Bathukamma : బతుకమ్మకు ఇంత గ్రాండ్‌గా ప్లాన్ చేశారా? వేడుకలు ఎక్కడ జరుగుతాయో తెలుసా ?
Bathukamma : తెలంగాణ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే బతుకమ్మ పండుగను ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం రూ. 50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యాటక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. బతుకమ్మ వేడుకలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా, తెలంగాణలోని అన్ని గ్రామాల్లో, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక, చారిత్రక ప్రదేశాల్లోనూ ఘనంగా నిర్వహించాలని సూచించారు. బతుకమ్మ ఉత్సవాలను పర్యాటక, ప్రకృతి, సంస్కృతులను మేళవించి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బతుకమ్మ వేడుకల ప్రధాన ఆకర్షణలు:
సెప్టెంబర్ 28న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 10,000 మందికి పైగా మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించి, గిన్నిస్ రికార్డు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా 50 అడుగుల ఎత్తైన బతుకమ్మను అలంకరించనున్నారు. సెప్టెంబర్ 30న ట్యాంక్ బండ్‌పై వేడుకలు అంగరంగ వైభవంగా ముగియనున్నాయి. ఈ రోజు ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కార్ ర్యాలీ, లైటింగ్ ఫ్లోట్స్, జపనీస్ ఇకెబానా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. వేడుకల చివరిలో, రాత్రిపూట సెక్రటేరియట్‌పై 3డీ మ్యాప్ లేజర్ షోతో కార్యక్రమాలు ముగుస్తాయి. సెప్టెంబర్ 26న హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో సైకిల్ ర్యాలీ, సెప్టెంబర్ 27న ట్యాంక్ బండ్‌పై మహిళల బైక్ ర్యాలీలు నిర్వహించబడతాయి.
ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
బతుకమ్మ వేడుకల షెడ్యూల్
సెప్టెంబర్ 21: వరంగల్ వెయ్యి స్తంభాల గుడిలో వేడుకల ప్రారంభం, హైదరాబాద్ శివార్లలో మొక్కలు నాటడం.
సెప్టెంబర్ 22: హైదరాబాద్ శిల్పారామం, మహబూబ్‌నగర్ పిల్లలమర్రిలో వేడుకలు.
సెప్టెంబర్ 23: నాగార్జునసాగర్ బుద్ధవనం, జయశంకర్ జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ ప్రాంగణం, కరీంనగర్ సిటీ సెంటర్లో వేడుకలు.
సెప్టెంబర్ 24: భద్రాచలం ఆలయం, జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్లో వేడుకలు.
సెప్టెంబర్ 25-29: హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ ఆర్ట్ క్యాంప్.
సెప్టెంబర్ 26: నిజామాబాద్ అలీసాగర్ రిజర్వాయర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో వేడుకలు. అదే రోజు ఉదయం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో సైకిల్ ర్యాలీ.
సెప్టెంబర్ 27: ఉదయం హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై మహిళల బైక్ ర్యాలీ. సాయంత్రం ఐటీ కారిడార్‌లో బతుకమ్మ కార్నివాల్.
సెప్టెంబర్ 28: గిన్నిస్ రికార్డు సాధించడానికి ఎల్బీ స్టేడియంలో 10,000 మందికి పైగా మహిళలతో బతుకమ్మ వేడుకలు. 50 అడుగుల ఎత్తులో బతుకమ్మ అలంకరణ.
సెప్టెంబర్ 29: పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ పోటీలు, డ్వాక్రా అసోసియేషన్స్ ఆధ్వర్యంలో సరస్ ఫెయిర్. ఆర్‌డబ్ల్యుఏ (RWA), హైసియా (Hysia) ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బతుకమ్మ వేడుకలు, పోటీలు.
సెప్టెంబర్ 30: ట్యాంక్ బండ్‌పై గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కార్ ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ఫ్లోట్స్, ఇకెబానా, జపనీస్ ఎగ్జిబిషన్. రాత్రిపూట సెక్రటేరియట్‌పై 3డీ మ్యాప్ లేజర్ షోతో వేడుకలు ముగుస్తాయి.
ఇది కూడా చదవండి : Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
మంత్రి జూపల్లి కృష్ణారావు సందేశం
మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఈ వేడుకలు విజయవంతం కావడానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల అధికారులు విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. సాంస్కృతిక కళాకారుల సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లకు సలహా ఇచ్చారు. బతుకమ్మ విగ్రహాలను హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, విమానాశ్రయాలు, యూనివర్సిటీల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.