హైదరాబాద్‌లో అరుదుగా జరిగే ఒక మేళాకు వెళ్లాను. అదే నో యువర్ ఆర్మీ మేళా. భారతదేశ ఆర్మీ ఎలా పని చేస్తుంది, ఎలాంటి ఆయుధాలు వాడుతుంది ? ఎందుకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ జాబితాలో టాఫ్‌ఫైలో ఉందో మీరు ఈ మేళాలో ( Know Your Army Mela 2025 ) చూడవచ్చు.
హైదరాబాద్ గోల్కొండ కోట ప్రాంగణంలో సైనిక సంపత్తిని, సత్తువను చూపించే మేలా నో యువర్ మేళా ప్రారంభమైంది. ఈ మేళాను తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. ఆర్మీ మేళా ప్రారంభించాక ఆయన ఆయుధ సంసత్తిని, ఆర్మీ సాంకేతికను వీక్షించారు.
తేదీలు, టైమింగ్ | Know Your Army Mela 2025 Dates and Timing
ఈ మేళాను తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా ప్రధాన కార్యాలయం ( HG TASA ) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టిలరి సమన్వయంతో నిర్వహిస్తున్నారు. జనవరి 3వ తేదీన మొదలైన ఈ మేళా జనవరి 5వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
లైట్ ఫీల్డ్ గన్
ఈ మేళాలో ప్రధానాకర్షణగా నిలిచిన గన్ ఇది. దీని పేరు 105/37 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్ ఈ2. దీనిని భారత దేశంలో తయారు చేశారు. 72000 మీటర్ల రేంజ్ వరకు ఇది దాడులు చేయగలదు. అవసరాన్ని బట్టి 360 డిగ్రీల వరకు తిప్పగలం. దీని బరువు 2380 కిలోలు. దీనిని ఎత్తైన కొండలపైకి తీసుకెళ్లడానికి చినూక్ హెలికాప్టర్‌ను వాడతారు.
తగ్గదు, టార్గెట్ మిస్ అవ్వదు
ఇక్కడ మీరు చూస్తున్నది యాంటి ట్యాంక్ గైడెడ్ మిసైల్ లాంచర్. శత్రువుల యుద్ధ ట్యాంకులను నాశనం చేస్తుంది.ఇందులోని మిసైల్‌కు టార్గెట్ సెట్ చేసి లాంచ్ చేస్తారు. 4 కిమీ పరిధిలో దీని టార్గెట్ ఎక్కడున్నా సరే పని పూర్తి చేస్తుంది.
స్నైపర్ గన్
రష్యాలో తయారైన డ్రాగునోవ్ స్నైపర్ రైఫిల్ ఇది. శత్రు దేశంలో సైన్యంలో కీలక వ్యక్తులను టార్గెట్ చేయడానికి వినియోగిస్తారు. 1960 నుంచి ప్రపంచ వ్యాప్తంగా దీనిని వియోగిస్తున్నారు.
గ్రెనైడ్ లాంచర్
ఇది ఒక గ్రానైడ్ లాంచర్. ఒకేసారి 6 గ్రెనైడ్‌లను లాంచ్ చేయగలదు. చూడ్డానికే కాదు దీని పెర్ఫార్మెన్స్ కూడా అంతే గొప్పగా ఉంటుంది. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ లాంచర్ సుమారు 5000 గ్రెనైడ్‌లను లాంచ్ చేయగలరు. లోపల గ్రెనైడ్స్ లేకుండానే నాకు కాస్త బరువుగా అనిపించింది.
ఏకే 47
ప్రపంచంలో పిల్లాడిని అడిగినా ఏకే 47 గురించి చెబుతాడు. అంతగా ఇది పాపులర్ అయింది. రష్యాలో పుట్టిన ఈ రైఫిల్ మొత్తం ( Birth Place Of AK 47 ) ప్రపంచాన్ని షేక్ చేసింది. యుద్ధంలో రౌండ్ రౌండ్‌కు మధ్య గ్యాప్ ఉన్న సమయంలో ఎక్కువ మంది సైనికుల ప్రాణాలు పోయేవి. అలా ప్రాణాలు పోయే కాలంలో ఒకేసారి 40 రౌండ్స్ ఫైర్ చేయడం అనేది ఏకే 47 కి ముందు ఎవరూ ఊహించలేదు. 3 కిలోల 150 గ్రాములు ఉండే ఏకే 47 అనేది నిజంగా రైఫిల్లకు టార్చ్ బేరర్ లాంటిదే. .
మెషిన్ గన్
బెల్జియంకు చెందిన 7.62 మిమీ మీడియం మెషిన్ గన్ ఇది. బరువు 24.4 కిలోలు. నిమిషానికి 100 రౌండ్స్ కాల్పులు జరపగలదు. మనం చాలా సినిమాల్లో దీన్ని చూస్తుంటాం. అన్ని గన్‌లకు మేగజైన్ కింది వైపు, లేదా వెనకవైపు ఉంటే మెషిన్ గన్ మ్యాగజిన్ ( దీనిని బెల్ట్ అని కూడా అంటారు ) మాత్రం పక్కవైపు ఉంటుంది. 18000 మీటర్ల రేంజ్ వరకు ఫైర్ చేయగలదు. ఒక్క బెల్టులో మొత్తం 235 రౌండ్స్‌కు కావాల్సిన బులెట్స్ ఉంటాయి.
