Maha Shivaratri Packages : మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీలు 

షేర్ చేయండి

ఈ మహా శివరాత్రి సందర్భంగా అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రను చేయాలి అనుకుంటున్నారా ?  అయితే తెలంగాణ టూరిజం శాఖ మీకోసం ప్రత్యేక ప్యాకేజీలను (Maha Shivaratri Packages) తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులను తీసుకెళ్లనుంది. పూర్తి వివరాలు ఈ పోస్టులో… 

ఈ మహా శివరాత్రి సందర్భంగా అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రను చేయాలి అనుకుంటున్నారా ? అయితే తెలంగాణ టూరిజం (Telangana Tourism) శాఖ మీకోసం ప్రత్యేక ప్యాకేజీలను తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలను (Telangana Shaiva Kshetras) భక్తులు సందర్శించవచ్చు.

మీరు హైదరాబాద్ నుంచి జర్నీ ప్రారంభించాలి అనుకున్నా లేదంటే వరంగల్ నుంచి అయినా ప్రతీ ఒక్కరి కోసం ఒక ప్యాకేజీ తీసుకొచ్చింది తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC).

హైదరాబాద్ నుంచి బయల్దేరాలి అనుకుంటున్న భక్తుల కోసం ప్యాకేజీ వివరాలు 

కాళేశ్వరం అనేది కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం (Kaleshwara Mukteshwara Swamy Temple) కొలువుదీరిన ప్రాంతం. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తుంటారు. ఈ ఆలయం ఉన్న ప్రదేశం, భౌగోళిక స్వరూపం, పవిత్రమైన పరిసరాలు ఇవన్నీ కూడా మహా శివరాత్రి సమయంలో మరింత సుందరంగా కనిపిస్తాయి.

రామప్ప దేవాలయం (Ramappa Temple) అనేది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకున్న ఆలయం. ఈ మందిర నిర్మాణ శైలి చూసి ప్రపంచమే విస్తుపోతుంది. 

Ramappa Temple
రామప్ప దేవాలయం

లక్నవరం (Laknavaram) అనేది కాకతీయుల ముందు చూపునకు నిదర్శనంగా చెప్పవచ్చు. లక్నవరం చెరువు నేడు పర్యాటకానికి కేంద్రం అయింది. ఇటీవలే ఇక్కడ మూడవ ద్వీపాన్ని ప్రారంభించడంతో (Laknavaram Third Island) ప్రాధాన్యత మరింతగా పెరిగింది. 

ప్యాకేజీ వివరాలు | Tour Package

  • ప్రయాణం మొదలయ్యే తేదీ, సమయం :  2025 ఫిబ్రవరి 25, రాత్రి 8 గంటలకు
  • ప్రయాణం ముగిసే తేదీ సమయం : ఫిబ్రవరి 26, రాత్రి 8 గంటలకు 
  • ప్యాకేజి ధర : పిల్లలకు రూ. 2,200,  పెద్దలకు రూ.2,750
  • పికప్ పాయింట్ : యాత్రి నివాస్ (రాత్రి 8 గం.లకు), పర్యాటక్ భవన్ (8 గం 20 నిమిషాలకు)
  • ప్యాకేజీలో కల్పించే సదుపాయాలు :  నాన్ ఏసీ బస్సు, హరితా హోటల్‌లో (Haritha Hotel) వసతి.

2. కీసరగుట్ట ( సగం రోజు టూర్ )

ప్యాకేజీ వివరాలు : –

  • ప్రయాణం మొదలయ్యే తేదీ, సమయం : 2025 ఫిబ్రవరి 26  ఉదయం 7.30 ని.
  • ప్రయాణం ముగిసే తేదీ, సమయం : అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు
  • ప్యాకేజి ధర : పిల్లలకు రూ. 360 ,  పెద్దలకు రూ.450

కీసరగుట్ట ఆయలం గురించి : గుట్టపై ఉన్న పరమశివుడి ఆలయం ఇది (Keesaragutta Temple). మహా శివరాత్రి సందర్భంగా ఇక్కడికి దూరదూరం నుంచి భక్తులు వస్తుంటారు. ఈ సగం రోజు టూరు వల్ల మీరు ఉదయం సమయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.

3. వేములవాడ- కోమటి చెరువు

వేములవాడ : వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి (Rajarajeshwara Swamy Temple) ఆలయం గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ఆలయ నిర్మాణశైలి, అద్భుతమైన చరిత్ర భక్తులను దూరదూరం నుంచి వచ్చేలా చేస్తుంది. 

కోమటి చెరువు : వేములవాడకు సమీపంలోనే ఉన్న కోమటి చెరువు (Komati Cheruvu) పరిసరాల్లో ఉండే ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

ప్యాకేజీ వివరాలు : –

  • ప్రయాణం మొదలయ్యే తేదీ, సమయం : 2025 ఫిబ్రవరి 26 ఉదయం 7 గంటలకు 
  • ప్రయాణం ముగిసే తేదీ, సమయం : అదే రోజు రాత్రి 8 గంటలకు
  • ప్యాకేజి ధర : పిల్లలకు రూ. 800  , పెద్దలకు రూ.1,000
Shiva Ratri Festival Special Packages
శివరాత్రి సందర్బంగా తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీలతో భక్తులను శైవ క్షేత్రాల దర్శనభాగ్యం కలిగిస్తోంది | Photo: TGTDC

4. కొమురవెల్లి 

కొమురవెల్లి : కొమరవెల్లి మలన్న స్వామి దేవాలయం (Komuravelli Mallanna Swamy Temple) అనేది మహా శివుడి భక్తులకు అత్యంత ఇష్టమైన దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా భక్తులు పూజలు చేసుకుని ఆధ్యాత్మికంగా సమయాన్ని వెచ్చించవచ్చు.

