OYO Rooms : గుడ్ న్యూస్.. ఓయో రూమ్స్ ఇప్పుడు గంట అద్దెకే.. ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా ?
OYO Rooms : హోటల్ గది బుక్ చేసుకోవాలంటే చాలామంది ముందుగా గుర్తు చేసుకునే పేరు ఓయో (OYO). తక్కువ ధరలో గదులు లభించడం, సులువుగా బుక్ చేసుకోగలగడం దీని ప్రత్యేకతలు. అయితే కొన్నిసార్లు పనుల నిమిత్తం సిటీకి వచ్చిన వారికి 24 గంటల పాటు రూమ్ అవసరం ఉండకపోవచ్చు. ఇలాంటి వారి సౌలభ్యం కోసం, ఓయో అవర్లీ రూమ్స్ (OYO Hourly Rooms) అనే కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా కేవలం ఒక గంట అద్దెకే రూమ్ తీసుకోవచ్చు, తద్వారా డబ్బు ఆదా అవుతుంది. ఈ అవర్లీ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుందాం.
అవర్లీ రూమ్స్ అంటే ఏమిటి?
సాధారణంగా ఓయో గదులను 24 గంటల లెక్కన అద్దెకు ఇస్తారు. అయితే వ్యాపార లావాదేవీలు లేదా స్వల్పకాలిక పనుల నిమిత్తం సిటీకి వచ్చిన వారికి పూర్తి రోజు రూమ్ అవసరం ఉండకపోవచ్చు. కొంతమందికి 10 గంటలు, మరికొందరికి కేవలం ఒక గంట మాత్రమే సరిపోతుంది. వినియోగదారుల ఈ అవసరాలను గుర్తించి, తక్కువ అద్దె చెల్లించే వీలు కల్పించడం కోసం ఓయో ‘ఓయో అవర్లీ రూమ్స్’ లేదా ‘ఓయో రూమ్స్ ఫర్ షార్ట్ స్టే’ అనే కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఓయో అవర్లీ రూమ్స్ బుకింగ్ విధానం
మీరు గంట అద్దెకు ఓయో రూమ్ బుక్ చేసుకోవాలంటే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి:
లాగిన్: ముందుగా మొబైల్లో ఓయో యాప్‌ను (లేదా OYO వెబ్‌సైట్‌ను – https://www.oyorooms.com) ఓపెన్ చేసి, మీ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ లేదా సైన్ అప్ అవ్వాలి.
సెర్చ్ ఆప్షన్: లాగిన్ అయిన తర్వాత, ‘OYO Hourly Rooms’ లేదా ‘OYO Rooms for Short Stay’ అనే ఆప్షన్ కోసం సెర్చ్ చేసి, దానిని క్లిక్ చేయాలి.
లొకేషన్ ఎంపిక: మీరు స్టే చేయాలనుకుంటున్న సిటీ పేరును ఎంటర్ చేయాలి. అప్పుడు, ఆ సిటీలో గంటల లెక్కన అద్దెకు ఇచ్చే హోటళ్ల లిస్ట్ కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
సమయం ఎంపిక: ఈ లిస్ట్‌లో కొన్ని హోటళ్లు 1 గంటకు, 3 గంటలకు లేదా 6 గంటలకు అద్దెకు ఇస్తాయి. మీరు హోటల్ని, అలాగే ఎంతసేపు ఉండాలనుకుంటున్నారో ఆ డ్యూరేషన్ని ఎంచుకోవాలి.
చెల్లింపు: చెక్ ఇన్ టైమ్‌ను సరిచూసుకుని, బుకింగ్ కన్ఫర్మ్ చేసి, డబ్బు చెల్లించవచ్చు. మీరు యూపీఐ (UPI), డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఆన్లైన్లో పే చేయవచ్చు, లేదా హోటల్‌కి వెళ్లినప్పుడు కూడా డబ్బు చెల్లించే సౌకర్యం ఉంటుంది.
ఇది కూడా చదవండి : Vanuatu: వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్
బుక్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సినవి
అవర్లీ రూమ్స్ బుక్ చేసుకునే ముందు కింది విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. అన్ని ఓయో హోటళ్లూ అవర్లీ రూమ్స్ ఆప్షన్‌ను అందించవు. అందువల్ల బుక్ చేసుకునేటప్పుడు, ఆ ఆప్షన్ ఉందో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. ఓయో రూమ్‌లో స్టే చేయాలంటే ఆధార్, పాన్ లేదా పాస్‌పోర్ట్ లాంటి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఐడీ ప్రూఫ్) తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. బుకింగ్ ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఆయా కాలాలు, సీజన్లు, డిమాండ్లు, రూమ్ ఫీచర్లను బట్టి ధరలు మారుతూ ఉంటాయి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే, నేరుగా ఆయా ఓయో హోటళ్లకు కాల్ చేసి కనుక్కోవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
