కుంభమేళా అనేది హిందువుల ఆచార, సంప్రదాయాలు, సంస్కృతికి, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభ మేళా తరువాత నెక్ట్స్ మహా కుంభ మేళ (Next Kumbh Melas) 144 ఏళ్ల తరువాత రానుంది. ఈ మధ్య కాలంలో కూడా అనేక కుంభ మేళాలు జరగనున్నాయి..వాటి వివరాలు ఈ పోస్టులో చదవండి.
ముఖ్యాంశాలు
అతిపెద్ద ఆధ్యాత్మికం సంగమం
కుంభమేళా అనేది హిందువుల ఆచార (Hinduism), సంప్రదాయాలు, సంస్కృతికి, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. దీంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం కూడా ఇదే అవడం విశేషం. కుంభ మేళా ఎప్పుడు జరిగినా దేశవిదేశాల నుంచి కోట్లాది మంది తరలివస్తారు. ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభ మేళా తరువాత నెక్ట్స్ మహా కుంభమేళా 144 ఏళ్ల తరువాత రానుంది.
కుంభ మేళా విశిష్టత | Significance Of Kumbh Mela
కుంభ మేళా అనేది భారత దేశ వ్యాప్తంగా ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో( Nashik) జరుగుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక సంగమం మాత్రమే కాదు ఈ మేళా అనేది విశ్వాసానికి జీవం పోసే ఒక వేడుక కూడా. ఈ ప్రదేశాల్లోనే కుంభ మేళా జరగడానికి కారణాలు వచ్చేసి ఆ ప్రాంతాలకు ఉన్న స్థలపురాణం, ప్రాధాన్యత, అక్కడి పుణ్య నదులు.
కుంభమేళా జరిగే పవిత్ర క్షేత్రాలు | Kumbh Mela Venues
- ప్రయాగ్‌రాజ్(Prayagraj): ప్రయాగ్‌రాజ్ అనేది గంగా, యమునా, పౌరాణిక విశిష్టత ఉన్న సరస్వతీ నదులు కలిగే సంగమ ప్రదేశం. ఈ ప్రదేశాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు.
- హరిద్వార్ : అప్పటి వరకు హిమాలయాల్లో ప్రవాహించిన గంగానది హరిద్వార్ నుంచి భూతలంపై ప్రవాహించడం మొదలు పెడుతుంది.
- ఉజ్జయిని , నాసిక్: ఉజ్జయినిలో షిప్రా నది (Shipra River), నాసిక్‌లో గోదావరి (Godavari River) నదులను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ నదుల వద్ద ఆధ్యాత్మిక సాధన చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.
కుంభమేళా రకాలు | Types Of Kumbh Mela

కుంభమేళా అనేది ప్రధానంగా మూడు రకాలు. ప్రతీది ప్రత్యేకమే:
- పూర్ణ కుంభ్ | Purna Kumbh: ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అది కూడా పైన వివరించిన ప్రదేశాల్లో మాత్రమే
- అర్థ కుంభ్ | Ardh Kumbh: అర్ధ కుంభ్ అనేది ప్రతీ ఆరు సంవత్సరాలకు ఒకసారి కేవలం ప్రయాగ్‌రాజ్‌లో మాత్రమే జరుగుతుంది.
- మహా కుంభమేళా : కుంభమేళాలోనే అత్యంత విశిష్టమైనది (Importance Of Maha Kumbh Mela) మహా కుంభమేళా.ఇది ప్రతీ 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. అది కూడా కేవలం ప్రయాగ్‌రాజ్‌లోనే.
- ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక సంగమానికి కోట్లాది మంది ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఈసారి 60 కోట్ల మంది హిందువులు పవిత్ర నదీ స్నానం (Holy Bath) ఆచరించారు. ఈ పోస్టు రాసే సమయానికి ఇంకా కుంభమేళా జరుగుతోంది. పూర్తి అయ్యేనాటికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
- Kashi Travel Guide : కాశీ నగరం విశేషాలు…కాశీలో దర్శిచుకోవాల్సిన ఆలయాలు..కాశీ చరిత్ర, కాశీ ట్రావెల్ గైడ్
- సింహస్త కుంభ మేళా: ఉజ్జయినిలో జరిగే కుంభమేళాను సింహస్త కుంభ (Simhastha Kumbh) అంటారు. సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించిన తరుణంలో సింహస్త కుంభమేళా నిర్వహిస్తారు. నెక్ట్స్ జరిగే కుంభమేళా ఇదే ! పూర్తి వివరాలు.
