Jog Falls : భారత దేశంలో 2వ ఎత్తైన జోగ్ జలపాతానికి ఎలా వెళ్లాలి ?  ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం తినాలి ? 

షేర్ చేయండి

కర్ణాటకలోని జోగ్ జలపాతాన్ని ( Jog Falls ) వీక్షించేందుకు ప్రయాణికులకు అనుమతి లభించింది. ఈ జలపాతానికి ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం తినాలి ? చరిత్ర వంటి ఎన్నో విషయాలు మీకోసం అందిస్తున్నాం.

Prayanikudu WhatsApp2
| ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

కర్ణాటకలోని జోగ్ జలపాతాన్ని ( Jog Falls ) వీక్షించేందుకు ప్రయాణికులకు అనుమతి లభించింది. 2025 జనవరి 1వ తేదీ నుంచి మార్చి 15 వరకు పర్యాటకులు జోగ్ జలపాతాన్ని చూడవచ్చు. ఒక్క జోగ్ మేనేజ్మెంట్ ఆథారిటి మెయిన్ ఎంట్రెన్స్‌ మార్గం తప్పా మిగితా ప్రదేశాల నుంచి జోగ్ జలపాతాన్ని వీక్షించవచ్చు. ఈ జలపాతానికి ఎలా వెళ్లాలి ?  ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం తినాలి ? చరిత్ర వంటి ఎన్నో విషయాలు మీకోసం అందిస్తున్నాను.

జోగ్ జలపాతం ఎక్కడుంది | Where is Jog Falls

Jog Falls
| జోగ్ జలపాతం ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది

కర్ణాటకలోని బగల్కోట్ జిల్లాలో ఉంది జోగ్ జలపాతం. ఈ చిన్న పట్టణం ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. అద్భుతమైన చరిత్ర, అదిరిపోయే ప్రకృతి సోయగాల వల్ల చాలా మంది ఇక్కడికి వెళ్లాలి అనుకుంటారు. ఇక జోగ్ జలపాతానికి ఎప్పుడు ఎలా వెళ్లాలో చదవండి.

జోగ్ జలపాతం ఎప్పుడు వెళ్లాలి ? | When To Visit Jog Falls

జోగ్ జలపాతం ( Jog Falls ) వెళ్లడానికి బెస్ట్ టైమ్ వచ్చేసి అక్టోబర్ నుంచి మార్చి మధ్య సమయం. ఈ సమయంలో ఇక్కడ వాతావరణం చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. ఎండాకాలం ఇక్కడ చాలా వేడిగా, ఉక్కపోతగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. ఇక మీరు పండగల సమయంలో వెళ్లాలి అనుకుంటే మాత్రం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో వెళ్లండది. ఈ సమయంలో ఇక్కడ రథ యాత్ర ఉత్సవం ( Jog Rath Yatra ) జరుగుతుంది. 

జోగ్ జలపాతం దగ్గల్లో చూడాల్సివనవి | Places to Visit in Jog

జోగ్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే వీటిని తప్పకుండా చూసేందుకు ప్రయత్నించండి.

Prayanikudu
ఆకాశ గంగలా ఉంటుంది

1.ఉంచల్లి ఫాల్స్ | Unchalli Falls: దట్టమైన అడవిలో ఉన్న అందమైన జలపాతం వచ్చేసి ఉంచాలి జలపాతం. ఇది చూడటానికి చాాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అవకాశం ఉంటే వెళ్లి ప్రకృతిలో మమేకం అవ్వండి.

2. జోగ్ జలపాతం | Jog Falls : ఇది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద జలపాతం. అవకాశం ఉంది కాబట్టి చాలా మంది ఇక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. 

3. అప్సర కొండ | Apsara Konda : అప్సర కొండ పై నుంచి వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రెక్కింగ్ అండ్ ఫోటోగ్రఫికి ఇది చాలా ఉత్తమమైన ప్రదేశం.

4.సిద్దేశ్వర ఆలయం | Siddeshwara  Temple : పరమేశ్వరుడికి అంకితం చేసిన ఆలయం ఇది. ఇక్కడ చరిత్ర, సంప్రదాయం గురించి తెలుసుకోవడానికి మీరు ఇక్కడికి వెళ్లవచ్చు.

