Travel Tips 26 : మీ కెమెరాలో సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని ఇలా బంధించండి.. మీరే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్!
Travel Tips 26 : ఆకాశంలో రంగులు మారే సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని చూడడం ఒక అద్భుతమైన అనుభూతి. ఒక ప్రయాణికుడిగా ఈ అద్భుతమైన క్షణాలను మీ కెమెరాలో బంధించడం ద్వారా మీ ఫోటోగ్రఫీ, వ్లాగింగ్‌ను మరో లెవల్‌కు తీసుకువెళ్లొచ్చు. ఒక ప్రొఫెషనల్‌లా ఎలా ఫోటోలు తీయాలో ఈ వార్తలో తెలుసుకుందాం.
ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా మారడానికి చిట్కాలు
ముందే చేరుకోండి: సూర్యుడు కనిపించకముందు లేదా అదృశ్యమయ్యే ముందు ఆకాశం రంగులు మార్చడం మొదలుపెడుతుంది. మీ కెమెరాను సిద్ధం చేసుకోవడానికి, ఆ అద్భుతమైన రంగులను బంధించడానికి 20-30 నిమిషాల ముందు చేరుకోండి.

మంచి లొకేషన్ చూడండి
మీరు ఫోటో తీయాలనుకుంటున్న ప్రదేశాన్ని ముందుగానే పరిశీలించండి. ఒక గుడి, ఒక చెట్టు, పర్వతాలు, లేదా నీటిలో ప్రతిబింబాలు వంటి ఆసక్తికరమైన వస్తువులు ఉండే ప్రదేశాన్ని ఎంచుకోండి. దీనివల్ల మీ ఫోటోలకు మరింత ఆకర్షణ వస్తుంది.
రూల్ ఆఫ్ థర్డ్స్ ఉపయోగించండి
మీ ఫోటో ఫ్రేమ్‌లో సూర్యుడిని మధ్యలో కాకుండా ఒక పక్కగా ఉంచండి. ఈ టెక్నిక్ మీ ఫోటోకు బ్యాలెన్స్ ఇస్తుంది. మరింత ఆకట్టుకునేలా చేస్తుంది.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
కెమెరా సెట్టింగ్‌లను మార్చండి
ఐఎస్ఓ (ISO): నాయిస్ రాకుండా ఉండటానికి తక్కువ ఐఎస్ఓ (100–200) వాడండి.
అపెర్చర్ (Aperture): మరింత షార్ప్ ఫోటోల కోసం f/8–f/11 వాడండి.
షట్టర్ స్పీడ్ (Shutter Speed): అద్భుతమైన ఆకాశం కోసం షట్టర్ స్పీడ్‌ను నెమ్మదిగా, స్పష్టమైన వివరాల కోసం స్పీడుగా మార్చండి.
సిలౌట్లను బంధించండి
సూర్యోదయం, సూర్యాస్తమయం సిలౌట్లను తీయడానికి మంచి సమయం. సూర్యుడు ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌కి వ్యతిరేకంగా ఒక వ్యక్తిని, చెట్టును లేదా భవనాన్ని ఉంచండి. ఇది ఫోటోకు ఒక డ్రామటిక్ అప్పియరెన్స్ ఇస్తుంది.
ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
గోల్డెన్ అవర్ మాజిక్: ఈ సమయాల్లో వచ్చే స్మూత్, గోల్డెన్ లైట్ మీ ఫోటోలకు, వీడియోలకు వెచ్చదనాన్ని ఇస్తుంది. పోర్ట్రెయిట్ ఫోటోలు తీయడానికి ఇది బెస్ట్ టైం.
టైమ్-లాప్స్ ప్రయత్నించండి: మీరు వ్లాగర్ అయితే, సూర్యోదయం లేదా సూర్యాస్తమయాన్ని టైమ్-లాప్స్‌లో రికార్డ్ చేయండి. ఇది మీ వీడియోకు సినిమాటిక్ అందాన్ని జోడిస్తుంది. చూసేవాళ్ళను ఆకట్టుకుంటుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.