Railway Ticket Booking : రైల్వే టికెట్ బుకింగులో సంచలన మార్పులు.. ఇలా చేస్తే ఇక కన్ఫర్మ్ టికెట్ గ్యారెంటీ
Railway Ticket Booking : భారతీయ రైల్వే శాఖ టికెట్ రిజర్వేషన్ వ్యవస్థలో మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ ఏడాది జూలై 1 నుంచి పారదర్శకత కోసం టికెట్ రిజర్వేషన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయడం వంటి పలు సంస్కరణలను అమలు చేస్తోంది. మధ్యవర్తుల జోక్యం లేకుండా టికెట్ రిజర్వేషన్ సదుపాయం నేరుగా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశం. ఈ వ్యవస్థ అమలులో గుర్తించిన కొన్ని సమస్యల కారణంగా, రైల్వే శాఖ ఇటీవల మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై రైలు టికెట్ రిజర్వేషన్ సమయంలో ఈ కొత్త పద్ధతిని అమలు చేయనున్నారు.
ఆధార్ లింకింగ్ తప్పనిసరి
ప్రయాణీకుల టికెట్ రిజర్వేషన్ విషయంలో రైల్వే శాఖ తీసుకున్న కొత్త నిర్ణయం ఏమిటంటే, ఇకపై ఐఆర్సీటీసీ యాప్/వెబ్సైట్ ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకోవాలంటే, ఆ ఐఆర్సీటీసీ అకౌంట్ మొబైల్ నంబర్‌కు ఆధార్ కార్డును లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఇంతకుముందు, ఐఆర్సీటీసీ ఖాతా ఉంటే టికెట్లు రిజర్వ్ చేసుకునే సౌకర్యం ఉండేది. అయితే, కొంతమంది ఏజెంట్లు ఒకే ఖాతా ద్వారా పరిమితికి మించి టికెట్లను బుక్ చేసుకుని దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనిని అరికట్టడానికి, ఈ నెల (అక్టోబర్) 1వ తేదీ నుంచి ఈ మార్పులను అమలులోకి తీసుకొచ్చారు. అకౌంట్ మొబైల్ నంబర్‌కు ఆధార్ కార్డు లింక్ చేస్తేనే టికెట్లను బుక్ చేసుకునేలా ఐఆర్సీటీసీ మార్పు చేసింది.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
రిజర్వేషన్ స్లాట్ సమయాల్లో మార్పు
ఐఆర్సీటీసీ అధికారులు టికెట్ రిజర్వేషన్ సమయాలలో కూడా ముఖ్యమైన మార్పులు చేశారు. ప్రయాణానికి ముందు రోజు అందుబాటులో ఉండే పరిమిత సంఖ్యలో రిజర్వ్ సీట్లను బుక్ చేసుకునే సమయాన్ని కూడా మార్చారు. ఈ టికెట్లను రిజర్వ్ చేసుకునే సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి 11 గంటలకు మార్చారు. ఇదే విధానాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి సాధారణ రిజర్వేషన్ టికెట్లకు కూడా అమలు చేశారు.

కొత్త టైమింగ్స్
ప్రయాణీకుల టికెట్లను మరింత పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఈ మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తమ మొబైల్ నంబర్‌కు ఆధార్‌ను లింక్ చేసుకున్న ప్రయాణికులు ఉదయం 8 గంటలకే రిజర్వేషన్ టికెట్లను పొందేలా మార్పులు చేశారు. అయితే, ఆధార్ లింక్ చేసుకోని వారు మాత్రం ఉదయం 8.15 గంటల నుంచి టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా, ప్రయాణికులకు రిజర్వేషన్ టికెట్లను మొదటగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు వివరించారు.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.