Sabarimala Special Trains : అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు
Sabarimala Special Trains : శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే ఒక శుభవార్త అందించింది. తెలుగు రాష్ట్రాల్లోని యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, శబరిమల స్పెషల్ ట్రైన్స్‌ను ప్రకటించింది. ఈ ఏడాది శబరిమల సీజన్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి కొల్లాం వరకు సుమారు 60 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ స్పెషల్ రైళ్ల రూట్లు, సమయాలు, హాల్టింగ్ స్టేషన్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మచిలీపట్నం – కొల్లాం (రైలు నెంబర్లు: 07101 / 07102)
మచిలీపట్నం నుంచి కొల్లాం వరకు నడిచే రెండు ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ వివరాలు ఇవే
07101 మచిలీపట్నం – కొల్లాం: ఈ రైలు నవంబర్ 14, 21, 28, డిసెంబర్ 26 , జనవరి 2 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు మచిలీపట్నంలో బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.
07102 కొల్లాం – మచిలీపట్నం: ఈ రైలు నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 28, జనవరి 4 తేదీల్లో నడుస్తుంది. ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాంలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
హాల్టింగ్ స్టేషన్లు (07101 / 07102): ఈ రైళ్లు గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనూర్ వంటి ముఖ్య స్టేషన్లలో ఆగుతాయి.

మచిలీపట్నం – కొల్లాం (రైలు నెంబర్లు: 07103 / 07104)
మచిలీపట్నం – కొల్లాం మధ్య మరో ప్రత్యేక సర్వీసు వివరాలు ఇవే
07103 మచిలీపట్నం – కొల్లాం: ఈ రైలు డిసెంబర్ 5, 12, 19, జనవరి 9, 16 తేదీల్లో నడుస్తుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు మచిలీపట్నంలో బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.
07104 కొల్లాం – మచిలీపట్నం: ఈ రైలు డిసెంబర్ 7, 14, 21, జనవరి 11, 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాంలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 12.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
హాల్టింగ్ స్టేషన్లు (07103 / 07104): ఈ రైళ్లు గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, రేణిగుంట, కాట్పాడి, సేలం, ఈరోడ్, పాలక్కాడ్, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనూర్ వంటి స్టేషన్లలో ఆగుతాయి.
ఇది కూడా చదవండి : Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూపిస్తారు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips
నరసాపూర్ – కొల్లాం (రైలు నెంబర్లు: 07105 / 07106)
పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపూర్ నుంచి శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ఇదే
07105 నరసాపూర్ – కొల్లాం: ఈ రైలు నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 7, 14, 21, 28, జనవరి 4, 11, 18 తేదీల్లో నడుస్తుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నరసాపూర్‌లో బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.
07106 కొల్లాం – నరసాపూర్: ఈ రైలు నవంబర్ 18, 25, డిసెంబర్ 2, 9, 16, 23, 30, జనవరి 6, 13, 20 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాంలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 5 గంటలకు నరసాపూర్ చేరుకుంటుంది.
హాల్టింగ్ స్టేషన్లు (07105 / 07106): ఈ రైళ్లు పాలకొల్లు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, సేలం, ఈరోడ్, పాలక్కాడ్, త్రిస్సూర్, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనూర్ వంటి స్టేషన్లలో ఆగుతాయి.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
చర్లపల్లి – కొల్లాం (రైలు నెంబర్లు: 07107 / 07108)
తెలంగాణ ప్రాంతం నుంచి అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి (హైదరాబాద్ శివారు) నుంచి ప్రత్యేక రైళ్ల వివరాలు:
07107 చర్లపల్లి – కొల్లాం: ఈ రైలు నవంబర్ 17, 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.
07108 కొల్లాం – చర్లపల్లి: ఈ రైలు నవంబర్ 19, 26, డిసెంబర్ 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 21 తేదీల్లో నడుస్తుంది. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాంలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
హాల్టింగ్ స్టేషన్లు (07107 / 07108): ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, సేలం, ఈరోడ్, పాలక్కాడ్, త్రిస్సూర్, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనూర్ వంటి స్టేషన్లలో ఆగుతాయి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
