భారత దేశంలో ఏ విధంగా అయితే జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే మరి కొన్ని దేశాల్లో ( Countries That Celebrate Republic Day ) ఈ వేడుక చేస్తుంటారు. ఆ దేశాలు ఇవే.

ప్రపంచ వ్యాప్తంగా అనే దేశాల్లో గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా సెలబ్రేట్ చేస్తుంటారు. ప్రజాస్వామ్య దేశంగా అవతరించడం, స్వేచ్ఛవైపు ఒక అడుగు ముందుకు వేస్తూ ఒక దేశ కొత్త ప్రభుత్వ విధానాన్ని , వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రతీకగా గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు. భారత దేశంలో ఏవిధంగా అయితే జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే మరి కొన్ని దేశాల్లో ( Countries That Celebrate Independence Day ) ఈ వేడుక చేస్తుంటారు. ఆ దేశాలు ఇవే.
ముఖ్యాంశాలు
1. భారత్ | Indian Republic Day

- జనవరి 26 :
భారత దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వచ్చినా 1950 జవనరి 26వ తేదీన మన దేశం ఒక గణతంత్ర దేశంగా అవతరించింది. ఈ రోజున భారత రాజ్యంగం అమలులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఢిల్లీలో వైభవంగా పెరేడ్ ( Republic Day Parade India ) నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భారత సైనిక సత్తాని భారతీయులతో పాటు ప్రపంచ దేశాలు వీక్షిస్తాయి. దేశ వ్యాప్తంగా జెండా వందనం జరుగుతుంది. గణతంత్ర దినోత్సవ స్పూర్తి ప్రతీ భారతీయుడిలో కనిపిస్తుంది.
2. పాకిస్తాన్ | Pakistan Republic Day

- మార్చి 23
భారత దేశ దాయాది దేశం పాకిస్తాన్ కూడా గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తుంది. 1940 లోని లాహెర్ రిజల్యూషన్, 1956 లోని ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ప్రకటించిన సందర్భంగా ఈ రోజున రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తారు. ఈ రోజు అక్కడ పరేడ్స్, ఫ్లాగ్ రైజింగ్ వేడుక, ఇతర కార్యక్రమాలు జరుగుతాయి.
3. టర్కీ | Turkey Republic Day

- అక్టోబర్ 29
1923 లో గణతంత్ర దేశంగా అవతరించింది టర్కీ. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 29వ తేదీన అక్కడ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తారు. ఈ సందర్భంగా టర్కీలో వివిధ ప్రాంతాల్లో వైభవంగా పరేడ్ నిర్వహిస్తారు. కాన్సెర్టులు, బాణసంచా కాల్చడం, దేశ భక్తిని రగిలించే కార్యక్రమాలు జరుగుతాయి.
4. నేపాల్ | Nepal Republic Day

- మే 28
2008 లో నేపాల్ రాచరికం నుంచి బయటికి వచ్చి ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని నేపాల్‌లో మే 28వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు. దేశ వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. జెండావందనం, ప్రసంగాలు, ఇతర కార్యక్రమాలు జరుగుతాయి.
5. ఇటలి | Italy Republic Day

- జూన్ 2
ఇటలీలో ఇండిపెండెన్స్‌డే ను ఫెస్టా డెల్లా రిపబ్లికా ( Festa della Repubblica )పేరుతో సెలబ్రేట్ చేస్తారు. 1946 లో ఒక రిఫరెండంతో అక్కడ రాచరికం ( monarchy ) శకం ముగిసింది. ఈ సందర్భంగా జూన్ 2వ తేదీన ప్రతీ సంవత్సరం ఇటలీలోని రోమ్‌లో ( Rome ) వైభవంగా పరేడ్ నిర్వహిస్తారు. దీంతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు.
6. ఫిలిప్పిన్స్ | Philippines Republic Day

- జులై 4
ఫిలిప్పిన్స్ రిపబ్లిక్ దేశంగా ఏర్పడిన సందర్భంగా జులై 4వ తేదీన అక్కడ గణతంత్ర దినోత్సవాన్ని ( Philippine Independence Day ) సెలబ్రేట్ చేస్తారు. ఈ రోజున దేశ వ్యాప్తంగా జెండా వందనం, సాంస్కృితిక కార్యక్రమాలు, కమ్యూనిటీ సెలబ్రేషన్స్ వంటి అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఫిలిప్పినో ( Filipinos ) ప్రజల అస్థిత్వానికి ప్రతీగా దేశం మొత్తం సంబరాలు చేసుకుంటారు.
7.సెర్బియా | Serbia Republic Day

- ఫిబ్రవరి 15
1835 లో మొదటిసారి రాజ్యాంగాన్ని అమలు చేసిన సందర్భంగా సెర్బియాలో ఫిబ్రవరి 15వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు. సెర్బియన్ ప్రజలు ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా దేశ భక్తి పారవశ్యంలో ముగినిపోతారు. అధికారిక కార్యక్రమాలతో పాటు అనేేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. సెర్బియా ఆధునీకరణకు భీజం పడిన రోజుగా ప్రజలు గణతంత్ర దినోత్సవాన్ని భావిస్తారు.
8. అజర్ బైజాన్ | Azerbaijan Republic Day

- మే 28
1918 లో డెమోక్రాటిక్ రిపబ్లిక్ దేశంగా అవతరించింది అజర్ బైజాన్ . ప్రతీ సంవత్సరం మే 28వ తేదీన వైభవంగా గణ తంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ రోజున దేశ వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రముఖుల ప్రసంగాలు, అనేక అధికారిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.