Pandharpur : పండరిపురం ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? 7 ఆలయాల దర్శనం
భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే దక్షిణాది కాశీగా, మహారాష్ట్రలొ తిరుపతి అంత ఫేమస్ అయిన క్షేత్రం పండరిపురం ( Pandharpur ) గురించి ఈ పోస్టులో మీకోసం ఎన్నో విశేషాలు షేర్ చేయనున్నాను.
పండరిపురం అనేది మహారాష్ట్ర ప్రజలకు తిరుపతి ( Tirupati ) లాంటిది. ఇక్కడికి వస్తే కాశీకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. అందుకే దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. శ్రీ కృష్ణుడి భక్తులు, విఠలుడి భక్తులు ఇద్దరూ ఇక్కడ భక్తి పారవశ్యంలో మునిగితేలడం మనం చూడొచ్చు.
ముఖ్యాంశాలు
1.పండరిపురం ఎలా చేరుకోవాలి ? | How To Reach Pandharpur
హైదరాబాద్ నుంచి పండరిపురం సుమారు 340 కిమీ దూరంలో ఉంటుంది. అండ్ విజయవాడ నుంచి 560 కిమీ దూరంలో ఉంటుంది. పండరిపురం వెళ్ళాలి అనుకునే భక్తులు కోసం ఆర్టీసీ అండ్ ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి. నేను హైదరాబాద్‌లోని నాంపల్లీ నుంచి ప్రైవేటు బస్సులో బయల్దేరాను. బస్సులోనే ఎందుకంటే నైట్‌లో ఏదైనా ధాబాలో ఆపుతాడు కదా ఆ బ్రేక్ అంటే నాకు చాలా ఇష్టం.
ఇది కూడా చదవండి : Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
అందుకే వీలైనంత ఎక్కువగా బస్సులో వెళ్తాను. కానీ మీ సౌకర్యాన్ని బట్టి ట్రైన్లో, ఫ్లైట్‌లో, మీ సొంత వెహికల్లో ఎలాగైనా వెళ్లొచ్చు. దట్స్ యువర్ ఛాయిస్. ట్రైన్ అయినా ఫ్లైట్ అయినా మీరు పండరిపురం నుంచి 45 కిమీ దూరంలో ఉన్న సోలాపూర్ వరకు మాత్రమే వెళ్లవచ్చు. అక్కడి నుంచి బస్సులో ప్రైవేట్ వెహికల్లో పండరిపురం చేరుకోవచ్చు.
అయితే ఎండాకాలంలో కాకుండా మిగితా సీజన్లో వెళ్లడం బెటర్..ఎందుకో తెలుసుకోవాలంటే మిస్ అవ్వకుండా పూర్తిగా చదవండి.
పండరిపురంలో ఎక్కడ ఉండాలి ? | Where To Stay In Pandharpur
దుబాయ్కైనా ధూల్పేట్కైనా ఎక్కడికి వెళ్లినా మీరు ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్తే ప్రయాణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అందుకే వీలైనంత ముందుగా టికెట్స్ , హోటల్స్ బుక్ చేసుకోండి. అయితే పండరిపురం ఎప్పుడు వెళ్లాలి బెస్ట్ టైమ్ ఏంటి ? లోకల్ ఫెస్టివల్స్ ఏంటో మీకు ఈ వీడియోలో వివరిస్తాను. దాంతో పాటు ఒక్క రోజులో పండరిపురంలోని 7 పవిత్ర క్షేత్రాలను చూపిస్తా. వాటి గురించి వివరిస్తాను.