5. కవాల కేవ్స్ | Kavala Caves : ఇవి చాలాఅందమైన గుహలు. వీటిని చూసేందుకు చాలా మంది దూర దూరం నుంచి వస్తుంటారు.

జోగ్‌ ఫాల్స్ వద్ద యాక్టివిటీస్ | Activities in Jog Falls 

Jog Falls
జోగ్ జలపాతం

జోగ్ జలపాతం వస్తే మీరు చాటా యాక్టివిటీస్ చేయవచ్చు. అందులో కొన్ని

  1. ట్రెక్కింగ్ | Trekking : జోగ్ వద్ద అనుమతి, అవకాశం ఉంటే మీరు ట్రెక్కింగ్ చేయవచ్చు. ఇక్కడి ట్రెయిల్స్‌లో ట్రెక్కింగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు.
  2. ఫెర్రీ రైడ్ : జోగ్ జలపాతం అందాలు చూడాలంటే మీరు శరావతి నదిలో ( Sharavathi River ) ఫెర్రీ రైడ్ చేయాల్సిందే. 
  3. క్యాంపింగ్ : ఉంచల్లి ఫాల్స్ లేదా అప్సరా కొండ దగ్గర మీరు నైట్ క్యాంప్ కూడా వేసుకోవచ్చు. అక్కడి నుంచి తారామండలాన్ని చూడొచ్చు.
  4. స్విమ్మింగ్ : అవకాశం ఉంటే ఉంచల్లి ఫాల్స్, జోగ్ వద్ద స్విమ్మింగ్ కూడా చేయవచ్చు.
  5. బర్డ్ వాచింగ్ : జోగ్ జలపాతం వద్ద 100 రకాలు పక్షులు కనిపిస్తాయి. పక్షులను ఇష్టపడే వాళ్లు వీటిని చూడవచ్చు.

జోగ్ వద్ద ఏం తినవచ్చు | Food At Jog Falls

  1. గుండ | Gunda : ఇది ఒక లోకల్ స్వీట్ డిష్ దీనిని జొన్న పిండి, నెయ్యితో  తయారు చేస్తారు. 
  2. షెంగా | Shenga :  కారం, పల్లీలు మిక్స్ గ్రైడ్ చేస్తారు. మనం రెగ్యులర్‌గా నెయ్యి అన్నంతో కలిపి తినే పల్లీల పొడి లాంటిదే ఇది.
  3. అక్కి రొటి | Akki Roti : కర్ణాటకలో చాలా పాపులర్ డిష్ ఇది. దీనిని బియ్యం పిండితో తయారు చేస్తారు.

దీంతో పాటు స్థానికంగా లభించే తాజా పండ్లు కూడా మీరు ట్రై చేయవచ్చు.

పనికొచ్చే టిప్స్ | Tips For Visiting Jog

  1. ఉదయం 6 నుంచి 7 మధ్యలో వెళ్తే సూర్యోదయం, జలపాతం అందంగా కనిపిస్తుంది.
  2. వెల్లే ముందు వాతావరణం గురించి తెలుసుకోండి. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో పక్కగా చెక్ చేసి ప్లాన్ చేసుకోండి.
  3. మంచి ట్రెక్కింగ్ షూ, క్యారీ వాటర్, స్నాక్స్ ఇలాంటివి ప్లాన్ చేసుకోండి.
  4. స్థానికుల సంప్రదాయాలను గౌరవించండి. అధికారుల సూచనలు పాటించండి.
  5. నిత్యం మంచి నీరు తాగుతూ ఉండండి. 

Trending Video On : Prayanikudu Youtube Channel

గమనిక : ఈ వెబ్‌సైట్‌లో కొన్ని ప్రకటనలు కనిపిస్తాయి. వీటిని గూగుల్ యాడ్ అనే సంస్థ అందిస్తుంది. ఈ ప్రకటనలపై మీరు క్లిక్ చేయడం వల్ల మాకు ఆదాయం వస్తుంది. 

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Most Popular Stories

ప్రపంచ యాత్ర గైడ్

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!