5 Mesmerizing Caves : భారతదేశంలోని 5 అద్భుతమైన చారిత్రక గుహలు.. వీటిని చూసేందుకు రెండు కళ్ళు చాలవు
5 Mesmerizing Caves : తాజ్ మహల్, ఎర్రకోట, హవా మహల్ వంటి చారిత్రక కట్టడాలతో పాటు, భారతదేశంలో కొన్ని గుహలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇవి గతకాలపు కళా నైపుణ్యానికి, చరిత్రకు నిలువుటద్దాలు. ఈ గుహల చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు, పచ్చని అడవులు, జలపాతాలు వాటికి మరింత శోభను చేకూరుస్తాయి.
అజంతా, ఎల్లోరా గుహలు
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజంతా, ఎల్లోరా గుహలు దేశంలోనే అత్యంత ప్రసిద్ధ రాతి గుహలు. ఈ గుహలు బౌద్ధ, హిందూ, జైన మతాలకు సంబంధించిన శిల్పాలు, చిత్రలేఖనాలకు ప్రసిద్ధి. ఈ గుహల చుట్టూ ఉన్న పచ్చని కొండలు, అడవులు వాటి సహజ అందాన్ని పెంచుతాయి. ఇవి ముంబై నుంచి 300 నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

బాగ్ గుహలు
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న బాగ్ గుహలు ఒక చారిత్రక ప్రదేశం. ఇక్కడ చెక్కిన శిల్పాలు చాలా అందంగా ఉంటాయి. ఇవి ఇసుకరాయి గుట్టలను కట్ చేసి నిర్మించారు. మొత్తం 9 గుహలలో, కేవలం 6 గుహలు మాత్రమే ఇప్పటికీ మంచి స్థితిలో ఉన్నాయి. ఈ గుహల లోపలి భాగాన్ని రంగ మహల్ అని పిలుస్తారు. ఈ గుహల చుట్టూ ఉన్న పచ్చదనం, బాగ్ నది ఈ ప్రదేశానికి మరింత అందాన్ని జోడిస్తాయి. ఈ గుహలు భోపాల్ నుంచి 150 నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Peaceful Countries: ప్రపంచంలోని టాప్ 10 శాంతియుత దేశాలు
బాదామి గుహలు
కర్ణాటకలోని బాదామి నగరంలో బాదామి గుహలు ఉన్నాయి. ఇవి క్రీ.శ. 6వ శతాబ్దంలో చాళుక్యులచే నిర్మించబడినట్లు చెబుతారు. ఈ గుహలు కూడా రాళ్ళను కట్ చేసి నిర్మించారు. వీటిలో హిందూ, జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన శిల్పాలు, కళాఖండాలు ఉన్నాయి. ఈ గుహల లోపల మూడు హిందూ దేవాలయాలు, ఒక జైన దేవాలయం ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
ఉండవల్లి గుహలు
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఉండవల్లి గుహలు ఉన్నాయి. ఈ నాలుగు అంతస్తుల గుహలు కూడా రాళ్ళను కట్ చేసి నిర్మించారు. ఈ గుహలలో వివిధ రకాల శిల్పాలను చూడవచ్చు. ఇక్కడి నుంచి చుట్టూ ఉన్న పచ్చదనం, కృష్ణా నది అందమైన దృశ్యాన్ని చూడవచ్చు.
ఉదయగిరి, ఖండగిరి గుహలు
ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న ఉదయగిరి, ఖండగిరి గుహలు వాటి నిర్మాణ శైలికి, చారిత్రక ప్రాముఖ్యతకు చాలా ప్రసిద్ధి. ఈ గుహలలో శిల్పాలు, శాసనాలు, రెండు రకాల మానవ నిర్మిత గుహలు ఉన్నాయి. ఈ గుహలు జైన మతానికి చెందినవారికి ఒక ముఖ్యమైన యాత్రా స్థలం.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.