Lake View Cafes : రొమాంటిక్ డేటింగ్ కోసం గోవా, పుదుచ్చేరి దాకా వెళ్లక్కర్లేదు..హైదరాబాద్‌లోనే అదిరిపోయే లేక్ వ్యూ కేఫ్‌లు
Lake View Cafes : రోజువారీ రొటీన్ లైఫ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని రిఫ్రెష్ అవ్వాలనుకుంటే బెస్ట్ ఫ్రెండ్‌తో లేదా లైఫ్ పార్టనర్‌తో కలిసి మంచి కేఫ్‌కు వెళ్లడం ఉత్తమ మార్గం. అదే కేఫ్ దుర్గం చెరువు లేదా హుస్సేన్ సాగర్ వంటి సరస్సుల ఒడ్డున ఉంటే.. ఆ ఫీలింగే వేరు. వీటినే మనం లేక్ వ్యూ కేఫ్‌లు అంటాం. ఇలాంటి అద్భుతమైన, ఉత్తేజపరిచే స్పాట్‌లు మన హైదరాబాద్‌లోనే చాలా ఉన్నాయి. గాంధీపేట, జూబ్లీ హిల్స్, నెక్లెస్ రోడ్, మాదాపూర్ ప్రాంతాల్లోని అలాంటి టాప్ 7 లేక్ వ్యూ కేఫ్‌ల గురించి, వాటి ప్రత్యేకతల గురించి వివరంగా తెలుసుకుందాం.
దుర్గం చెరువు సమీపంలో కేఫ్‌లు (Cafes Near Durgam Cheruvu)
ఒలివ్ బిస్ట్రో (Olive Bistro): జూబ్లీ హిల్స్‌లో ఉన్న ఒలివ్ బిస్ట్రో, దుర్గం చెరువు చివరి మూల దగ్గర ఉంది. ఇక్కడి వాతావరణం చాలా లగ్జరీగా ఉంటుంది. మీరు మెడిటరేనియన్, యూరోపియన్, ఇటాలియన్ వంటి కొత్త రెసిపీలను ట్రై చేయాలనుకుంటే ఇది మంచి ఆప్షన్. ముఖ్యంగా, రొమాంటిక్ డేట్స్ కోసం ఇది ఒక అద్భుతమైన అడ్రస్.

అకాన్ (Akan): దుర్గం చెరువు దగ్గర ఉన్న మరో ప్రముఖ కేఫ్ అకాన్. ఇక్కడ మీరు జాతీయ, అంతర్జాతీయ, మల్టీ-క్యూసిన్ వంటకాలను రుచి చూడవచ్చు. ఈ కేఫ్ రూఫ్‌టాప్ (Roof Top) వాతావరణం చాలా ప్రత్యేకంగా, అందంగా ఉంటుంది. ఇక్కడ ఆల్కహాల్ (Alcohol) కూడా లభిస్తుంది.
లాస్ట్ హౌస్: బై ది లేక్ (Last House: By The Lake): ఇది కూడా జూబ్లీ హిల్స్‌లోని దుర్గం చెరువు ఒడ్డున ఉంది. లాస్ట్ హౌస్ కేఫ్ కాఫీ, చెరువు దృశ్యం, హైదరాబాద్ స్కైలైన్ రూఫ్‌టాప్ విజువల్స్‌తో పాటు ప్రైవేట్ అవుట్‌డోర్ సీటింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఇక్కడ రోబస్టా-బెస్ట్ కాఫీలు, డెజర్ట్‌లు చాలా ఫేమస్. వీటితో పాటు మెనూలో అనేక ఇతర ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
కేఫ్ ఢిల్లీ హైట్స్ (Cafe Delhi Heights): దుర్గం చెరువు దగ్గర ఇన్-ఆర్బిట్ మాల్ (In-Orbit Mall)లో ఉన్న ఈ కేఫ్, కుటుంబ సభ్యులతో కలిసి లేదా సోషల్ మీటింగులకు వెళ్లడానికి బెస్ట్ స్పాట్. ఇందులో నార్త్ ఇండియన్, కాంటినెంటల్, చైనీస్, ఇటాలియన్ వంటి అనేక రకాల ఆహార పదార్థాలు దొరుకుతాయి. గ్లోబల్ మెనూలో నుంచి మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
ది లాబ్రింత్ లేక్‌ఫ్రంట్ (The Labyrinth Lakefront): ఇది గాంధీపేట ప్రాంతంలో ఉంది. లాబ్రింత్ లేక్‌ఫ్రంట్ ఒక బోహేమియన్ కేఫ్, అంటే ఇక్కడ పెంపుడు జంతువులను (Pets) కూడా అనుమతిస్తారు. ప్రకృతి అందాలు, ఆకర్షణీయమైన డెకరేషన్, రిలాక్స్డ్ గోవా తరహా వాతావరణంతో ఇది సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఇటాలియన్, జపనీస్ వంటకాలు, పిజ్జాలు, పాస్తాలు, డెజర్ట్‌లు వంటివి లభిస్తాయి.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
లేక్ డిస్ట్రిక్ట్ (Lake District): నెక్లెస్ రోడ్ లోని హుస్సేన్ సాగర్ సరస్సు దగ్గర ఉన్న లేక్ డిస్ట్రిక్ట్.. ఇండియన్, ఏషియన్, కాంటినెంటల్ వంటకాలతో కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఇక్కడ కూడా ఆల్కహాల్ సర్వ్ చేస్తారు, కాబట్టి నాన్-ఆల్కహాలిక్ డైనింగ్ వాతావరణం కోరుకునేవారికి ఇది అంత మంచి ప్రదేశం కాదు.
లష్ కేఫ్ (Lush Cafe): మాదాపూర్ లోని డాక్టర్స్ కాలనీ రోడ్‌లో ఉన్న లష్ కేఫ్ ఒక రూఫ్‌టాప్ ఒయాసిస్ లాంటిది. ఇది తెలుపు రంగు ఆధారితమైన అందమైన ఇంటీరియర్‌తో సందర్శకులను ఆకర్షిస్తుంది. చాలా పెద్ద మెనూ ఆప్షన్లతో కస్టమర్లకు మెరుగైన సేవలను అందిస్తుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
