సికింద్రాబాద్ నుంచి “మహా కుంభ మేలా పుణ్య క్షేత్ర యాత్ర” 2వ ట్రైన్ | Maha Kumbh Punya Kshetra Yatra 2

షేర్ చేయండి

మహాకుంభ మేళాకు సికింద్రాాబాద్ నుంచి త్వరలో 2వ ప్రత్యేక రైలు ప్రారంభం కానుంది. మొదటి రైలు మిస్ అయిన వారు ఈ రెండో ట్రైన్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించవచ్చు. ఈ ప్యాకేజి ధర, వసతులు, ఆగే స్టేషన్లు, తేదీలు ( Maha Kumbh Punya Kshetra Yatra 2 ) వంటి వివరాలు మీ కోసం…

ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతున్న కుంభమేళాకు ( Maha Kumbh Mela 2025 ) భారత రైల్వే శాఖ అనేక ప్రత్యేక రైళ్లు నడుపుతున్న విషయం తెలిసిందే. భారత్ గౌరవ్ టూరిస్టు రెలు థీమ్‌లో భాగంగా మహా కుంభ మేలా పుణ్య క్షేత్ర యాత్ర పేరుతో సికింద్రాబాద్ నుంచి తొలి ట్రైన్ ఇటీవలే విజయవంతంగా గమ్యస్థానాన్ని చేరుకుంది.

ఇది 27వ భారత్ గౌరవ్ టూరిస్టు ట్రైన్ కాగా ఇందులో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పించింది ఐఆర్‌సీటీసి ( IRCTC ). మొదటి రైలు మిస్ అయిన ప్రయాణికులు త్వరలో ప్రారంభం కానున్న రెండో రైలు కోసం ప్రయత్నించవచ్చు.

ఈ ట్రైన్ విశేషాలు |

 Maha Kumbh Punya Kshetra Yatra 2
| సికింద్రాబాద్ నుంచి మహాకుంబ్ పుణ్య క్షేత్ర యాత్ర మొదటి ట్రైన్ బయల్దేరినప్పుడు ప్రయాణికులను స్వాగతిస్తున్న రైల్వే సిబ్బంది ( File Photo)

మహా కుంభమేళా పుణ్య క్షేత్ర యాత్ర ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌తో ( Prayagraj ) పాటు మరిన్ని తీర్థక్షేత్రాలను కవర్ చేస్తుంది. దీనికి సంబంధించిన మొదటి ట్రైన్ జనవరి 20వ తేదీన బయల్దేరింది. 8 డేస్, 7 నైట్స్‌ సాగే ఈ యాత్రలో భక్తులకు అనేేక తీర్థ క్షేత్రాలను చూపించారు. మొదటి ట్రైన్ మిస్ అయితే రెండో ట్రైన్ మీ కోసం ఫిబ్రవరిలో అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్‌లో కవర్ అయ్యే తీర్థ క్షేత్రాలు, ఆలయాలు ఇవే !

నిర్ణీత తేదీల్లో సికింద్రాబాద్ నుంచి ప్రయాణం మొదలవుతుంది. ఈ ఆలయాలను దర్శించుకోవచ్చు.

ఈ రైలు ఆగే స్టేషన్లు 

మహా కుంభమేళా పుణ్య క్షేత్ర యాత్ర రెండవ ట్రైన్ ఈ స్టేషన్లలో ప్రయాణికుల కోసం ఆగుతుంగి.అవి భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, ఆంధ్ర ప్రదేశ్ లోని  విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ , వైజాగ్ పెందుర్తి, విజయనగరం

రెండవ ట్రైన్ వివరాలు | Maha Kumbh Punya Kshetra Yatra Second Train Secunderabad

ఒక వేళ మీరు మహా కుంభమేళా పుణ్య క్షేత్ర యాత్ర మొదటి ట్రైన్ మిస్ అయ్యి ఉంటే మీ  కోసం రెండవ ట్రైన్ క్యాచ్ చేసే అవకాశం కల్పిస్తోంది భారతీయ రైల్వే. ఈ ట్రైన్ 2025 ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 21వ తేదీన తన గమ్య స్థానానికి చేరుకుంటుంది.

  • యాత్ర వ్యవధి : 8 డేస్,7 నైట్స్
  • కల్పించే సదుపాయాలు :  ఈ ప్యాకేజీలో ప్రయాణికులకు అన్ని రవాణా సదుపాయాలు కల్పిస్తారు. ఇందులో రైలు, రోడ్డు రవాణా కలిపి ఉంటాయి. దీంతో పాటు నివాస వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. రైలులో ఉన్నా,  బయట ఉన్నా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ సదుపాయం కల్పిస్తారు, ఇందులో రైల్వే ప్రయాణికుల కోసం సిబ్బంది, సెక్యూరిటీ కోసం సీసీకెమెరా, ట్రావెల్ ఇన్సురెన్స్ కూడా ప్యాకేజీలో భాగమే.
  • ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు
టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి ? | How To Book Tickets

మహా కుంభమేళా పుణ్య క్షేత్ర యాత్ర రెండవ ట్రైన్‌ టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్న ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసి పలు అవకాశాలు కల్పిస్తోంది. మీకు ఈ కింది మార్గాల్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు.

  •  ఐ.ఆర్.సి.టి.సి పోర్టల్‌కు వెళ్లి లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు.

http://www.irctctourism.com  లేదా www.irctctourism.com

  •  కాల్ చేసి కౌంటర్ బుకింగ్ చేసుకోవచ్చు : సికింద్రాబాద్ : 040-27702407, 9701360701, 9281495845,  9281495843, 8287932228, 9281030740,  9281030749, 9281030711 & 9281030712 

ప్యాకేజీ / టికెట్ ధర :  Train Package Cost

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!