Pandavas Exile Hill : పాండవుల అరణ్యవాసం చేసిన కొండ.. ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు.. మన దగ్గరే ఎక్కడంటే ?
Pandavas Exile Hill : మహాభారతంలో పంచ పాండవులు అరణ్యవాసం చేసిన కథలు మనకు తెలిసిందే. అయితే, తెలంగాణ రాష్ట్రంలో పాండవులు అజ్ఞాతవాసం లేదా వనవాసం గడిపినట్లుగా భావించే కొన్ని చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. అటువంటి వాటిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తిర్మలగిరి (రేగొండ మండలం), కరీంనగర్(Karimnagar ) జిల్లాలోని కొత్తూర్ (ధర్మారం మండలం) వద్ద ఉన్న పర్వతాలు ప్రముఖంగా కనిపిస్తాయి. వీటిని పాండవుల గుహలు లేదా పాండవుల కొండలు అని పిలుస్తారు. ఈ కొండలపై పాండవులు తవ్వుకున్నారని చెప్పే నీటి గుండాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఇంతకీ ఈ కొండల ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ భక్తులు ఎలాంటి పూజలు చేస్తారు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
తెలంగాణలో పాండవుల కొండలు
మహాభారతానికి సంబంధించిన పాండవుల కథలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బలంగా వినిపిస్తాయి. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలలో పాండవులు కొంత కాలం అజ్ఞాతవాసం చేశారని చరిత్రకారులు, స్థానికులు చెబుతారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం, తిర్మలగిరి గ్రామం వద్ద ఒక పాండవుల కొండ(Pandava Caves) ఉంది. అలాగే కరీంనగర్ జిల్లా, ధర్మారం మండలం, కొత్తూర్ వద్ద మరొక పాండవుల కొండ ఉంది. ఈ కొండలను పాండవుల గుహలు లేదా పాండవుల కొండలు అని పిలుస్తారు. ఈ పర్వతాలపై ఉన్న ఒక శిలపై పాండవుల కథకు సంబంధించిన చెక్కడాలు ఉండటం వల్ల ఈ పేర్లు వచ్చాయని చెబుతారు. వీటిని మెక్కబండ, ముగెస్సబండ, పంది పర్వతం, శక్తి పర్వతం వంటి అనేక పేర్లతో కూడా పిలుస్తారు.

నీటి గుండాలు (డోనా) ప్రత్యేకత
పాండవుల కొండలలో ప్రధానంగా భక్తులను ఆకర్షించే అంశం శిలపై ఉన్న నీటి గుండాలు (డోనా). ఇవి పాండవులు స్వయంగా తవ్వుకున్నాయని స్థానికుల నమ్మకం. ఈ డోనాలలో ఎల్లప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ ఇంకిపోదని స్థానికులు చెబుతారు. ఈ గుండం(Dona) లోతు సుమారు 1000 అడుగుల వరకు ఉంటుందని స్థానికుల అంచనా. పాండవులు ఈ రాతిపైనే ఈ గుండాలను తవ్వారని, ఒక డోనాను నీరు తాగడానికి, మరొక డోనాను స్నానం చేయడానికి ఉపయోగించారని చెబుతారు.
ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
భక్తుల ఆచారాలు.. వరద పాసం
పాండవుల కొండకు చేరుకునే భక్తులు ముందుగా ఈ డోనాలలో స్నానాలు చేసి, పాండవులకు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులు పంచ పాండవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ తరువాత శిలను నీటితో శుభ్రం చేసి, దానిపైనే ప్రసాదాన్ని ఉంచుతారు. భక్తులందరూ మోకాళ్లపై కూర్చుని, వంగి నోటితో ఆ ప్రసాదాన్ని తింటారు. ఈ ప్రత్యేక ఆచారాన్ని వరద పాసం అని పిలుస్తారు. ఆ తర్వాత భక్తులందరూ కలిసి సామూహిక భోజనం చేస్తారు. కొండపై పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ భక్తిని చాటుకుంటారు.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
ప్రార్థనలు, దర్శన సమయం
పాండవుల కొండపై పూజలు చేయడం వెనుక స్థానికులకు కొన్ని ప్రత్యేక నమ్మకాలు ఉన్నాయి. గ్రామంలో మంచి వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, గ్రామస్తులంతా ఆరోగ్యంగా ఉండాలని పంచ పాండవులను ప్రార్థిస్తారు. భక్తులు ఎక్కువగా శ్రావణ మాసంలో ఈ కొండను సందర్శిస్తారు. ఇది పవిత్రమైన మాసం కాబట్టి ఆ సమయంలో పూజలు, దర్శనం కోసం అధిక సంఖ్యలో వస్తారు.

టూర్ ప్లాన్ చేస్తున్నారా ? తక్కువ ధరలో మెరుగైన ప్యాకేజీ కావాలంటే వాట్సాప్లో సంప్రదించండి. హైదరాబాద్ నుంచి హిమాలయాల వరకు…కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పలు ఆప్షన్స్ అందిస్తాము.


తెలుగు పాఠకుల కోసం గమనిక: ఈ బ్లాగ్ కేవలం కోసం మాత్రమే. ట్రావెల్ ప్యాకేజీలు , వివరాలు భాగస్వామి సంస్థల ద్వారా అందించబడతాయి.

Disclaimer: This article is for informational purposes only. Prayanikudu.com shares verified travel updates and trip ideas collected from trusted sources and travel partners. We do not operate or sell any packages directly, nor are we responsible for bookings, prices, or any changes made by travel operators. All bookings, payments, and communication happen directly between travelers and the respective tour companies or agents. Readers are advised to verify all details before confirming any trip.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