2025 లో ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా తరువాత రానున్న
144 ఏళ్ల వరకు జరిగే కుంభమేళా జాబితా | Next Kumbh Melas
సంవత్సరం | ప్రాంతం | కుంభ మేళా పేరు |
---|---|---|
2025 | ప్రయాగ్‌రాజ్ | మహా కుంభమేళా |
2027 | నాసిక్ | కుంభ మేళా |
2028 | ఉజ్జయిని (Ujjain) | సింహస్త కుంభమేళా |
2033 | హరిద్వార్ | కుంభమేళా |
2035 | ప్రయాగ్‌రాజ్ | పూర్ణ కుంభమేళా |
2038 | నాశిక్ | కుంభ మేళా |
2040 | ఉజ్జయిని | సింహస్త కుంభ మేళా |
2047 | హరిద్వార్ (Haridwar) | కుంభ మేళా |
2048 | ప్రయాగ్‌రాజ్ | అర్థ కుంభమేళా |
2050 | నాసిక్ | సింహస్త కుంభ మేళా |
2052 | ఉజ్జయిని | సింహస్త కుంభమేళా |
2059 | హరిద్వార్ | కుంభ మేళా |
2061 | ప్రయాగ్‌రాజ్ | పూర్ణ కుంభ |
2064 | నాసిక్ | కుంభ మేళా |
2066 | ఉజ్జయిని | సింహస్త కుంభమేళా |
2073 | హరిద్వార్ | కుంభ మేళా |
2074 | ప్రయాగ్‌రాజ్ | అర్థ కుంభ మేళా |
2076 | నాసిక్ | సింహస్త కుంభమేళా |
2078 | ఉజ్జయిని | సింహస్త కుంభమేళా |
2085 | హరిద్వార్ | కుంభ మేళా |
2087 | ప్రయాగ్‌రాజ్ | పూర్ణ కుంభ మేళా |
2090 | నాసిక్ | కుంభమేళా |
2092 | ఉజ్జయిని | సింహస్త కుంభమేళా |
2099 | హరిద్వార్ | కుంభమేళా |
2100 | ప్రయాగ్‌రాజ్ | అర్థ కుంభమేళా |
* 2169 | ప్రయాగ్‌రాజ్ | మహాకుంభ మేళా |
- 2100 నుంచి 2169 వరకు జాబితా చాలా పెద్దగా ఉంటుంది అని ప్రస్తావించలేదు. ఇక మహా కుంభమేళా 2169కు అని కొన్ని చోట్ల 2129 లో అని మరికొన్ని చోట్ల ప్రస్తావించబడి ఉంది. ఇక 144 ఏళ్ల లెక్క ప్రకారం 2169 లో ప్రయాగ్‌రాజ్‌లో నెక్ట్స్ మహా కుంభమేళా జరుతుంది అని చెప్పవచ్చు.
సనాతన ధర్మం విశిష్టతకు ప్రతీక | Sanatan Dharma
అన్ని మేళాల్లో అరుదైన మేళాగా మహా కుంభ మేళాను భావిస్తారు. ఆధ్యాత్మికంగా అత్యధిక ప్రాధాన్యత ఉన్న ఈ మేళాలో భాగం అవ్వడం వల్ల, మేళా జరిగే కుంభమేళాలో నదీ స్నానం చేయడం వల్ల పాపాలు నశించి, మోక్షం లభిస్తుంది అని భావిస్తారు.
మహా కుంభమేళా అనేది ఆధ్యాత్మిక (Spiritual) అనుభూతిని కలిగించే వేడుకగా భావించవచ్చు. ఈ సమయంలో అఖారాల షాహీ స్నానానికి (Shahi Snan) అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఒకే చోట చేరి హిందూ ధర్మంలోని ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం పూజలు, నదీస్నానాలు చేస్తారు.
మహాకుంభమేళా అనేది అత్యద్భుతమైన భారతీయ సనాతన హిందూ ధర్మానికి (Hindu Dharma), దాని విశిష్టతకు ప్రతీకగా నిలుస్తుంది.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.