84 ఎంఎం ఆర్‌ఎల్ ఎంకే 3
84 ఎంఎం ఆర్‌ఎల్ ఎంకే 3 అనేది ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా వాడే లాంచర్ వెపన్. ఇది రాత్రి, పగలు అనే తేడాలేమీ లేకుండా పని చేస్తుంది. చూడటానికి పెద్దగా ఉన్నా అంత బరువుగా ఉండదు. అయితే అందులో రాకెట్ ఉంటే బరువు పెరుగుతుంది.
రెస్పరేటర్
కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ దాడుల సమయంలో ఊపిరి పీల్చుకోవడానికి,బయటి గ్యాస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడే రెస్పిరేటర్ ( Gas Respirator ) ఇది. దీనిని పెట్టుకుని రెండు గంటల పాటు గ్యాస్ ఎఫెక్ట్ నుంచి సురక్షితంగా ఉండవచ్చు.
న్యూక్లియర్ దాడి సమయంలో ఫస్ట్ ఎయిడ్ కిట్
న్యూక్లియర్ ఎటాక్ జరిగితే అప్పుడు ఆ రేడియోషన్ , ఇతర పరిణామాల నుంచి తప్పించుకోవడానికి లేదా గాయాలకు చికత్స చేయడానికి వాడే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇది. ఇది వాడే టైమ్ రావద్దు అనే కోరుకుందాం
టాక్టికల్ రెేడియో సిస్టమ్
ఆర్ స్టార్స్ వీ ఎంకే II 25 W అనేది యుద్ధ సమయాల్లో సైనికుల మాట్లాడేందుకు వినియోగించే కమ్యూనికేషన్ డివైస్. ఇందులో 8 ప్రీసెట్ ఛానెల్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతారు. లెఫ్ట్ హ్యాండ్‌లో ఉన్న డివైజ్‌లో ఒక స్విచ్ ఉంటుంది. దాన్ని ముందు వైపు తిప్ప మాట్లాడాల్సి ఉంటుంది. ఎదుటి వాళ్లు మాట్లాడేది వినాలి అనుకుంటే స్విచ్ వెనకవైపునకు వైపు తిప్పాల్సి ఉంటుంది.
మ్యాగజైన్స్, రాకెట్స్, గ్రెనైడ్స్
ప్రతీ ఆయుధానికి ఒకో రకమైన పేలుడు పదార్థంతో ఉన్న పేలోడ్ కావాలి. దాని గురించి కూడా మీరు ఈ మేళాలో తెలుసుకోవచ్చు.
శౌర్య పురస్కారాలు
యుద్ధ సమయంలో, విధులు నిర్వర్తిస్తూ సమయంలో దేశం కోసం అత్యున్నత బలిదానం ఇచ్చిన సైనికులకు మరణానంతరం పరమ వీర్ చక్ర ఇస్తారు. దేశం కోసం వీరోచితంగా పోరాడిన సైనికులకు మహావీర్ చక్ర, వీర్ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర, సేనా మెడల్స్ ఇస్తుంటారు.
7.62 ఎంఎం సిగ్ సువేర్ | 7.62 MM Sig Sauer
అమెరికాలో పుట్టిన ఈ సిగ్ సువేర్ అనే రైఫల్ చూడటానికి చాలా అందంగా కనిస్తుంది. అయితే బరువు కాస్త ఎక్కువే. ఇందులోని మ్యాగజైన్లో 20 బులెట్స్ వరకు ఉంటాయి.
స్నైపర్ సూట్
స్పైపర్ తన ఒక్క పర్ఫెక్ట్ షాట్ కోసం చాలా సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎవరైనా గుర్తు పట్టకుండా ఉండేలా, పరిసరాల్లో కలిపోయేందుకు స్నైపర్ సూట్ ధరింస్తాడు.
ఆర్మీలో చేరాలనుకునే యువత కోసం
ఆర్మీలో చేరి భరత మాతకు సేవలు అందించాలి అనుకునే యువతకు మార్గ దర్శనం చేయడానికి ఒక ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు మీ సందేహాలు తీర్చుకోవచ్చు. ఈ మేళా ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం భారత దేశ సైనిక వ్యవస్థ ఎలా పని చేస్తుంది అని తెలియజెప్పడంతో పాటు సైన్యంలో చేరేలా యువతను మోటివేట్ చేయడం.
మీరు హైదరాబాద్‌లో ఉన్నా దగ్గర్లో ఉన్నా నో యువర్ ఆర్మీకి మేళాకు వెళ్లండి. పిల్లలకు కూడా మన దేశాన్ని రక్షిస్తున్న ఆ శక్తి ఎవరు అనేది తెలియాలి కదా. అందుకే వారిని కూడా తీసుకెళ్లండి.
గమనిక : ఈ వెబ్‌సైట్‌లో కొన్ని ప్రకటనలు కనిపిస్తాయి. వీటిని గూగుల్ యాడ్ అనే సంస్థ అందిస్తుంది. ఈ ప్రకటనలపై మీరు క్లిక్ చేయడం వల్ల మాకు ఆదాయం వస్తుంది.
Trending Video On : Prayanikudu Youtube Channel
- Pandharpur: 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం
- Hemkund Sahib Trek : హిమాలయాల్లో బ్రహ్మకమలం దర్శనం
- Kamakhya Temple: కామాఖ్య దేవీ కథ
- Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం
- Shillong : అందగత్తెల రాజధాని ఫిల్లాంగ్