వరంగల్‌లో పాకాల సరస్సు కంప్లీట్ ట్రావెల్ గైడ్ | Tips, Route and Pakala Lake Travel Guide 2025
Pakala Lake : మీరు కుటుంబంతో కలిసి ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా సమయాన్ని గడపడానికి మంచి పర్యాటక స్థలం కోసం చూస్తున్నారా? అయితే తెలంగాణలో మీకు తెలియని ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది.
చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో స్వచ్ఛమైన నీరు, ఎటు చూసినా పచ్చదనం… ఆ పచ్చటి చెట్లపై పక్షులు, జలపాతాల శబ్దం… అబ్బో! ఈ అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవు.
- వర్షాకాలం ప్రారంభం కాగానే ఇక్కడికి వలస పక్షులు కూడా వస్తాయి.
- ఈ అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి ఆకర్షితులు కాని వారు ఎవరుంటారు చెప్పండి?
- మరి అంతటి అద్భుతమైన పర్యాటక కేంద్రం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? అది మరెక్కడో కాదు… వరంగల్ జిల్లా నర్సంపేట శివారులో ఉన్న పాకాల సరస్సు (Pakala Lake).
ముఖ్యాంశాలు
ప్రశాంతతకు మారుపేరు పాకాల | Pakala Lake
హైదరాబాద్ లేదా వరంగల్ చుట్టుపక్కల ఉండే వారికి పాకాల సరస్సు ఒక వరం లాంటిది. ఇది వరంగల్ నగరానికి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కొండలతో చుట్టుముట్టబడి, మధ్యలో నిండుగా నీటితో కళకళలాడుతూ ఉండే ఈ ప్రాంతం పాకాల సరస్సుకు ప్రధాన ఆకర్షణ.
- మీకు ఎంత టెన్షన్ ఉన్నా, ఎలాంటి ఆలోచనలు ఉన్నా… ఒక్కసారి ఈ సరస్సు వద్దకు వస్తే, ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం, చల్లటి గాలి మీ మనసుకు ఎంతో రిలీఫ్‌ను ఇస్తాయి.

పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా సెలవు దొరికితే చాలు.. సరదాగా ఈ ప్రదేశానికి వచ్చి ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా చుట్టూ ఉండే పచ్చని అటవీ వాతావరణం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.
కాకతీయుల కాలం నాటి అద్భుత నిర్మాణం
పాకాల సరస్సు కేవలం ఒక అందమైన ప్రదేశం మాత్రమే కాదు, దీనికి గొప్ప చరిత్ర కూడా ఉంది. ఈ సరస్సును కాకతీయుల కాలంలో క్రీ.శ. 1213 లో గణపతి దేవుడు తవ్వించినట్లు చరిత్ర చెబుతోంది.
- ఆ కాలంలోనే ఇంత పెద్ద సరస్సును నిర్మించడం కాకతీయుల ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం.
- దీని విస్తీర్ణం దాదాపు 30 చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది.
ఇది కూడా చదవండి : Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు
వరస పక్షులతో కిలకిల
ఈ ప్రాంతంలో పచ్చని చెట్లపై వాలి ఉండే పక్షులు, జలపాతంలా కిందకు పారే స్వచ్ఛమైన నీరు… ఇదంతా చూస్తుంటే రెండు కళ్లు చాలవు. ముఖ్యంగా చలికాలం ముగిసి, వర్షాకాలం మొదలయ్యే సమయంలో దేశం నలుమూలల నుంచి వలస పక్షులు (Migratory Birds) ఇక్కడికి వచ్చి వాలిపోతాయి.
- పక్షులను ప్రేమించే వారికి, ప్రకృతిని ఆస్వాదించే వారికి ఈ సరస్సు ఒక స్వర్గధామం అనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి : Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
పర్యాటకులకు సౌకర్యాలు (Facilities for Tourists)
పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఇక్కడ వారికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఒక క్రీడా మైదానం (Sports Ground) ఉంది. అలాగే, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులు ఇక్కడ బస చేయడానికి వసతి గృహాలను (Rooms) కూడా ఏర్పాటు చేశారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