ప్యాకేజీ వివరాలు : –

  • ప్రయాణం మొదలయ్యే తేదీ, సమయం : 2025 ఫిబ్రవరి 2026, ఉదయం 7.30 నిమిషాలకు
  • ప్రయాణం ముగిసే తేదీ, సమయం : అదే రోజు మధ్యాహ్నం 3.30 ని
  • ప్యాకేజి ధర : పిల్లలకు రూ. 480  , పెద్దలకు రూ.600.

5.  కొత్త కొండ | Maha Shivaratri Packages

కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం (Kothakonda Veerabhadra Swamy Temple) అనేది మహాశివుడికి అంకితమైన దేవాలయం. ఈ ఆలయ ప్రాంగణం, చుట్టుపక్కన బౌగోళిక స్వరూపం అద్భుతంగా ఉంటుంది. 

ప్యాకేజీ వివరాలు : –

  • ప్రయాణం మొదలయ్యే తేదీ, సమయం :  2025 ఫిబ్రవరి 2026, ఉదయం 7 గంటలకు
  • ప్రయాణం ముగిసే తేదీ, సమయం : అదే రోజు రాత్రి 7 గంటలకు
  • ప్యాకేజి ధర : పిల్లలకు రూ.800 , పెద్దలకు రూ.1,000

6. శ్రీశైలం

పన్నెండు జ్యోతిర్లింగాలలో (Jyotirlinga) ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి (Srisailam Mallikarjuna Swamy Temple) ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. మహా శివరాత్రి సందర్భంగా ఇక్కడ అత్యద్భుతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మహా శివరాత్రి సమయంలో, బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదంగా అందిస్తున్నారు.

ప్యాకేజీ వివరాలు : –

  • ప్రయాణం మొదలయ్యే తేదీ, సమయం :  2025 ఫిబ్రవరి 2026, ఉదయం 7 గంటలకు
  • ప్రయాణం ముగిసే తేదీ, సమయం : అదే రోజు రాత్రి 11 గం 30 నిమిషాలకు
  • ప్యాకేజి ధర : పిల్లలకు రూ. 1,440 , పెద్దలకు రూ.1,800

వరంగల్ నుంచి బయల్దేరే భక్తు కోసం | Telangana Tourism Shivaratri Special Tour Warangal

రామప్ప దేవాలయం 

కాకతీయులు శిల్పకళా (Kakatiya Temples) వైభవానికి ప్రతీకగా నిలిచే రుద్రశ్వేర ఆలయం, రామప్ప దేవాలయం. అద్భుమైన సాండ్‌బాక్స్ (Sandbox Technology) సాంకేతికతో నిర్మించబడిన ఈ ఆలయం ఎన్నో భూకంపాలను, ముస్లిం పాలకుల దాడులను తట్టుకుని నేటికీ మనకు స్వామి దర్శనం చేసుకునే భాగ్యం కల్పిస్తోంది. 

ప్యాకేజీ వివరాలు : –

  • ప్రయాణం మొదలయ్యే తేదీ, సమయం :  2025 ఫిబ్రవరి 2026, ఉ.7 గంటలకు
  • ప్రయాణం ముగిసే తేదీ, సమయం : అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు.
  • దీంతో పాటు మధ్యాహ్నం మరో ప్యాకేజీ కూడా ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6.45 నిమిషాల వరకు ఆలయ ఈ ప్యాకేజీలో భక్తులను ఆలయ దర్శనం చేయిస్తారు.
  • ప్యాకేజి ధర : పిల్లలకు రూ.600 , పెద్దలకు రూ.750
  • పికప్ పాయింట్ : హరిత కాకతీయ హోటల్
  • ప్యాకేజీలో కల్పించే సదుపాయాలు : ఏసీ మినీ బస్సులో ప్రయాణం

హైదరాబాద్ నుంచి రెగ్యులర్ ప్యాకేజీ

హైదరాబాద్-యాదగిరిగుట్ట- స్వర్ణగిరి ఆలయం

యాదగిరి గుట్ట (Yadagirigutta Temple) : శ్రీ లక్ష్మీ నరసింహా స్వామివారి (Lord Narasimha Swamy) పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. తెలంగాణ నుంచే కాకుండా స్వామివారిని దర్శించుకోవడానికి దూరదూరం నుంచి, ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు.

స్వర్గగిరి: ఈ మధ్యే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఆలయ శిల్పకళ (Swarnagiri Temple) భక్తులను కట్టిపడేస్తోంది. అనతి కాలంలోనే భక్తులకు ఇష్టమైన ఆలయంగా మారింది స్వర్ణగిరి.

ప్యాకేజీ వివరాలు : –

  • ప్యాకేజీ ఈ 2025 ఫిబ్రవరి 22వ తేదీన ప్రారంభం అయింది. రెగ్యులర్‌గా అందుబాటు ఉంటుంది. 
  • సమయం: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 నిమిషాల వరకు
  • ప్యాకేజి ధర : పిల్లలకు రూ. 1,200, పెద్దలకు రూ.1,500
  • ప్యాకేజీలో కల్పించే సదుపాయాలు : స్వామివారి ప్రత్యేక దర్శనంతోపాటు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తారు.
  • పికప్ పాయింట్ : యాత్రినివాస్, పర్యాటక్ భవన్

మహా శివరాత్రి (Maha Shivaratri Festival 2025) అనేది ఒక పండుగ మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక చైతన్యానికి మారుపేరు. పరమశివుడికి ఇష్టమైన రోజు ఇది. ఈ రోజున స్వామివారిని భక్తితో కొలిచే భక్తులకు తెలంగాణ టూరిజం శాఖ అందిస్తోన్న ఈ ప్యాకేజీలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!