పండరిపురంలో నేను చంద్రబాఘ నది ఒడ్డున ఉన్న ISKCON Chandrabhaga Guest House లో రూమ్ ముందే బుక్ చేసుకున్నాను. ఫ్యామిలీతో వెళ్లాలి అనుకునేవారికి, దైవ చింతనలో, ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా గడపాలి అనుకునే వారికి ఇస్కాన్ చంద్రభాగా బాగా నచ్చుతుంది. సెట్ అవుతుంది కూడా.
హోటల్ రూమ్స్‌ను తక్కువ ధరకు బుక్ చేసుకునేందుకు కొన్ని ట్రావెల్ యాప్స్ అండ్ వెబ్సైట్ చెక్ చేయండి. కంపేర్ చేసుకుని బుక్ చేసుకుంటే కాస్త డబ్బులు సేవ్ అవుతాయి.
పండిపురం చరిత్ర, కథ
Pandharpur History : పండరిపురం ఒక పవిత్ర నగరం మాత్రమే కాదు ఎన్నో పురాతన దేవాలయాలు కొలువైన ఒక ఆధ్యాత్మిక ప్రపంచం. ఈ భక్తి ప్రపంచంలోకి ప్రపంచ వ్యాప్తంగా నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. చంద్రభాగానదీ తీరం వెంబడి ఎండనకా వాననకా ఇలా క్యూలో నిలబడి స్వామి దర్శనం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు భక్తులు.

సాక్షాత్తు సమస్త జగత్తును నడిపించే వాసుదేవుడు శ్రీ కృష్ణుడే తన భక్తుడి కోసం గుమ్మం ముందు వేచి చూసిన ప్రాంతంలో…మేము వాసుదేవుడి కోసం, ఆ విఠలుడి కోసం మేము వేచి చూడలేమా అనే సంకల్పంతో వేచి చూస్తుంటారు భక్తులు.
ఇది కూడా చదవండి : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
లైన్లో నిలబడిన సమయంలో స్థానిక ప్రజలతో నాకు వచ్చీ రాని మరాఠీలో మాట్లాడి వాళ్లకు వచ్చీ రాని హిందీలో సమాధానం విని..దాన్ని సెర్చ్ చేసి ఈ ప్రాంతానికి సంబంధించి ఎన్నో కథలు తెలుసుకున్నాను.
అయితే అందులో ముఖ్యమైనది మీరు తెలుసుకోవాల్సినవి మాత్రమే మీకు చెబుతాను. అందులో ఒక ప్రశ్న ఏంటంటే శ్రీ కృష్ణుడిని ఇక్కడ విఠోభాగా ఎందుకు పూజిస్తారు.
శ్రీకృష్ణుడి విఠలుడిగా ఎందుకు మారాడు ?
Why did Lord Krishna Become Vithal ? : ఒకప్పుడు తన తల్లిదండ్రులను పట్టించుకోని పుండిరీకుడు అనే వ్యక్తి, ఒక సాధువు మాటలు విని మారిపోతాడు. తల్లిదండ్రుల సేవలో మునిగిపోతాడు. ఎంతలా అంటే అతని భక్తికి మెచ్చి అతన్ని చూడానికి ఒక రోజు రుక్మిణీ దేవి సమేతంగా శ్రీ కృష్ణుడు స్వయంగా ఇంటికి వస్తారు. దేవుడు వచ్చాడని తెలిసినా కూడా…ముందు తల్లిదండ్రుల సేవే ప్రధానం అని నమ్మి…కొద్ది సేపు వేచి ఉండాలని శ్రీకృష్ణుడు రుక్మిణీకి విజ్ఞప్తి చేస్తాడు పుండరీకుడు. ఒక ఇటుకరాయి వారివైపు వేసి దానిపై నిలబడమని త్వరలో వస్తానని చెప్పి కాసేపయ్యాక వస్తాడు. ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Fact
