Vietnam Travel : వియత్నాం వెళ్లేందుకు భారతీయులు ఎందుకు ఇష్టపడుతున్నారు? Top 7 Reasons
Vietnam Travel : వియత్నాం అంటే చాలా మందికి అక్కడి భౌగోళిక స్వరూపం, ఆహారం, ఆచారాలు గుర్తుకు వస్తాయి. ఈ పోస్టులో భారతీయులు ఈ దేశానికి ఎందుకు వెళ్లున్నారో 7 కారణాలు మీతో షేర్ చేశాను. తప్పకుండా చదవండి. షేర్ చేయండి.
వియత్నాం దేశం ఆసియాలో (Asia) టూరిజం పరంగా కాస్త అండర్రేటెడ్ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడి అందాలు, కల్చ్, ఫుడ్ విలువ, భారతీయులో స్థానికులు ప్రవర్తించే తీరు నచ్చి ఎక్కువ మంది భారతీయులు ప్రపంచయాత్రలో భాగంగా (World Tour ) వియత్నాం దేశానికి (Indians In Vietnam) వెళ్తున్నారు.
ముఖ్యాంశాలు
భారతీయులు వియత్నాం వెళ్లడానికి 7 కారణాలు | Top 7 Reasons why Indians Visiting Vietnam
1. చవకైన జీవన వ్యయం | Vietnam Cost Of Living
ఇతర అనేక దేశాలతో పోల్చితే వియత్నాంలో (Vietnam) కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. భారతీయులు తమ బడ్జెట్లోనే అంతర్జాతీయ ట్రిప్‌ను ఎంజాయ్ చేయాలని భావించి ఈ దేశానికి వెళ్తున్నారు.
- ప్రయాణికులు ఆర్థిక పరిస్థితిని బట్టి ఫుడ్, హోటల్స్, రవాణా అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఎంత పిండికి అంత రొట్టె అన్నామాట.
- జేబుకు చిల్లు పడకుండా భారతీయుల ఒక విదేశీ యాత్రను (Foreign Trip) పూర్తి చేసుకుని వచ్చేస్తున్నారు.
- ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
- ఇది కూడా చదవండి : Peaceful Countries: ప్రపంచంలోని టాప్ 10 శాంతియుత దేశాలు
A truly magical sunset spot in Vietnam
— Massimo (@Rainmaker1973) December 7, 2025
pic.twitter.com/EYdPq1fZiU
2. అద్భుతమైన భౌగోళిక స్వరూపం | Vietnam Landscapes
హాలాంగ్ బేలో (Halong Bay) ఉన్నలైమ్ స్టోన్ క్లిఫ్స్ నుంచి సాపాలోని రైస్ టెర్రేస్ల వరకు…డా నాంగ్ బీచులో అలల వయ్యారాలు, హ గియాంగ్ పర్వతాల వంపులు ఇలా చెబుతూ పోతే నెక్ట్స్ పోస్ట్ పెట్టడానికి నాకు ఎనర్జీ ఉండదు.

- ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
- ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
3. స్ట్రీట్ ఫుడ్ | Vietnam Street
సముద్రం ఎంత అందంగా ఉన్నా నీళ్లు తాగలేము కదా. అందం అన్నం పెట్టదు కదా. అందుకే ఏ దేశానికి లేదా ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా మనం ముందు ఫుడ్ (Food) గురించే ఆలోచించాలి. కడుపు సల్లగుంటేనే కదా మైండ్ కూడా సల్లగుంటది.
అలా మీ మైండ్‌ను సల్లగుంచే పానీయాలు, నాలుకను లపలపలాడించే స్ట్రీట్ ఫుడ్ అన్నీ కూడా మీకు వియత్నాంలో లభిస్తాయి.
- ఫో (Pho)
- బాన్ మీ ( banh mi)
- బన్ చా (bun cha)
- లోకల్ వియత్నాం కాఫీ
ఇలా లిస్టు చాలా పెద్దది. కానీ ధరలు మాత్రం బడ్జెట్ పద్మనాభాన్ని కూడా ఇంప్రెస్ చేస్తాయి.
- ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
- ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
4. వీసా కష్టాల్లేవు…ఫ్లైట్స్ ఎక్కువ | Vietnam Travel
భారతీయులు ఏ దేశానికి వెళ్లాలి అనుకున్నా వారికి వీసా (Visa) అవసరం. ఒక్కో దేశం ఒక్కో విధానంలో వీసా అందిస్తుంది. ఇక వియత్నాం విషయానికి వస్తే ఈ వీసా (Vietnam Visa) తీసుకుని, డైరక్ట్ ఫ్లైట్‌లో రయ్యని వెళ్లిపోవచ్చు.

- భారత దేశంలోని వివిధ ప్రధాన నగరాల నుంచి వియత్నాంకు డైరక్ట్ విమానాలు ఉన్నాయి.
- హైదరాబాద్ నుంచి కూడా డైరక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సుమారు 5 గంటల్లో డైరక్ట్ ఫ్లైట్ ఎక్కి వియత్నం చేరుకోవచ్చు. డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకుంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ బుక్ చేసుకుని ఒక ట్రెండు గంటలు వెయిట్ చేయొచ్చు..
- ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
5. కొత్తా పాతల కలయిక
వియత్నాం గత కొన్ని దశాబ్ధాలుగా అద్భుతమైన పురోగతిని సాధించింది. ఒకవైపు అభివృద్ధికి చిహ్నంగా నిలిచే కట్టడాలు, మార్కెట్లు, ఓల్డ్ క్వార్టర్ స్ట్రీట్స్…మరోవైపు కళ్లు జిగేలుమనిపించే భారీ భవంతులు…వియత్నాం అంటే ట్రెడిషన్ అండ్ ట్రెండ్ రెండూ కూడాను.
The Cu Chi Tunnels are located outside Ho Chi Minh City, Vietnam. I could never enter these small, tight tunnels! 😱 pic.twitter.com/1qytn5Uwxi
— Trump Girl (@TrumpGirlLove) December 7, 2025
6. సాహసీకులకు కావాల్సినన్ని థ్రిల్స్
థ్రిల్ కోసం, అడ్వెంచర్ కోసం విదేశాలకు వెళ్లే అలవాటు ఉన్నవారికి ఇక్కడ మోటర్ బైక్ రోడ్ ట్రిప్స్ బాగా సెట్ అవుతాయి.దీంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్దవైన ఎన్నో గుహలు (Caves) ఇక్కడ ఉన్నాయి.
- ఎన్నో ద్వీపాలు అద్భుతమైన అడ్వెంచర్ అనుభవాన్ని అందిస్తాయి.
- దీంతో పాటు ఇక్కడి ఎన్నో ఐకానిక్ పర్వతాల నుంచి కొండల నుంచి జాలువారే జలపాతాలు ఇట్టే కట్టిపడేస్తాయి.
- ఇక్కడి స్లో కాఫీ కల్చర్‌లో ఇమిడిపోయి బీచుల్లో తేలిపోతూ ఎంజాయ్ చేయవచ్చు.
- ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
- Read Also : సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు?
- ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
7. మంచి మనసులు
వియత్నాం పౌరుల పోరాట పటిమ గురించి ప్రపంచానికి తెలిసిందే. అలాగే వారికి వెన్నెలాంటి మనసు గురించి ఇప్పుడిప్పుడే ప్రపంచం తెలుసుకుంటోంది.
- కొత్తా పాతా అతని తేడాలేవీ లేకుండా ఎదుటి మనిషిని చూసి నవ్వే మనుషులు ప్రతీ వీధుల్లో కనిపిస్తారు అక్కడ.
- అందుకే చాలా మంది ప్రయాణికులు వియత్నం నుంచి ఎన్నో మెమోరీస్తో తిరిగివస్తారు.
వియత్నాం అనేది బ్యాక్ ప్యాకర్స్‌కు (Backpackers), జంటలకు, ఫుడ్ లవర్స్‌కు, అడ్వెంచర్ ట్రావెలర్స్‌కు, డిటిటల్ నోమాడ్స్కు (Nomads), నాలాంటి ప్రయాణికులకు బాగా సెట్ అవుతుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
