Shakambari Festival History : శాకాంబరి ఉత్సవాలు చరిత్ర ఏంటో మీకు తెలుసా?
Shakambari Festival History :ప్రపంచంలో అందరినీ సమానంగా చూసి, భక్తులను కరుణించే అమ్మవారు విజయవాడలోని కనకదుర్గమ్మవారు (Vijayawada Kanaka Durgamma). అలాంటిది తమ భక్తులు ఆకలితో అలమటిస్తుంటే అమ్మ ఎలా ఊరుకుంటుంది ? వారి ఆకలి బాధలను చూసి దుర్గమ్మ శాకాంబరీమాతగా అవతరించి, కరువు భూమిని పచ్చని పంటలతో నింపారు. భక్తులకు కడుపునింపిన చల్లని తల్లి శాకాంబరీ దేవికి ప్రతీ ఏటా నిర్వహించే ఉత్సవాలే శాకాంబరీ ఉత్సవాలు.
ఈ ఉత్సవాలు ఎప్పుడు చేస్తారు ? | Shakambari Festival Overview
శాకాంబరీ ఉత్సవాలను (Shakambari Ustavalu) ప్రతీ సంవత్సరం ఆషాఢ మాసం శుద్ధ పక్షంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయ ప్రాంగణం వివిధ రకాలు కూరగాయలు, పండ్లతో కళకళలాడుతుంది. ఇది చూసేందుకు వచ్చే భక్తులో భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది.
- ఇది కూడా చదవండి : Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు
నేను చాలా సార్లు విజయవాడకు వెళ్లాను. ఒకసారి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను. అయితే శాకాంబరి ఉత్సవాలు జరగే సమయంలో వెళ్లే అవకాశం దొరకలేదు. కనీసం వచ్చే ఏడాది అయితే ప్రయత్నిస్తాను. మీరు ఎప్పుడైనా వెళ్లారా ?
శాకాంబరీ దేవి ఎవరు ? | Story Of Shakambari Mata
ఒకప్పుడు దుర్గమాసురుడు అనే అసురుడి వల్ల వందేళ్ల పాటు భూమిపై వర్షాలు తీవ్రమై కరువు ఏర్పడింది. పాడి పంటలు లేకపోవడంతో గుక్కెడు అన్నం కోసం భక్తులు, జీవకోటి పడుతున్న ఇబ్బందులను, తీవ్రమైన క్షామాన్ని చూసి అమ్మవారు చలించిపోయారు.
అందుకే శతాక్షులతో (Shatakshi) అంటే వంద కళ్లతో ఆమె బాధను కన్నీళ్లతో వ్యక్తం చేసి ఆ కన్నీళ్లతో క్షామం (కరువు) నుంచి కాపాడి క్షేమం (సేఫ్) అనే పరిస్థితికి తీసుకువచ్చారు.
అమ్మవారు భక్తులకు కూరగాయలు, పండ్లు, ధాన్యాలు అందించి వారి ఆకలి తీర్చారు. అందుకే అమ్మవారిని శాకాంబరి అని పిలుస్తారు. ఇందులో శాక అంటే కూరగాయలు, అంబరి అంటే వాటిని ప్రసాదించే తల్లి అని అర్థం వస్తుంది. కొంత మంది క్షతాక్షి, శతాక్షి శాకాంబరీ అని పిలుస్తారు.
- ఇది కూడా చదవండి : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
ఉత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు | Shakambari Festival History
తమ కష్టాలు తీర్చిన అమ్మవారికి భక్తితో, ప్రతీ సంవత్సం ఆషాఢ మాసంలో మూడు రోజుల పాటు శాకాంబరీ అమ్మవారికి వైభవంగా పూజలు నిర్వహిస్తారు భక్తులు. ఈ సమయంలో అమ్మవారిని, ఆలయ ప్రాంగణాన్ని రకరకాలు తాజా కూరలు, పండ్లు, ధన్యాలతో, పూలతో అలంకరిస్తారు.
ఈ ఉత్సవ సమయంలో ఆలయానికి తరలి వచ్చే భక్తులు అమ్మవారికి మొక్కుగా, నైవేద్యంగా పొట్లకాయ, గుమ్మడికాయ, దోసకాయలను, కొబ్బరికాయలు, పప్పులు, ధాన్యాలను సమర్పిస్తారు భక్తులు. మూడు రోజుల పాటు అన్నదానాలు, ప్రసాదాలు పంచడం చేస్తుంటారు.

ఆలయ ప్రాంగణంలో కదంభం (Kadambam) చేసి పంచుతారు. చాలా మంది ఈ కదంభం రూచి కోసం ఏడాది అంతా వేచి చూస్తుంటారు. ఇంతకి మీరు ఎప్పుడైనా రుచి చూశారా ?
- ఇది కూడా చదవండి : 51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?
ఉత్సవ సమయంలో ఆలయ ప్రాంగణం అంతా కూడా రంగు రంగులు కూరగాయలు, పండ్లతో కళకళలాడుతుంది. ఈ ఉత్సవాన్ని కేవలం అమ్మవారికి అంకితం చేసిన వేడుకగానే మాత్రం కాకుండా నేచర్‌కు సంబంధించిన ఒక వేడుకగా చూస్తారు. ఇకపై కరువులు రాకుండా అంతా క్షేమంగా, సుభీక్షంగా ఉండేలా చూడాలని రైతులు, సామాన్యులు అమ్మవారిని మొక్కుతుంటారు.
ఇంద్రకీలాద్రితో పాటు
జీవకోటికి ప్రకృతి ఎంత ప్రధానమో ఈ వేడుకే నిదర్శనం అని చెప్పవచ్చు.ఇక ప్రతీ సంవత్సరం ఆషాఢ మాసంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రితో పాటు వరంగల్‌లోని భద్రకాళి ఆలయం, శ్రీశైలంలోని భ్రమరాంబ ఆలయం, కర్ణాటకలోని బన శంకరి ఆలయం, రాజస్థాన్‌లోని శాకాంబరి ఆలయాల్లో ఈ ఉత్సవం మొదట జరుగుతుంది.
Image courtesy of Sri Durga Malleswara Swamy Varla Devasthanam (PR Team)
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.