50 Feets Largest Shivling : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద స్వయంభూ శివలింగం

షేర్ చేయండి

ప్రపంచానికి తెలియని వింతలు, ఆధ్యాత్మిక అద్భుతాలు (Spiritual Wonders) మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. అందులో ఈ రోజు మీరు చదవబోయే, ఫోటోల్లో చూడబోయే 50 అడుగుల స్వయంభూ శివలింగం కూడా ఒకటి.

ఈ మహా శివలింగం మన తెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) ఉంది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ శివలింగం ఎక్కడ ఉంది..విశేషాలేంటో తెలుసుకుందామా.

1. ఎక్కడ ఉంది ? | Where Is Largest Shivling Located

50 Feets Largest Shivaling
దూరం నుంచి కూడా కనిపించే అద్భుత లింగం

ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని మాహాదేవిపురం గ్రామంలోని (Mahadevipuram) పచ్చని పంట పొలాలు, కొండల మధ్య కొలువై ఉంది ఈ మహోద్భుతమైన శివలింగం. 

2. స్వయంభూ మహా లింగం

ఇక్కడి మహా శివలింగం స్వయంభుగా (Swayambhu Shivling) వెలిసింది. అందుకే ఆధ్యాత్మికంగా దీనికి అత్యధిక ప్రాధాన్యత ఉంది.

3. దూర దూరం నుంచి…

50 Feets Largest Shivaling
నందీశ్వరుడు

స్వయంభూ లింగేశ్వర స్వామి ఆలయంలో (Swayambhu Lingeshwara Swamy Temple) ఉన్న ఈ లింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు దూరదూరం నుంచి తరలి వస్తుంటారు.

4. ప్రశాంతమైన వాతావరణం | 50 Feets Largest Shivling

50 Feets Largest Shivling
ఆలయ పరిసరాలు

ఈ మహా శివలింగం కొలువై ఉన్న ప్రాంతం చాలా ప్రశాంతంగా, ఆధునిక కాలంలో ఉన్న చికాకుల నుంచి ప్రశాంతతను కలిగించే విధంగా ఉంటుంది. కొండల నడుమ ఉన్న ఈ శివలింగం సమీపంలో కాసేపు సమయం వెచ్చిస్తే ధ్యానం (Meditation)  చేసినంత ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడి పరిసరాలు ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తాయి.

5. మహా శివరాత్రి సందర్భంగా 

50 Feets Largest Shivaling
మహా శివరాత్రికి ముందు ఏర్పాట్లు (File Photos)

పరమశివుడికి అత్యంత ఇష్టమై మహా శివరాత్రి (Maha Shivaratri)  సందర్భంగా భక్తులు శివలింగానికి అర్చన, అభిషేకాలు పూజలు చేయడానికి దూర దూరం నుంచి భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు.

6. భక్తులే దాతలు

50 Feets Largest Shivaling
మహా శివలింగం దగ్గరి నుంచి చూస్తే

50 అడుగుల మహా శివలింగం ఉన్న స్వయంభూ లింగేశ్వర స్వామి ఆలయ నిర్వహణ అనేది ముఖ్యంగా భక్తులు చేసే దానాలతోనే నడుస్తుంది. దాతలు అందించే ఆర్థిక సాయంతో ఉత్సవాలు, పండగల సమయంలో టెంట్లు వంటి ఏర్పాట్లు చేస్తుంటారు. 

7. ప్రభుత్వ సాయం కోసం

50 Feets Largest Shivaling
దాతల సాయంతో ఏర్పాట్లు

ఈ అలయాన్ని అభివృద్ధి చేసే అద్భుతమైన తీర్థక్షేత్రంగా రూపొందగలదు అని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో అండగా నిలిచి ఈ ఆలయంలో తగిన వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నారు భక్తులు.

8. టెంపుల్ టూరిజంకు ఆస్కారం

ఇటీవలే ఏపీ ప్రభుత్వం టెంపుల్ టూరిజాన్ని (Temple Tourism) వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపింది. ఇలాంటి సందర్భంగా ఈ మహా శివలింగం ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఎత్తైన శివలింగం (Highest Shivling In World) అని ప్రపంచానికి తెలిసేలా చేస్తే ఇక్కడ పర్యాటకం పెరిగే అవకాశం ఉంటుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా లాభం కలుగుతుంది. 

50 Feets Largest Shivaling
టెంపుల్ టూరిజాన్ని ఊతం…

ఒకవైపు అద్భుతమైన ఆధ్యాత్మికత భావాన్ని కలిగించే శివలింగం, మరోవైపు ప్రకృతి రమణీత…వెరసి ఈ ప్రాంతానికి పుణ్యక్షేత్రంగా (Punya Kshetra) అభివృద్ధి చెందే అన్ని లక్షణాలు ఉన్నాయి. 

ఒక వేళ మీరు శ్రీకాకుళం (srikakulam) వెళ్తే ఈ సారి తప్పకుండా పలాసలోని మహాదేవిపురం వెళ్లి స్వయంభూ లింగేశ్వరుడి ఆలయానికి వెళ్లండి. ఈ ఆలయం గురించి మరింత సమాచారం తెలిస్తే కామెంట్ చేయగలరు.

Note : File Photos From 2021 Library

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!