1938 లో నాటి హైదరాబాద్ సంస్థానం సమయంలో పబ్లిక్ గార్డెన్‌లో తొలి ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. తరువాత 1946 లో ఎగ్జిబిషన్‌ను ఇప్పుడు ఉన్న ప్రాంతానికి తరలించారు. నుమాయిష్ ( Hyderabad Numaish 2025 ) గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు..
హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ( 84th All India Industrial Exhibition ) ఎగ్జిబిషన్ 2025 జనవరి మొదటి వారంలో ప్రారంభం కానుంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ప్రారంభించే అవకాశం ఉంది.
ముఖ్యాంశాలు

2025 జనవరిలో ప్రారంభం కానున్న ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. దీనిని నుమాయిష్ ( Numaiash ) అని కూడా పిలుస్తారు. ఈ నుమాయిష్‌లో సుమారు 1500 కన్నా ఎక్కువ మంది ఎగ్జిబిటర్స్ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ వార్త పబ్లిష్ చేసే సమయానికి కొంత మంది తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. కొంత మంది ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఇంకా కొన్ని రోజులే ఉండటంతో ఈ పనుల్లో వేగం పెరిగింది.

Fun Facts : 2024 లో జరిగిన 83వ నుమాయిష్‌లో 2400 స్టాల్స్ ఏర్పాటు చేశారట.
నుమాయిష్ ప్రారంభతేదీ | Opening Date Of Hyderabad Numaish 2025
సాధారణంగా ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన నుమాయిష్ ప్రారంభం అవుతుంది. గత ఏడాది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుమాయిష్ కూడా ప్రారంభించారు. ఈ సంవత్సరం కూడా ఆయనే ప్రారంభిస్తారు. అయితే తేదీల విషయంలో మాత్రం మార్పు ఉండనుంది. ఈ సారి జనవరి 3వ తేదీన హైదరాబాద్ నుమాయిష్ ( Hyderabad Numaish 2025 ) ప్రారంభం కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో వారం రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించారు. ఈ సమయంలో ఎలాంటి అధికారిక వేడుకలు నిర్వహించరు. అందుకే జనవరి 3వ తేదీన ఎగ్జిభిషన్ ప్రారంభం కానుంది.
ఈ ఎగ్జిబిషన్‌లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సెక్టార్, మల్టినేషనల్ కంపెనీలు కూడా పాల్గొనున్నాయి. ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ విభాగం, ఫైర్ , డిజాస్టర్ మేనేజ్మంట్ విభాగం, జీహెచ్‌ఎంసి, ఆర్టీసి వంటి ప్రభుత్వ విభాగాల కలిసి పని చేయనున్నాయి.
ఎగ్జిబిషన్ సొసైటీ చరిత్ర | History Of Hyderabad Exhibition Society
గత 83 ఏళ్ల నుంచి హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ నుమాయిష్‌ను విజయవంతంగా నిర్వహిస్తోంది. 1938 లో పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యంగా చిన్నా, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు ఈ సొసైటీ ఏర్పడింది. నేటికీ అదే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో ( AIIE ) రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, అడ్వకేట్స్, ఇంజినీర్స్, ఐటీ ఉద్యోగుల వంటి ఎంతో మంది సభ్యులుగా ఉన్నారు.

ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహించే నుమాయిష్ వల్ల వచ్చే ఆదాయాన్ని తెలంగాణలోని 20 విద్యాసంస్థ నిర్వహణకు వినియోగిస్తుంది. దీని వల్ల 30,000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోంది. ఈ సంస్థల వల్ల 2000 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఉపాధి అవకాశాలు లభిస్తోంది. దీంతో పాటు సుమారు 10,000 మందికి ప్రత్యక్షంగా, పరక్షంగా ఈ సొసైటీ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
పబ్లిక్ గార్డెన్‌లో తొలి ఎగ్జిబిషన్ | First Numaish In 1938
1938 లో నాటి హైదరాబాద్ సంస్థానం ( Hyderabad State ) సమయంలో పబ్లిక్ గార్డెన్‌లో తొలి ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. తరువాత 1946 లో ఎగ్జిబిషన్‌ను ఇప్పుడు ఉన్న ప్రాంతానికి తరలించారు. అప్పటి నుంచి ఇక్కడే నిర్వహిస్తున్నారు. 1965 ఈ ఎగ్జిబిషన్ సొసైటీ సిల్వర్ జుబ్లీ, 1998 లో గోల్డెన్ జుబ్లీ, 2015 లో ప్లాటినం జుబ్లీ సెలబ్రేషట్ చేసుకుంది.

నుమాయిష్‌కు ఎలా వెళ్లాలి ? | How To Reach Hyderabad Numaish 2025
హైదరాబాద్ ఎగ్జిబిషన్ లేదా నుమాయిష్ అనేది నాంపల్లిలో ( Nampally Exhibition ) జరుగుతుంది. మీరు మెట్రో రైల్లో వస్తే నాంపల్లి మెట్రో స్టేషన్ లేదా గాంధి భవన్ మెట్రో స్టేషన్‌లో దిగవచ్చు. నుమాయిష్ కోసం హైదరాబాద్ మెట్రో మరిన్నిట్రైన్లను ఈ రూట్లో నడపనుంది. దీని వల్ల హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది.

