గోవా అంటే బీచులు, అక్కడ పార్టీలు, నేచర్ మాత్రమే గుర్తొస్తాయి. దీంతో పాటు గోవా కార్నివాల్‌ను (Goa Carnival 2025) కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. కలర్‌ఫుల్‌గా ఉండే వాతావరణం, అదిరిపోయే సంగీతం, వాయిద్యాలు సందడి, రంగుల రంగుల వేషాలు…ఇలా భారతీయులు బాగా ఎదురుచూసే కార్నివాల్ ఇదే అవడం విశేషం.
ముఖ్యాంశాలు
కార్నివాల్ తేదీలు | Goa Carnival Dates 2025
ప్రతీ సంవత్సరం నాలుగు రోజుల పాటు జరిగే గోవా కార్నివాల్ సమయంలో గోవా పూర్తిగా కొత్తగా మారిపోతుంది. కలర్‌ఫుల్ పరేడ్స్ (Goa Parades), డ్యాన్సులు ఇవన్నీ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఈ కార్నివాల్ అనేది పోర్చుగీసు (Portuguese) వారి సంప్రదాయం కాగా దీనిని గోవా ప్రజలు తమదిగా మార్చుకున్నారు.

Also Read: గోవాలో తప్పకుండా ట్రై చేయాల్సిన రెస్టారెంట్స్ ఇవే
ఈ కార్నివాల్‌కు మిలియన్ల మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ ఏడాది గోవా కార్నివాాల్ వచ్చేసి ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమై 4వ తేదీ వరకు కొనసాగుతుంది.
- 2025 ఫిబ్రవరి 28న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Pramod Sawant) ఈ కార్నివాల్‌ను ప్రారంభిస్తారు.
- గోవా రాజధాని పనాజీలో ప్రధాన ఈవెంట్స్ జరుగుతాయి.
- మార్చిన 2 వ తేదీన సౌత్ గోవాలోని మార్గోవాలో పరేడ్ జరుగుతుంది.
- మార్చి 3వ తేదీన వాస్కో డా గామాలో ఈవెంట్స్ జరుగుతాయి.
- తరువాత మార్చి4వ తేదీన మఫూజా, మోర్జిమ్స్‌లో ఫ్లోట్ పరేడ్స్ జరుగుతాయి.
గోవాలో కార్నివాల్ జరిగే ప్రధాన ప్రదేశాలు | Goa Carnival 2025 Popular Places
గోవా కార్నివాల్ అంటే ఒక లొకేషన్‌కు మాత్రమే పరిమతం కాదు. గోవా మొత్తంగా కొన్ని పట్టణాల్లో ఇది జరుగుతుంది 👍
- పనాజీ ( Panaji, Panjim) : గోవా రాజధాని అయిన పనాజీ అనేది అద్భుతమైన పరేడ్‌కు వేదికగా నిలుస్తుంది. లైవ్ బ్యాండ్స్, డ్యాన్స్ ప్రదర్శనలు హైలైట్‌గా నిలుస్తాయి.
- మార్గోవా (Margoa) : గోవా వారసత్వం (Goa Heritage) ఏంటో, చరిత్ర ఏంటో తెలుసుకోవాలి అంటే ఇక్కడికి వెళ్లవచ్చు. ఇక్కడ కార్నివల్ సాయంత్రం 5 గంటలకు మొదలవుతుంది. రాత్రి వరకూ కొనసాగుతుంది.
- వాస్కో డ గామా (Vasco da Gama) : కార్నివాల్ సమయంలో ఈ పోర్టు సిటీ సరికొత్తగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పెర్ఫార్మెన్సులు, రుచికరమైన ఫుడ్ (Goa Food) అందించే స్టాల్స్, దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులు ఇక్కడ మీకు కనిపిస్తారు. ఇక్కడ కూడా సాయంత్రం 5 గంటలకే ఈవెంట్స్ ప్రారంభం అవుతాయి.
- మపూసా (Mapusa) : ఇక్కడ స్థానిక ప్రజలు కలిసి నిర్వహించే ప్రదర్శనలు హైలైట్‌గా నిలుస్తాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని (Unity in diversity) ఈ ప్రదేశంలో ఈ కార్నివాల్‌లో చూడవచ్చు. సాయంత్రం 5 తరువాత ఇక్కడ సందడి మొదలవుతుంది.
గోవా కార్నివాల్ చరిత్ర | History Of Goa Carnival
గోవా కార్నివాల్ అనేది 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు గోవాను పాలిస్తున్న సమయంలో ప్రారంభమైంది. మొదట్లో విందు, వినోదం కోసమే చిన్నగా ప్రారంభించగా తరువాత ఇది గోవా ఐకానిక్ ఫెస్టివల్‌గా (Goa Iconic Festival) అవతరించింది. 1960 లో టిమోటియో ఫెర్నాండెజ్ (Timoteo Fernandes) అనే మ్యూజీషియన్ మళ్లీ గోవా ఫెస్టివల్‌కు ప్రాణం పోశాడు. బ్రెజిల్‌లోని రియో కార్నివాల్ (Rio Carnival) నుంచి ప్రేరణ పొంది ఇక్కడ అదే విధంగా కార్నివాల్ నిర్వహించడం ప్రారంభించాడు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.