షణాల్లో మారిపోతాయి. ఈ గ్రామంలో సంవత్సరం పొడవునా చలి తీవ్రత పెరుగుతూ ఉంటుంది.
తరువాత కొద్దిగా తగ్గుతూ మైనస్ 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరుకు కూడా వెళ్తుంది. చాలా మంది ఉష్ణోగ్రతలో ఈ తీవ్రతను ఎక్స్‌పీరియెన్స్ చేయడానికి ఇక్కడికి వస్తుంటారు
- విశిష్టమైన భోజన విధానం
Dining In Oymyakon | ఒమ్యాకాన్‌కు వచ్చే పర్యటకులు నాలాంటి ప్రయాణికులు ఇక్కడి ఆహారానికి ఫిదా అవుతుంటారు. టూరిస్టులకు స్థానికులు రీన్‌డీర్ అండ్ చేపలతో చేసిన వంటలను వేడివేడిగా వడ్డిస్తుంటారు.
- ఇక్కడి స్థానికులు మాంసాన్ని, చేపలను ఇంటి బయటే పెట్టేస్తారు. బయట ఫ్రిడ్డ్ అంత చల్లగా ఉంటుంది కాబట్టి అవి పాడవవు. అవసరం అయినప్పుడు వీటిని తీసుకుని వండి తినేస్తారు.
- అపురూపమైన వారసత్వం
ఓమ్యాకాన్ అనేది యకూతియా ( Yakutia ) అనే ఘనమైన చరిత్ర కలిగిన ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ కూతియా అనే అరుదైన తెగకు చెందిన ప్రజల నివసిస్తారు. నేటికీ వారి ఆచారాలు, విధానాలు, సంప్రదాయాలు ఓమ్యాకాన్‌లో కనిపిస్తాయి.
యకూతియా జానపదాలు, సంప్రదాయ నృత్యాన్ని, కళారూపాలను పరిరక్షించడానికి స్థానికులు ప్రయత్నిస్తుంటారు.
8. ఎముకల దారి…ఇది యమహా నగరి
ఓమ్యాకాన్‌కు వెళ్లాలి అంటే ఉన్న ఒకే ఒక దారి కొలిమా హైవే ( koly ma highway ) మాత్రమే. దీనిని ముద్దుగా “ఎముకల దారి” అని కూడా పిలుస్తుంటారు.
ఇక్కడి చరిత్ర రక్తసిక్తవర్ణమైన దుష్ట చరిత్ర అని చెప్పవచ్చు. ఈ దారిని స్టాలిన్ కాలంలో నిర్మించారు. అప్పట్లో స్టాలిన్ ఈ రోడ్డు నిర్మాణం కోసం దూర దూరం నుంచి ఖైదీలను ఇక్కడికి పంపించారట.
ఈ దారిలో చాలా మంది ఖైదీలు మాయం అయ్యారు. తరువాత కాలంలో ఇక్కడ రోడ్డు వేసే వారికి నాటి ఖైదీల ఎముకలు కనిపించాయి.
ఎన్ని ఎముకల గూళ్లు కనిపించాయి అంటే ఈ రోడ్డును వారు హైవే ఆఫ్ బోన్స్ ( high way of bones) అని పిలవడం మొదలు పెట్టారు.
9. చూడాల్సిన ప్రదేశాలు
Places To Visit In Oymyakon | ఓమ్యాకాన్ వెళ్లడం అనేది ఒక సాహస యాత్ర. దాంతో పాటు ఇక్కడికి వచ్చే ప్రయాణికుల కోసం స్థానికులు అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్ ఏర్పాటు చేస్తుంటారు.
టూరిస్టులను ఐస్ ఫిషింగ్, స్నోమాబ్లింగ్‌తో పాటు ఇక్కడి పాశానమైన ప్రాంతాల అన్వేషణ కోసం తీసుకెళ్తుంటారు స్థానికులు.
