Ganesh Chaturthi 2025: వినాయక చవితి వచ్చేసింది.. పండగను గ్రాండ్గా జరుపుకోవడానికి కొన్ని బెస్ట్ టిప్స్!
Ganesh Chaturthi 2025: వినాయక చవితి అనేది కేవలం ఒక పండుగ కాదు.. అది భక్తి, ఐక్యత, క్రియేటివిటీకి ప్రతీక. ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యువత ఈ వేడుకలను మరింత గొప్పగా జరుపుకుంటారు. మండపాలు కట్టడం, విగ్రహాలను తరలించడం, చివరికి వినాయక నిమజ్జనంలో పాల్గొనడం వరకు అన్నింటిలోనూ వారి పాత్ర ఎంతో కీలకం. ఈసారి పండుగను మరింత ఘనంగా జరుపుకోవాలనుకుంటున్న యువత కొన్ని టిప్స్ పాటించాలి.
మండపం నిర్మాణం
మండపాన్ని నిర్మించేటప్పుడు సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. మండపం బలంగా ఉండటానికి వెదురు, తాడులు లేదా ఇనుము ఫ్రేమ్లను ఉపయోగించండి. వర్షాలు, జనసమ్మర్దం వల్ల కూలిపోకుండా జాగ్రత్తపడాలి. డెకరేషన్ కోసం ప్లాస్టిక్ బానర్లు, థర్మాకోల్ వాడకుండా.. పర్యావరణానికి హాని కలిగించని వస్త్రాలు, కాగితపు పూలు, నేచురల్ కలర్స్, LED లైట్లను ఉపయోగించండి. అలాగే, స్నేహితులకు పనిని పంచుకుంటే అందరూ పండుగలో భాగమయ్యారని భావిస్తారు.

ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
విగ్రహాల తరలింపు
వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి లేదా మండపానికి తీసుకొచ్చేటప్పుడు, ట్రాఫిక్, ప్రమాదాలు లేకుండా సురక్షితమైన, తక్కువ దూరం ఉండే మార్గాన్ని ఎంచుకోవాలి. విగ్రహాన్ని మోసేటప్పుడు కనీసం 4-6 మంది దానిని జాగ్రత్తగా, సమానంగా మోయాలి. వాహనంలో తరలించేటప్పుడు విగ్రహం కదలకుండా గట్టిగా కట్టాలి. విగ్రహం కింద మెత్తని గుడ్డను ఉంచితే విగ్రహం పాడవకుండా ఉంటుంది.
పండుగ నిర్వహణ
పండుగ సందర్భంగా పాటలు, డప్పులు ఉండడం సహజం. కానీ, రాత్రి సమయాల్లో పెద్ద శబ్దంతో స్పీకర్లు పెట్టకుండా జాగ్రత్తపడండి. వృద్ధులు, చిన్నపిల్లలకు ఇబ్బంది లేకుండా చూసుకోండి. మండపం దగ్గర చెత్త డబ్బాలు ఉంచి పరిశుభ్రంగా ఉంచండి. నిమజ్జనం తర్వాత కూడా మండపాన్ని శుభ్రం చేయాలి. ఇలా చేయడం నిజమైన భక్తిని చూపుతుంది. అలాగే, కమిటీలో గొడవలు, అహంకారాలకు తావు లేకుండా చూసుకోండి. వినాయకుడికి ఐక్యత, నవ్వులు అంటే చాలా ఇష్టం.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
నిమజ్జనం రోజు
నిమజ్జనం రోజున ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, విగ్రహాలను వీలైనంత త్వరగా తరలించడం మంచిది. నిమజ్జనం కోసం నీటిలోకి వెళ్లేవారు లైఫ్ జాకెట్స్ ధరించడం మంచిది. జనసమ్మర్దంలో ఒకరినొకరు తోసుకోకుండా, నిదానంగా ముందుకు వెళ్లాలి. పర్యావరణాన్ని కాపాడాలంటే మట్టి విగ్రహాలను, సహజ రంగులను ఉపయోగించాలి. ఇవి నీటిలో త్వరగా కరిగి, నదులు, చెరువులను కాపాడతాయి.
ఆధ్యాత్మిక ప్రయాణం
వినాయక చవితి అంటే కేవలం డ్యాన్స్, డప్పులు కాదు.. వినాయకుడి బోధనలను పాటించడం కూడా. ఆయన బోధనలైన అడ్డంకులను తొలగించడం, జ్ఞానాన్ని పంచడం, వినయంగా జీవించడం. యువత ఈ పండుగను సరదా, భక్తి, బాధ్యత అనే మూడు అంశాల కలయికగా మార్చాలి. ఈ వినాయక చవితికి హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర యువత భక్తి, క్రమశిక్షణ, పర్యావరణ ప్రేమతో ఈ వేడుకను ఎంత గొప్పగా జరుపుకుంటారో ప్రపంచానికి చూపించాలి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.