మెట్రో ట్రైన్ టికెట్లు కొనుగోలు చేయాలకునే ప్రయాణికుల కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రత్యేక కౌంటర్లు ( Metro Train To Nampally Numaish ) కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో పాటు నాంపల్లికి రెగ్యులర్‌గా ఆర్టీసి బస్సులు నడుపుతుంది.
నుమాయిష్ ఎప్పుడు వెళ్లాలి ? | Best Time To Visit Hyderabad Numaish
హైదరాబాద్ ఎగ్జిబిషన్ ప్రతీ ఏడాది జనవరి 1వ తేదీన ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. నుమాయిష్ ప్రారంభం ( Hyderabad Numaish 2025 ) అయిన మొదటి వారంలో ఇంకా స్టాల్స్ ఏర్పాటు అవుతూనే ఉంటాయి. అండ్ ఫిబ్రవరి 15 కు వారం రోజుల ముందు నుంచి ఇక్కడికి వచ్చిన ఎగ్జిబిటర్స్ మెల్లిమెల్లిగా ప్యాకింగ్ చేయడం ప్రారంభిస్తారు.

దీంతో పాటు మొదటి వారంలో చాలా రష్ ఉండే అవకాశం ఉంది. సో, జనవరి 2వ వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారంలో మీరు ఎగ్జిబిషన్ వెళ్తే కంప్లీట్‌గా షాపింగ్ చేయవచ్చు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. ఇవి నేను వ్యక్తిగతంగా గమనించి చెప్పిన పాయింట్స్.
టైమింగ్ | Hyderabad Exhibition Timing
సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 వరకు నుమాయిష్‌లో సందర్శనకు అనుమతి ఉంటుంది. అయితే శనీ ఆదివారాల్లో రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది.
ప్రవేశ రుసుము | For Hyderabad Numaishi 2025 Entry Fee
2024 లో ఎంట్రీ ఫీజు వచ్చేసి పెద్దలకు రూ. 40గా ఉంది. ఈ సంవత్సరం దీనిని రూ.50 కు పెంచారని నిర్వాహకులు తెలిపారు. పిల్లలకు, మహిళలకు ప్రత్యేకంగా ఒక రోజు ఉచితంగా ప్రవేశం కల్పించే అవకాశం ఉంది.
నుమాయిష్ అంటే ?| Meaning Of Numaish
హైదరాబాద్ ఎగ్జిబిషన్‌ను నుమాయిష్ అని కూడా అంటారు. ఎగ్జిబిషన్ అంటే తెలుగులో ప్రదర్శన. ఉర్దూలో నుమాయిష్ .
మరిన్ని టిప్స్ | Tips For Hyderabad Exhibition 2025
- నాంపల్లి ఎగ్జిబిషన్ 2025 లో శని, ఆదివారాల్లో సాధారణంగా కన్నా ఎక్కువ క్రౌడ్ ఉండే అవకాశం ఉంది. సో మీరు వీకెండ్స్‌లో కాకుండా వీక్ డేస్ అంటే సోమవారం నుంచి శుక్రవారం వెళ్లడం ఉత్తమం.
- మీరు మీ సొంత వాహనంలో కాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇక్కడికి వస్తే బెటర్. దీని వల్ల పార్కింగ్ సమస్యను మీరు అధిగమించవచ్చు. మిగితా వారికి కూడా ఇబ్బంది తప్పుతుంది.
- ఇక్కడ మీకు మంచినీరు, వాష్‌రూమ్స్ అందుబాటులో ఉంటాయి. కానీ మీతో పాటు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తే మంచిది.
- ఫుడ్ విషయానికి వస్తే ( Food In Numaish 2025 ) నుమాయిష్ 2025 లో మీకు ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. వివిధ రాష్ట్రాల డిషెస్ కూడా లభిస్తాయి.
- సాయంత్రం 6 నుంచి 9 వరకు ఇక్కడ ( Numaish 2025 ) సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక వీకెండ్ అయితే రద్దీ డబుల్ అవుతుంది. ఇది గమనించి ప్లాన్ చేసుకోండి.
- స్థానిక అధికారులు, నిర్వాహకుల సూచనలు పాటించండి.
- చెత్తను చెత్తబుట్టలో వేయండి. పరిశుభ్రతను, క్యూ పద్ధతి పాటించండి.
గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.
Watch More Vlogs On : Prayanikudu
- Pandharpur: 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం
- Kamakhya Temple: కామాఖ్య దేవీ కథ
- Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం
- Shillong : అందగత్తెల రాజధాని షిల్లాంగ్
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Most Popular Stories
- Sabarimala Facts : 1902 లో కర్పూరం వల్ల అగ్నికి ఆహూతి అయిన శబరిమల ఆలయం… శమరిమలై ఆలయం గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
- హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
- Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
- 51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?
- Borra Caves: బొర్రా గుహలు ఎన్నేళ్ల క్రితం ఏర్పడ్డాయో తెలుసా ? 12 ఆసక్తికరమైన విషయాలు
- Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
ప్రపంచ యాత్ర గైడ్
- అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
- UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
- Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
- Oymyakon : ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామం