IRCTC : 9 రాత్రులు, 10 రోజులు భారత్ గౌరవ్ యాత్ర.. తిరుపతి నుంచి రామేశ్వరం, కన్యాకుమారి వరకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ
IRCTC : ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునే వారికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక శుభవార్త అందించింది. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా శ్రీ రామేశ్వరం–తిరుపతి దక్షిణ దర్శన్ యాత్ర పేరుతో ఒక ప్రత్యేక టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు చొరవ కింద ప్రారంభించిన ఈ యాత్రలో తిరుపతి నుంచి రామనాథస్వామి ఆలయం వరకు ఎన్నో పవిత్ర స్థలాలను చూడవచ్చు.
యాత్ర తేదీలు, వ్యవధి
ఐఆర్‌సీటీసీ ప్రకటించిన ఈ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ మొత్తం 9 రాత్రులు, 10 రోజులు ఉంటుంది. ఈ యాత్ర నవంబర్ 7, 2025 న ప్రారంభమై, నవంబర్ 16, 2025 న ముగుస్తుంది. దక్షిణ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పవిత్ర, పర్యాటక గమ్యస్థానాలను ఈ టూర్ కవర్ చేస్తుంది.

ఇది కూడా చదవండి : Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
టూర్ షెడ్యూల్, దర్శనీయ స్థలాలు
ఈ యాత్ర నవంబర్ 7న భక్తులు దైవ దర్శనం చేసుకునే తిరుపతి నుండి మొదలవుతుంది. ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత రామనాథస్వామి ఆలయ దర్శనం కోసం రామేశ్వరం వెళ్తారు. రామేశ్వరంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ధనుష్కోడిని కూడా సందర్శిస్తారు. తరువాత, ద్రావిడ శిల్పకళకు ప్రసిద్ధి చెందిన మీనాక్షి అమ్మన్ ఆలయం కోసం భక్తులు మధురై చేరుకుంటారు. అక్కడి నుంచి భారతదేశపు దక్షిణ కొన అయిన కన్యాకుమారికి పయనిస్తారు. కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, కన్యాకుమారి ఆలయాన్ని సందర్శిస్తారు. చివరి గమ్యస్థానం తిరువనంతపురం. ఇక్కడ భక్తులు పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. కోవలం బీచ్‌లో విశ్రాంతి తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
ప్యాకేజీ ధర, సౌకర్యాలు
ఈ ప్యాకేజీలో ప్రయాణీకులకు స్లీపర్ క్లాస్, 3ఏసీ, 2ఏసీ కోచ్‌ల ఎంపిక అందుబాటులో ఉంది. పెద్దలకు స్లీపర్ క్లాస్‌లో రూ.18,040, 3ఏసీలో రూ.30,370, 2ఏసీలో రూ.40,240 ధర నిర్ణయించారు. పిల్లలకు (5–11 ఏళ్లు) స్లీపర్ క్లాస్‌లో రూ.16,890, 3ఏసీలో రూ.29,010, 2ఏసీలో రూ.38,610 ధర ఉంటుంది. వసతి విషయానికి వస్తే.. ప్రయాణీకులకు ఏసీ, నాన్-ఏసీ రూములతో సహా బడ్జెట్ హోటల్ వసతి కల్పిస్తారు. రైలు ప్రయాణంలోనూ, హోటళ్లలోనూ పూర్తి శాఖాహార భోజనం అందిస్తారు.
రైల్వేలో మరో ముఖ్యమైన నిర్ణయం
ఐఆర్‌సీటీసీ ఈ టూర్ ప్యాకేజీతో పాటు ప్రయాణీకులకు సంబంధించి మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కన్ఫర్మ్ అయిన రైలు టికెట్‌ను రద్దు చేయకుండానే, ఎటువంటి క్యాన్సిలేషన్ ఫీజు చెల్లించకుండా ప్రయాణ తేదీని మార్చుకునే సౌకర్యాన్ని రైల్వే త్వరలో అందుబాటులోకి తేనుంది. ఒకవేళ తేదీ మార్చినప్పుడు టికెట్ ధరలో తేడా ఉంటే, ఆ తేడా మొత్తాన్ని ప్రయాణీకులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం చివరి నిమిషంలో ప్రణాళికలు మారినప్పుడు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.