Top 7 Vizag foods : వైజాగ్‌లో తప్పకుండా ట్రై చేయాల్సిన 7 లోకల్ ఫుడ్
Top 7 Vizag foods : వైజాగ్అంటే బీచులు, హిల్స్ మాత్రమే కాదు…ఈ బే సిటీలో (Bay City) స్ట్రీట్ ఫుడ్ నుండి సంప్రదాయ ట్రెడిషనల్ ఆంధ్రా మీల్స్ వరకు వీటి రుచికి మ్యాచ్ లేదు అనే అనేక ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి.
ఇక మీరు వైజాగ్‌కు (Vizag) మొదటిసారి వచ్చినా లేదంటే లోకల్ అయినా ఈ టాప్ 7 వైజాగ్ ఫుడ్స్ ట్రై చేయకపోతే మీ ట్రిప్ అసంపూర్ణంగా అనిపించే అవకాశం ఉంది. ఇక్కడ ప్రస్తావించిన అన్నీ ట్రై చేసేంత పెద్ద ట్రిప్ కానప్పుడు మీకు నచ్చిన వాటిని ట్రై చేయండి. ఛాయిస్ మీదే..
ముఖ్యాంశాలు
1.బొంగులో చికెన్ | Bamboo Chicken
వైజాగ్, అరకు (Araku) ట్రిప్‌లో తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ ఇది. చాలా ఇంట్రెస్టింగ్ ప్రిపరేషన్ ఉంటుంది. బాంబూలో చికెన్ ఇతర పదార్థాలు కలిపి (Bamboo Chicken Cooking) మంటపై మెల్లిగా రోస్ట్ చేస్తారు. వీటికి స్థానికంగా అందుబాటులో ఉండే ట్రైబర్ మసాలాలను జోడిస్తే వచ్చే స్మోకీ ఫ్లేవర్ ఇదంతా నెక్ట్స్ లెవల్ టేస్ట్ అనేలా చేస్తాయి.

- ఇవి మీకు అరకు వెళ్లే దారిలో, ట్రైబల్ స్టాల్స్ వద్ద లభిస్తాయి.
- వీటిని సాయంత్రం సమయంలో తీసుకుంటే బాగుంటుంది.
- ఇది కూడా చదవండి : Beyond Biryani: హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు, అంతకు మించి! ఇవి కూడా ట్రై చేయండి
2.రొయ్యల ఇగురు | Prawns Curry
కోస్టల్ ఆంధ్రా క్లాసిక్ డిషెస్‌లో Royyala Iguru కూడా ఒకటి. తాజా రొయ్యలతో చేసిన స్పైసీ కర్రీ, అన్నంతో కలిపి తింటే స్వర్గం గుర్తొస్తుంది. Vizag Sea Food ఇష్టపడే వారు దీనిని తప్పకుండా ట్రై చేయాల్సిందే.
- ఇది లోకల్ Andhra Hotels లో లభిస్తుంది
- లంచ్ టైమ్‌లో ట్రై చేయవచ్చు.
- ఇది కూడా చదవండి : Uday Cafe: ఉదయ్ కేఫ్.. 63 ఏళ్లుగా కొత్త రుచుల మధ్య పాత రుచిని అందిస్తున్న అరుదైన రెస్టారెంట్!
3. పునుగులు, మిర్చీ బజ్జీ |
Vizag Street Food లో టాప్‌లో ఉండే స్నాక్స్ ఇవి. సాయంత్రం సమయంలో Punugulu మిర్జీ భజ్జీ కాంబోను తినడం అనేది ఆ రోజులో చేసిన బెస్ట్ పనుల్లో ఒకటి అని చెప్పవచ్చు. క్రిస్పీ పునుగులు , స్పైసీగా ఉండే మిర్చీ అనేది టీ టైలో బెస్ట్ కాంబో.
- MVP Colony, జగదాంబా ఏరియాలో ట్రై చేయండి.
- సాయంత్రం 5 నుంచి రాత్రి 8 మధ్య టేస్ట్ బెస్ట్‌గా అనిపిస్తుంది.
- ఇది కూడా చదవండి : Ta.Ma.Sha Cafe : ఓకే కేఫ్‌లో అన్ని రకాల ఆసియా రుచులు..అదే త.మా.షా!
