ద్వారపూడిలోని ఆదియోగి విగ్రహం గురించి 10 ఆసక్తికరమైన విషయాలు | Adiyogi Statue In Andhra Pradesh

షేర్ చేయండి

ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన మహా విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం అయింది. ద్వారపూడిలోని అదియోగి మహా విగ్రహం మహా శివరాత్రి సందర్భంగా 2025 ఫిబ్రవరి 26వ తేదీన ప్రారంభం అవ్వనుంది. పరమశివుడి ఈ మహవిగ్రహం వల్ల (Adiyogi Statue In Andhra Pradesh) స్థానికంగా పర్యాటకం పెరిగే అవకాశం ఉంది. 

మరి ఈ అద్భుతమైన విగ్రహం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా ?

1.ఆదియోగి విగ్రహం 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పు ఉంటుంది. భారత దేశంలో ఉన్న అత్యంత ఎత్తైన మహాశివుడి విగ్రహాల్లో (largest statues of Lord Shiva in India) ఇది కూడా ఒకటి.
2.ఈ విగ్రహం ఆదియోగికి ప్రతిరూపంగా నిలుస్తుంది. అంటే బ్రహ్మండంలో ఆయనే తొలి యోగి. ధ్యానం, యోగాకు ఆయనే ప్రతిరూపం అని చాటి చెబుతుంది..
3. ఈ భారీ ఆదియోగి విగ్రహాన్ని 2025 ఫిబ్రవరి 26వ తేదీన పరమ శివుడికి అత్యంత ఇష్టమైన మహా శివరాత్రి సందర్భంగా ప్రారంభించనున్నారు.
4 ద్వారపూడి అనేది రాజమండ్రి నుంచి 45 నిమిషాల దూరంలో, కాకినాడ నుంచి 90 నిమిషాల దూరంలో ఉంటుంది. సో చాలా మంది ఈ ప్రాంతాల నుంచి ద్వారపూడికి చేరుకోవచ్చు.
5. ఆదియోగి విగ్రహం అనేది ఏపి శబరిమలగా ప్రసిద్ధి చెందిన ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఉంది. ఈ ప్రాంగణం ఒక సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతోంది.
6. ఈ విగ్రహాన్ని అచ్చం కోయంబత్తూలోని ఆదియోగి విగ్రహం లాగే మలిచారు. ఇది భారతీయ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.
7. ఈ విగ్రహం ఆవిష్కరణ జరిగిన తరువాత వేలాది మంది పర్యాటకులను తనవైపు ఆకర్షిస్తుంది అని అంచనావేస్తున్నారు. దీనివల్ల స్థానిక పర్యాటకం ఊపందుకుంటుంది. స్తానికులకు ఆర్థికంగా ప్రయోజనం కలగనుంది.
8. యోగా, ధ్యానాన్ని ప్రమోట్ చేస్తూ తద్వారా ప్రశాంతతను పొందేలా ప్రేరేపిస్తుంది ఆదియోగి విగ్రహం.
9. ఈ మహా విగ్రహాన్ని స్థానిక కళాకారులు ఎంతో కష్టపడి నిర్మించారు. ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ముడిపదార్థాలను వినియోగించారు.
10. ఆదియోగి విగ్రహం సమీపంలో కల్చరల్ పార్కు తో యోగా,ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ టూరిజానికి ఊతం | Dwarapudi Adiyogi Statue Photos

ఆదియోగి విగ్రహం (Adiyogi Statue) అనేది అద్భుతైన నిర్మాణంగా కాకుండా ఇది ఆధ్యాత్మికంగా అత్యంత విశిష్టమైనది అని చెప్పవచ్చు. శాంతిని ,భక్తిని చాటే ఒక వేదికగా మారనుంది ఈ మహా విగ్రహం. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి (Andhra Pradesh Tourism) సరికొత్త ఆకర్షణగా కూడా నిలవనుంది అని చెప్పడంలో సందేహం లేదు.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!