శ్రీకృష్ణుడు రుక్మిణీని వెయిట్ చేయించినందుకు క్షమాపణలు కూడా కోరుతాడు. తనను వెయిట్ చేయించినందుకు శ్రీకృష్ణుడికి కోపానికి బదులు పుండరీకుడిపై విపరీతమైన అభిమానం కలుగుతుంది. తల్లిదండ్రులపై అతనికి ఉన్న భక్తిని చూసి ఏదైనా వరం కోరమని అడుగుతాడు. దాంతో శ్రీకృష్ణుడిని భూమిపైనే ఉండాలని కోరుతాడు పుండరీకుడు. భక్తుడి కోరికను కాదు అనేలేక విఠోభా ఆలయంలో విఠలుడిగా కొలువయ్యాడు శ్రీకృష్ణుడు.
భీమా నది తీరంలోనే మహాభక్తుడు అయిన పుండరీకుడి ఆలయం కూడా ఉంది. భీమా నది అండ్ చంద్రబాగా నది ఒకటే అంటారు. అయితే విష్ణుపాదం అనే ఆలయం నుంచి వాటి పేర్లు మారుతాయి.
పండరిపురం ఎప్పుడు వెళ్లాలి ?
Best Time To Visit Pandharpur : పండరిపురం చలికాలం వెళ్తే బాగుటుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో బెస్ట్ టైమ్ అని ఇక్కడ కనుక్కుంటే తెలిసింది. ఈ టైమ్‌లో పర్యటకులు, నాలాంటి ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. మీరు కూడా ఈ టైమ్‌లో వెళ్లాలి అనుకుంటే మాత్రం ముందుగానే టికెట్లు, రూమ్స్ బుక్ చేసుకోండి.
జూన్ నుంచి సెప్టెంబర్ అంటే వర్షాకాలంలో కూడా వాతావరణన్ని గమనించి ప్లాన్ చేసుకుని రావచ్చు. ఈ సమయంలో భీమా నదీ ( Bhima River ) లో స్నానం ఆచరించడానికి చాలా మంది వస్తుంటారు. ఇంకా ఎండాకాలం ఉక్కపోతతో చాలా మంది ఇబ్బంది పడతారు. టెంపరేచర్ యావరేజ్‌గా 40 డిగ్రీల వరకు ఉంటుంది సమ్మర్లో. ఆలోచించుకోండి మీరే.
పండరిపురంలో వేడుకలు
Festivals and Events In Pandharpur : భక్తుల సందడి వల్ల పండరిపురం ఎప్పుడూ ఒక జాతరలాగే ఉంటుంది. నిత్యం ఒక పండగ వాతావరణం ఉంటుంది.
Pandharpur Wari : మార్చి ఏప్రీల్ నెలల్లో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్ర చేస్తూ పండరి పురానికి చేరుకుని విఠోభాను దర్శించుకుంటారు.
Shravan Sheni Utsav : విఠలుడి జన్మదినం సందర్భంగా జులై ఆగస్టు నెలల్లో జరిగే 21 రోజల ఉత్సవం ఇది.
Karthi Poornima At Pandharpur : కార్తీక పౌర్ణమి సమయంలో అంటే నవంబర్ ఆ సమయంలో చాలా మంది భక్తులు పండరిపురంకు చేరుకుంటారు. ఉపవాస దీక్ష పాటించి భీమా నదిలో స్నానం చేస్తారు..
ఈ స్పెషల్డేస్తో పాటు ఆషాఢంలో భక్తులు లక్షలాది సంఖ్యలో రావడంతో క్యూలైన్ నాలుగు కిమీ వరకు వెళ్తుందట. కనీసం రెండు లేదా మూడు రోజుల సమయం పడుతుందట దర్శనానికి. పైగా ఎక్కడా కూడా కూర్చునే అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు మూవ్ అవతూ ఉండాలట క్యూలో.
ఇది కూడా చదవండి : Places Near Badrinath : బద్రినాథ్‌కు సమీపంలో ఉన్న 6 సందర్శనీయ ప్రదేశాలు
ఆలయంలోకి మొబైల్ అలో చేయరు. క్యూలైన్లో ముందుకు మనం వెళ్తున్నప్పుడు చాలా చోట్ల మీకు మొబైల్ లాకర్స్ అందుబాటులో ఉంటాయి. అక్కడ మొబైల్ డిపాజిట్ చేయొచ్చు.

