Arun Yogiraj : అయోధ్యా బాల రాముడి విగ్రహం…హైదరాబాద్‌లో కృష్ణుడి విగ్రహం..చెక్కింది ఒకే శిల్పి

షేర్ చేయండి

అయోధ్యలో బాలరాముడి విగ్రహం చూస్తే చిన్నారి రాముడే స్వయంగా మన ముందు ఉన్నట్టు అనిపిస్తుంది .ఇలాంటి ఒక అద్భుతమైన వేణుగోపాల స్వామి విగ్రహాన్ని ఆయన హైదరాబాద్ ప్రజల కోసం అద్భుతంగా చెక్కాడు అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj).ఈ విగ్రహాం ఎలా ఉంది..ఎక్కడ ఉందో తెలుసుకుందామా..

అయోధ్యలో బాల రాముడి విగ్రహాన్ని కోట్లాది మంది హిందువుల వందలాది సంవత్సరాల కలకు ఒక రూపాన్ని తెచ్చాడు శిల్పి అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj). కర్ణాటకలోకి మైసూరుకు చెందిన అరుణ్ యోగి రాజ్ తన శిల్పాల్లో సూక్ష్మాతి సూక్ష్మ…అంటే చిన్న చిన్న డీటెయింగ్స్‌‌పై కూడా ఫోకస్ చేస్తాడు.

బాలరాముడినే చూసినట్టు | Arun Yogiraj

అందుకే ఆ అయోధ్యలో బాలరాముడి విగ్రహం చూస్తే చిన్నారి రాముడే స్వయంగా మన ముందు ఉన్నట్టు అనిపిస్తుంది .ఇలాంటి ఒక అద్భుతమైన వేణుగోపాల స్వామి విగ్రహాన్ని ఆయన హైదరాబాద్ ప్రజల కోసం అద్భుతంగా చెక్కాడు. ఈ విగ్రహాం ఎలా ఉంది..ఎక్కడ ఉందో తెలుసుకుందామా..

ఇక అయోధ్యలో బాల రాముడిని (Ayodhya Bala Rama) దర్శించుకున్న భక్తులు హైదరాబాద్‌లో కృష్ణుడి విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు.
ఇక అయోధ్యలో బాల రాముడిని (Ayodhya Bala Rama) దర్శించుకున్న భక్తులు హైదరాబాద్‌లో కృష్ణుడి విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు.
హైదరాబాద్‌లోని సీతారాం బాగ్ ప్రాంతంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి (Seetharambagh Venugopala Swamy Temple) ఆలయంలో ఈ విగ్రహాన్ని ఇటీవలే ప్రాణ ప్రతిష్ఠ జరిగింది.
75 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారాం బాగ్ వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామి వారిని భక్తితో కొలిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి అంటారు.
సంతాన భాగ్యం కలగాలి అనుకునే భక్తులు ఇక్కడ స్వామి వారికి ముడుపు కాయ కడితే సంతానం కలుగుతుంది అని భక్తులు నమ్ముతారు.
ఈ ఆలయంలో పరమ శివుడి అద్భుతమైన లింగాన్ని, వినాయుడిని కూడా మీరు దర్శించుకోవచ్చు.
ప్రస్తుతం పునర్‌నిర్మాణ పనుల్లో ఉన్న ఆయలం ఎంతో అందంగా ముస్తాబవుతోంది.
ఈ ఆలయంలో ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని చూసి భక్తులు తన్మయత్వానికి లోనవుతున్నారు.స్వామి ముఖంలో ఉన్న దరహాసం చూసి పరవశానికి గురవుతున్నారు.
ఈ ఆలయాన్ని స్థానికులు కలిసి నిర్వహిస్తున్నారు. ఆలయంలో కృష్ణుడి ప్రతిమను అరుణ్ యోగి రాజ్ చేత చేయిస్తే బాగుంటుంది అని ఆలోచనతో ఆయనను సంప్రదించారు.
వేణుగోపాల స్వామి విగ్రహం ఆగమనం కూడా వేడుకగా నిర్వహించారు ఆలయ నిర్వాహకులు
కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి కళాకారులతో ఊరేగింపు నిర్వహించారు.
అడుగడుగునా భక్తులు స్వామి వారికి భక్తితో స్వాగతం పలికారు.

ఇది కూడా చదవండి : హైదరాబాద్‌లో అరుణ్ యోగిరాజ్ చెక్కిన చక్కని వేణుగోపాల స్వామి విగ్రహం…ఎక్కడ అంటే…

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!