యునైటెడ్ స్టేట్స్ వేవర్ ప్రోగ్రామ్ (Unite States Waiver Program) వల్ల కొన్ని దేశాల ప్రజలు ఎలాంటి వీసా అవసరం లేకుండా (Visa Free US Travel) అమెరికాకు వెళ్లే అవకాశం లభించింది. ఇందులో భాగంగా 90 రోజుల పాటు అమెరికాలో ఉండే అకాశం ఉంటుంది. ఇందులో ఏఏ దేశాలు ఉన్నాయి…అందులో భారత్ పేరు ఉందా అనేది ఈ పోస్టులో మనం తెలుసుకుందాం.
ముఖ్యాంశాలు
ఈ ప్రోగ్రాం వల్ల పర్యాటకం (Tourism), వ్యాపారం, లేదా స్వల్ప వ్యవధికోసం అమెరికా వెళ్లాలని భావిస్తున్న వారికి ప్రయోజనం కలుగుతుంది.
వీసా వేవర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి ? | What Is Visa Waiver Program ?
వీసా వేవర్ ప్రోగ్రామ్ వల్ల కొన్ని దేశాలకు చెందిన ప్రజలకు అమెరికా వెళ్లేందుకు ముందస్తు వీసా అవసరం లేదు. అమెరికాకు వెళ్లి కూడా వీసా పొందవచ్చు. దీని కోసం ప్రయాణికులు డిపార్చర్‌కు ముందే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ (ESTA) పొందాల్సిన అవసరం ఉంటుంది.
ఈ కార్యక్రమంలో బాగంగా అమెరికాకు పర్యటనకు వెళ్లడం, స్నేహితులు, బంధువులను కలిసేందుకు వెళ్లడం, లేదా ఏదైనా కాన్ఫరెన్స్‌కు అటెండ్ అవ్వడం, షార్ట్ టర్మ్ ట్రైనింగ్ కోసం వెళ్లడం లేదా ఏదైనా కాంట్రాక్ట్ గురంచి చర్చించేందుకు వెళ్లడం వంటి చేయవచ్చు.
కానీ ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగం వెతుకడం, లేదా జాబ్ చేయడం, చదువుకోవడానికి వెళ్లడం, శాశ్వత నివాసం చేసే అనుమతి లభించదు.
- ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
వీసా ఫ్రీ ట్రావెల్ చేయగలిగిన దేశాలు | Countries Eligible For US Visa Free Travel
ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 41 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్ చేసే అవకాశం కల్పించారు. అందులో ఉన్న కొన్ని దేశాలు…
- ఆస్ట్రేలియా (Australia)
- జర్మని
- ఫ్రాన్స్
- సింగాపూర్
- సౌత్ కొరియా
- యూకే
- తైవాన్
- రోమానియా
ప్రయాణికుల (travelers) వద్ద తప్పనిసరిగ్గా సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ప్రమాణాలకు అనుగుణంగా వెలువడిన ఈ- పాస్‌పోర్టు (E- Passport) ఉండాాలి. దీంతో పాటు ఈస్టా (ESTA) అనుమతి కూడా ఉండాలి.
ఏ దేశాలకు అర్హత లేదంటే | Visa Free US Travel
వీసా వేవర్ కార్యక్రమంలో భాగంగా అమెరికా (United States Visa) వెళ్లేందుకు కొన్ని దేశాల ప్రజలకు అవకాశం కల్పించలేదు. అందులో నార్త్ కొరియా, ఇరాన్, ఇరాక్, లిబ్యా, సుడాన్, సిరియా, యెమెన్, క్యూబా వంటి దేశాలు ఉన్నాయి.
- ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
మరి ఇండియా సంగతి ? | Visa Free US Travel For Indians ?
పైన ఉన్న దేశాలతో ఇండియాకు పోలికే లేదు.అయితే ఈ కార్యక్రమంలో మన దేశానికి కూడా స్థానం లేదు. ఎందుకంటే భారతీయులు అమెరికా వెళ్లాలి అనుకుంటే తప్పనిసరిగా విజిటర్ వీసా (B1/B2) కోసం అప్లై చేయాల్సిందే. దీనికోసం ముందు అప్లై చేయాలి, ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి దీంతో పాటు వీసా పొందేందుకు అర్హత సాధించాల్సి ఉంటుంది.
- అమెరికన్ వీసా వెవర్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ విజట్ చేయగలరు
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.