బాక్రీ | ఒకరకం రోటీ
ఇక్కడ బాక్రీ ( Bakri ), పిట్లా ( Pitla ) ఫుడ్ బాగా ఎక్కువ తింటారు, బాక్రీ అంటే గోదుమలు, లేదా జొన్నలు ఇలా పిండితో చేసే రోటీ. దాంతో పాటు పిట్లా అంటే శనగపిండితో చేస్తారు. నాకు టైమ్‌లేక ట్రై చేయలేదు. మీరు ట్రై చేసి ఉంటే ఎలా ఉందో కామెంట్స్ సెక్షన్లో చెప్పండి.

2. కైకడ్ మహారాజ్ మఠం
Kaikadi Maharaj Math Mandir : పండరిపురంలో లోకల్ ప్లేసెస్ అండ్ టెంపుల్స్ చూడటానికి ఒక ఆటోలో బయల్దేరాను . సాయంత్రం లోపు 5 లేదా 6 ప్లేసెస్ చూపిస్తాను అన్నాడు. దీని కోసం రూ. 800 కు అతనికి ఇస్తానన్నాను. పండరిపురం ఆలయం నుంచి బయల్దేరి పది నిమిషాల్లో కైకడ్ మహారాజ్ మఠానికి చేరుకున్నాను.
ఈ మఠంలో హిందూ దేవీ దేవతలు, పురాణ పురుషులు, మన హిందూ పౌరాణికాలనే వాస్తవిక చరిత్రను.. మనకందించిన రుషులు, మునులు, తపస్విలు, సాధువులు, యుగ పురుషుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఒక్కసారి లోపలికి వెళ్తే మనం మరో ప్రపంచంలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది.

కైకడ్ మహారాజ్ మఠం విఠోభా ఆలయానికి 2 కిమీ దూరంలో ఉంటుంది. కైకడ్ మహారాజ్ అనే సాధువు బోధనలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉంటుంది ఈ మఠం. పిల్లలకు మన హిందూ మతం ( Hinduism ) చరిత్ర చెప్పాలి… అందులోని మహానుభావులు, పుణ్యాత్ముల గురించి వర్ణించాలి అంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ.
3. సంత్ గజానన్ మహారాజ్ మఠం
Sant Gajanan Maharaj Math : గజానన మహారాజ్ మఠంలోకి ఎంటర్ అవ్వగానే చాలా ప్రశాంతంగా, పాజిటీవ్‌గా అనిపిస్తుంది. ఈ ప్లెజెంట్ వాతావరణంలో ఉండాలనుకునే వాళ్ల కోసం రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఆలయం ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో మీకు చూస్తేనే అర్థం అవుతోంది. ఇంతకి చెప్పలేదు కదా ఈ ఆలయం లోపల మొబైల్ తీసుకెళ్లొచ్చు కానీ వీడియోస్ తీయలేము.

ఆలయం లోపల చాలా మంది కూర్చుని ధ్యానం ( Meditation ) చేస్తుంటారు. చాలా ప్లెజెంట్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. గజానన మహరాజ్ అనే సాధువు బోధనల్లో ముఖ్యమైంది మనిషి జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. మన బలాన్ని బలహీనులు, అవసరమైన వారికి అండగా ఉండేందుకు వాడాలి అని ఆయన చెప్పేవారు.
ఇది కూడా చదవండి : Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు
ఆయనకు ఎన్నో రోగాలను నయం చేసే శక్తి ఉండేదని స్థానికులు చెబుతుంటారు. ఒక చనిపోయిన కుక్కని బతికించడం, మంటల్లో కాలుతున్న మంచంపై నిశ్చల్లంగా కూర్చోవడం, కుష్టురోగాన్ని నయం చేయడం ఇలా గజానన మహరాజ్ గురించి చాలా విషయాలు స్థానికులు తెలిపారు.
ఆలయం బయట గుర్రం బండ్లు కనిపించాయి. లోకల్‌గా తిరగడానికి చాలా మంది వీటిని కూడా హైర్ చేసుకుంటారు. కొంచెం కాస్ట్లీ అని ఆటో అతను చెప్పాడు. అతను అలాగే చెప్పాలి కదా….చీప్ అని తెలిస్తే మనం ఆటో ఎక్కం కదా…అసలు విషయం ఏంటో గుర్రం బండిలో ప్రయాణించిన వాళ్లు ఎవరైనా చెప్పండి.
నెక్ట్స్ మనం పండరిపురం ఆలయం నుంచి రెండున్నర కిమీ దూరంలో ఉన్న శ్రీ గోపాల్‌కృష్ణ ఆలయానికి వెళ్తున్నాం. ఈ ఆలయంలో నేను ఎక్కువ సేపు ఉండలేకపోయాను. ఎందుకో మీరే చదవండి.
4.శ్రీ గోపాలకృష్ణ ఆలయం
Sri Gopalakrishna Temple, Pandharpur : ఆటోలో ఉండగానే డ్రైవర్ కొన్ని విషయాలు చెప్పాడు శ్రీ గోపాల్‌కృష్ణ ఆలయంలో బాగా డబ్బు అడుగుతారు మీరు ఇవ్వకండి అని. సరే అని మెట్లు ఎక్కుతోంటే స్టార్టింగ్‌లోనే రూ. 25 రూపాయలు ఇచ్చి దర్శనం చేసుకోండి అని పంతులుగారు అడిగారు. నేను ఒకసారి సీరియస్‌గా చూసి ముందుకు వెళ్లాను. లోపల కెమెరా అలో లేదు అన్నారు. కానీ చాలా మంది వీడియోలు తీస్తుంటంతో నేను కూడా తీశాను.