Also Read : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
10. అరోరా బోరియల్స్
Aurora Borealis : ఓమ్యాకాన్ ప్రాంతం ప్రపంచం నుంచి దూరంగా విసిరేసినట్టు ఉంటుంది. ఇక్కడ నార్తెర్న్ లైట్స్ ( northern lights ) అద్భుతంగా కనిపిస్తాయి.
మరీ ముఖ్యంగా చలికాలం రాత్రి సమయంలో ప్రయాణికులు ఈ నేచురల్ లైట్ షోను ఎంజాయ్ చేయవచ్చు.
11. అంతర్జాతీయ ఖ్యాతి
క్షణాల్లో మనుషులను స్మశానంలోకి పంపే చలి ఉండటం వల్ల ఓమ్యాకాన్ అనేది అంతర్జాతీయంగా చర్చల్లో నిలుస్తోంది. ఇక్కడ ప్రయాణికులు, శాస్త్రవేత్తలూ, సాహసికులు,మీడియా హడావిడి పెరిగింది.
దీంతో పాటు చాలా మంది ట్రావెల్ వ్లాగర్స్ కూడా అక్కడికి వెళ్లడంతో ఒమ్యాకాన్ పాపులారిటీ అమాంతం పెరిగింది.
మన ఉమా తెలుగు ట్రావెలర్ కూడా ఓమ్యాకాన్ వెళ్లి వ్లాగ్స్ చేశాడు.
ఇక్కడి చలిలో వీళ్లు వింటర్ ఒలింపిక్స్ నిర్వహిస్తారు. అది కూడా చూడటానికి చాలా మంది ఇష్డపడుతున్నారు.
12. అరుదైన జీవజాలం
Flora and Fauna in Oymyakon : ఇక్కడి కర్కశమైన వాతావరణంలో కూడా కొన్ని జంతువులు పక్షులు ప్రశాంతంగా బతికేస్తున్నాయి.
సైబీరియన్ టైగర్, స్నో లెపర్డ్, అనేక రకాలు పక్షులు స్నోలైఫ్‌కు తగినట్టుగా తమను తాము మలచుకున్నాయి.
ఇక్కడి మొక్కలు కూడా మంచు ప్రపంచానికి తమను తాము మలచుకొని బతికేస్తున్నాయి.
13. ఎక్కువ జీతాలకు ఆశ పెట్టి
ఓమ్యాకాన్‌లో చాలా మంది కొన్ని తరాల నుంచి ఉంటున్నారు. వీరిలో రష్యన్లతో ( Russia) పాటు ఉక్రేయిన్ వాసులు కూడా ఉన్నారు. వీరిని సోవియెట్ యూనియన్ సమయంలో ఎక్కువ వేతనాలకి ఆశ చూపించి ఇక్కడికి తీసుకొచ్చారట.
14. పది నిమిషాల్లో ఖతం
ఇక్కడ వాతావరణం ఎంత చల్లగా ఉంటుంది అంటే ఎవరైనా దుస్తువులు లేకుండా 10 నిమిషాలు బయట నిలబడితే వారి ఆత్మ చలికి వణికి శరీరాన్ని వదిలేసి పారిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే చనిపోతారు.
15. రుస్కీ ఛాయ్
Russki Chai : ఇక్కడ చాలా మంది రుస్కీ ఛాయ్ తాగుతారు. దీని అర్థం రష్యన్ టీ అని కాదు. వోడ్కాను వీళ్లు రుస్కీ ఛాయ్ అంటారు. వోడ్కా తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది అని చెబుతారు ఇక్కడి వాళ్లు.
ఓమ్యాకాన్ గురించి మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో షేర్ చేయగలరు. థ్యాంక్యూ
ముగింపు | This Story Ends Here
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Photo Credit Notes :
- Pexels and Freepik For Oymyakon and General Imaging Purpose.
- Uma Telugu Traveller Thumbnail From Google
- I Don’t Claim Ownership Neither Intended To do so.
- Photos Used For Narrative Purpose
Testing