4. పూత రేకులు | Pootharekulu
స్వీట్ లవర్స్‌కు ఆంధ్రా ప్రైడ్ లాంటి ఈ పూతరేకులు బాగా నచ్చుతాయి. అవకాశం ఉంటే పూతరేకులు చేసే ప్రాసెన్ను కూడా చూడండి. వైజాగ్‌లో అనేక ప్రాంతాల్లో ఫ్రెష్‌గా దొరుకుతాయి.
- ఇవి అన్ని స్వీట్ షాపుల్లో లభిస్తాయి.
- ప్యాక్ చేసుకుని మీ సొంత ఊరికి కూడా తీసుకెళ్లొచ్చు.
- ఇది కూడా చదవండి : Eateries In Goa : గోవాలో తప్పకుండా ట్రై చేయాల్సిన 10 రెస్టారెంట్స్ ఇవే
5. చేపల పులుసు | Fist Curry
అసలైన Vizag Coastal Flavour ఎంజాయ్ చేయాలి అనుకుంటే chepala pulusu పక్కా ట్రై చేయండి.
ఇందులో సీర్ ఫిష్, కట్లా లేదా కొరమీనుతో చేసిన టాంగీ ఫిష్ కర్రీ ఇది. రైస్‌తో ట్రై చేయకపోతే చేప త్యాగం వ్యర్థం అయినట్టే.
- Andhra Meals లభించే హోటల్స్‌లో ట్రై చేయండి.
- మధ్యాహ్నం లేదా డిన్నర్ టైమ్‌లో ట్రే చేయండి.
- ఇది కూడా చదవండి : Borra Caves: బొర్రా గుహలు ఎన్నేళ్ల క్రితం ఏర్పడ్డాయో తెలుసా ? 12 ఆసక్తికరమైన విషయాలు
6. ఉలవచారు, అన్నం | Ulava Charu
Top 7 Vizag foods : వైజాగ్ హోటల్స్‌లో దొరికే ఒక కంఫర్ట్ ఫుడ్ ఇది. ఉలవలతో చేసిన థిక్ రసం ఇది. అన్నం, నెయ్యి దానికి ఉలవచారు తోడైతే నాలుక లపలపలాడుతుంది. నాలుకపై ఉన్న టేస్ట్ బడ్స్‌కు సర్వీస్ చేసినట్టే అనిపిస్తుంది. కడుపు మీకు థ్యాంక్స్ చెబుతుంది.
- మీల్స్ సర్వ్ చేసే హోటల్స్‌లో కామన్‌గా దొరకుతుంది
- లంచ్‌లో ట్రై చేయండి.
- ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
7. బొబ్బట్లు | Puran Poli
ఒకప్పుడు తెలుగు పండగల్లో కింగ్ లాంటి డిష్ ఇది. ఇప్పుడు ప్రతీ రోజు తినే సెలబ్రిటీ అయింది.
బెల్లం, శనగపప్పు ఫిల్లింగ్‌తో చేసే సాఫ్ట్ బొబ్బట్లు వైజాగ్‌లో చాలా పాపులర్.
- హోమ్ స్టైల్ టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపుల్లో లభిస్తాయి.
- మార్నింగ్ టైమ్‌లో ఫ్రెష్‌గా లభిస్తాయి.
- ఇది కూడా చదవండి : Travel Vlogging Tips : ట్రావెల్ వ్లాగర్ అవ్వాలంటే ఏం చేయాలి ? 10 టిప్స్ !
వైజాగ్ ఫుడ్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేయాలంటే..
- సాయంత్రం స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయండి.
- సీ ఫుడ్ ఫ్రెష్‌గా సర్వ్ చేసే ప్రదేశాల్లో మాత్రమే తినండి.
- కొంచెం స్పైస్ ఎక్కువైనా భరించడానికి ప్రిపేర్ అవ్వండి.
- లోకల్ హోటల్స్‌లో మీల్స్ అస్సలు మిస్ అవ్వకండి.
వైజాగ్‌లో ఫుడ్ (Food) అంటే ఫ్లేవర్ మాత్రమే కాదు…ఇది ఒక కోస్తా మసలాలకు ట్రైబల్ టేస్ట్ కలిసిన ఫుడ్ పార్టీ లాంటిది. ఇక్కడి స్నాక్స్, స్వీట్ ట్రెడిషన్ ఇవన్నీ ఒక పర్ఫెక్ట్ ఫుడ్ జర్నీకి మోటివేషన్‌లా పని చేస్తాయి.
మీరు వైజాగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?
అయితే ఈ ఫుడ్ లిస్ట్ ఫాలో అయితే మీ టేస్ట్ జర్నీ పూర్తయి అయినట్టే.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