గోవర్ధన పర్వతంపై ఉన్న ఈ ఆలయంలో ఉన్నో ఉపాలయాలు ఉన్నాయి. ప్రతీ ఉపాలయం దగ్గర ఒక పంతులు ఉంటాడు. అతని కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే చాలా డబ్బులు అడిగేస్తాడు. చాలా అన్కంఫర్టుబుల్గా అనిపించింది.
ఇది కూడా చదవండి : షిరిడీ సమాధి మందిరానికి ముందు అక్కడ ఏముండేది ?
ఆలయ చరిత్ర
పద్మపురాణం ప్రకారం శ్రీ కృష్ణుడు ( Lord Krishna ) రాధతో చాలా క్లోజ్‌గా ఉండటం చూసి రుక్మిణీదేవికి కోపం వచ్చి బయటికి వెళ్లిపోతుంది. ఆమెను వెతుకుతూ గోపాలకులతో కలిసి ఇక్కడికి వచ్చాడ శ్రీకృష్ణుడు. ఆయన రుక్మిణీ కోసం ముందుకు వెళ్తుంటే గోపాలకులు ఆవులతో కలిసి ఇక్కడే వేచి చూశారట. ఈ ఆలయం చూడటానికి ఒక గోపురంలా ఉంటుంది. చాలా మంది ఇక్కడ రాథా కృష్ణ గోపాల కృష్ణ…గోపాల కృష్ణ రాధా కృష్ణ అని పాడు ఒప్పుల కుప్ప ఆడుతారు. నాకు ఈ సంప్రదాయం బాగా నచ్చింది. మరి మీకు ?
5.విష్ణుపాద ఆలయం
Vishnu Pada Temple, Pandharpur : నెక్ట్స్ మనం విష్ణువు పాదాలను చూడటానికి వెళ్తున్నాం. ఈ ఆలయాన్ని విష్ణుపాద ఆలయం అంటారు. చంద్రభాగా నది మధ్యలో ఈ ఆలయం ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో దర్శనం సాధ్యం కాదు అని తెలిసింది. దాదాపు మూడు నెలల పాటు ఈ ఆలయం నీటిలో మునిగే ఉంటుందట.

సో విష్ణు పాదాలను దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ శ్రీ మహావిష్ణువు పాదాల గుర్తులను మనం ఒక రాత్రారిపై చూడవచ్చు. 40 సె.మీ పొడువైన పాద గుర్తుల దర్శించుకుని భక్తులు తరిచిపోతారు.
5.1.నారద ఆలయం
Narad Mandir Pandharpur : శ్రీ మహా విష్ణు పాదం ఆలయం నుంచి చూస్తే నదీ మధ్యలో మునిగి ఉన్న ఒక ఆలయం కనిపిస్తుంది. ఇదే నారదుడి ఆలయం. నారదుడిని దర్శించుకోవడానికి మనం బోటులో వెళ్లాల్సి ఉంటుంది.

మీరు పండరిపురం వస్తే తప్పకుండా ఇక్కడికి వచ్చి చూడండి. మీకు డెఫ్పినెట్గా నచ్చుతుంది. బోటింగ్ చేసే అవకాశం ఉంటే తప్పకుండా చేయండి. పర్సన్‌కి 50 లేదా 100 చార్జ్ చేస్తారు.
7.సంత్ తుకారం ఆలయం
Sant tukaram Mandir, Pandharpur : నెక్ట్స మనం సంత్ తుకారం ఆలయానికి వెళ్తున్నాం. మనం భక్త తుకారం అని కూడా పిలుస్తాం కదా. ఆయన పాండురంగడికి చాలా పెద్ద భక్తుడు.

విగ్రహాన్ని మనస్సులో ప్రతిష్టించు, అది అక్కడే పూజలందుకుంటుంది అని అందరికీ చెప్పేవాడు తుకారాం. ఛత్రపతి శివాజీ మహరాజ్ తుకారాంకు ఎనలేని సంపద ఇస్తానన్ని వద్దన్నాడు తుకారం. భక్తిని మించిన సంపద లేదన్నాడు.
Read Also : Ravana Lanka : రావణుడి లంక ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు
తులసిమాల తయారు చేసే విధానం
Making Of Tulasimala : భక్త తుకారం ఆలయం నుంచి బయటికి వస్తోంటే ఇక్కడ తులసిమాలను తయారు చేయడం చూశాను. తులసిమాల అంటే శ్రీ కృష్ణుడికి చాలా ఇష్టమట. అలాంటి తులసిమాల తయారు చేసే విధానం చూసి ఆశ్చర్యపోయాను. ఎంత కష్టపడి తయారు చేస్తారో ఇక్కడే చూశాను. తులసిమాల గురించి మీకు ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే కామెంట్ చేయండి.
కాశీ ( Kashi ) లాగే పండరిపురంలో కూడా అడుగడుగున ఆలయాలు, మఠాలు ఉంటాయి. అన్నీ చూడాలి అంటే ఒక్కరోజు అస్సలు సరిపోదు. కానీ ఈ రోజు మీకు నేను వీలైనన్ని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రోజు నేను వెళ్తున్న చివరి ప్లేస్.
పండిపురంపై ఒక ట్రావెల్ వ్లాగ్ చేశాను…అది చూడండి. ఈ స్టోరీ బాగా హిట్ అయింది.
Pandharpur : ఒక ఆధ్యాత్మిక ప్రపంచం | 7 Temple Darshan In 7 Hours In Pandharpur
7. సంత గోరాఖంబార్ మఠం
SrI Sant Gora Kumbhar Math : మహారాష్ట్రలో ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. గోరోబా కాకా ( Goroba Kaka ) అని పిలుచుకునే గోర కుంబార్ విఠలుడి భక్తుడు. ఈయనకు ఎనిమది మంది పిల్లలు కాగా వాళ్లు ఒకరి తరువాత ఒకరు మరణించారు. ఇది తెలుసుకుని బ్రాహ్మణుడి రూపంలో పాండురంగడు గోరోబా కాకా ఇంటికి వెళ్తాడు. సమాధిలోంచి పిల్లల పార్థీవ దేహాన్ని తీయించి వారిని తిరిగి బతికిస్తాడట పండరినాథుడు.

మార్నింగ్ దర్శనానికి బయల్దేరి మొత్తం తిరిగి వచ్చే వరకు సాయంత్రం 5 అయింది. బయట లంచ్ చేద్దాం అంటే ఎక్కువ ఆప్షన్స్ కనిపించలేదు. దీంతో ఇస్కాన్ భోజనాలయంలోనే లంచ్ చేసి..రాత్రి ఇస్కాన్ ( ISKON ) ఆలయానికి వెళ్లాం.
ఇది కూడా చదవండి : Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూపిస్తారు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips
నేను ఇస్కాన్ చంద్రభాగాలోనే స్టే చేయడానికి కారణం ఏంటంటే అక్కడి ఆధ్మాత్మిక వాతావరణం. దగ్గర్లోనే ఉండే చంద్రబాగా నది తీరం. సో దేవుడి దర్శనానికి వస్తే వీలైనంత వరకు ఆధ్మాత్మికత చింతనలో మునిగిపోయే భక్తులు ఉండే చోటే ఉండేందుకు ప్రయత్నించండి.
పండరిపురం ట్రావెల్ వ్లాగ్ చూడండి
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ఈ స్టోరీలు కూడా చదవండి
- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
- హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
- Kamakhya Temple : కామాఖ్య దేవీ కథ
- షిరిడీ సమాధి మందిరానికి ముందు అక్కడ ఏముండేది ?
- Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు
- Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
- Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
- 51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?