మనం కేక్ కట్ చేస్తాము… వాళ్లు ప్లేట్లు విరగ్గొడతారు | Weird New Year Celebrations
జనవరి ఫస్ట్ రోజు చాలా దేశాల్లో కొత్త సంవత్సరాన్ని ఎలా సెలబ్రేట్ చేస్తారో తెలుసా ? ప్లేట్లు విరగ్గొట్టడం, గ్రేప్స్ మింగడం, స్మశానంలో సెలబ్రేట్ చేయడం…ఇలా Weird New Year Celebrations చేసే దేశాలు ఇవే
మనం కేక్ కట్ చేస్తాము…కొన్ని దేశాల్లో ప్లేట్స్ విరగ్గొడతార…జనవరి 1వ తేదీన ప్రపంచంలో ఉన్న కొన్ని వింత ఆచారాలు, నమ్మకాలు Weird New Year Celebrations పోస్టులో మీకోసం..
లోకో భిన్నరుచి | Weird New Year Celebrations
జనవరి ఫస్ట్ అంటే మనకు తెలిసింది కౌండ్‌డౌన్, కేక్ కటింగ్, బాణసంచా కాల్చడం, స్టేటస్లు పోస్ట్ చేయడం.
కానీ ప్రపంచంలో (World) కొన్ని దేశాల్లో కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ చేసుకునే విధానం విచిత్రంగా ఉంటాయి. భయం, విశ్వాసం, మూఢ నమ్మకం…ఇవన్నీ కలిసి ఈ ప్రపంచంలో నిజంగా విచిత్రమైనది అనిపించేలా చేస్తాయి. అలా లాజిక్కు దూరంగా కొత్త సంవత్సరం వేడుకలు చేసుకునే దేశాలు ఇవే.
పాస్‌పోర్ట్ అవసరం లేకుండా… ఆ దేశాలకు వెళ్లిపోదామా
- ఇది కూడా చదవండి :ప్రపంచ వింతలకు తక్కువ కాని 8 ప్రదేశాలు…చూస్తే వారెవ్వా అనాల్సిందే !
స్పెయిన్ | Spain 🇪🇸 – Clock tho Grape Race

మిడ్నైట్ 12 గంటలకు వాచిలో ఉన్న గంట పన్నెండు సార్లు ఠంగ్ ఠంగ్ అని మోగుతుంది. ప్రతీ ఠంగ్కు ఒక గ్రేప్ తింటే లక్ వస్తుంది అని అక్కడి వాళ్లు భావిస్తారు.
ఇలా ఎందుకు చేస్తారు ? | why they do this?
ఇలా చేస్తే 12 నెలల పాటు జీవితం సాఫీలా సాగుతుంది అని వాళ్లు భావిస్తారు. అదేమో కానీ అంత ఫాస్ట్‌గా తినడం సాధ్యం కానప్పుడు ఉడతనోట్లో పప్పులు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫేస్.
- ఇది కూడా చదవండి : ఇక్కడ క్రిస్మస్ తాతతో ఫోటో దిగవచ్చు
డెన్మార్క్ | Denmark 🇩🇰 – Plates Viragottadam = Friendship

మనం ఇక్కడ కేకులు కట్ చేస్తాం అవసరం పటాకలు కాలుస్తాం. కానీ డెన్మార్మ్లో ఫ్రెండ్స్ ఇంటి ముందు ప్లేట్స్ విసురుతారు. విరగ్గొడతారు.
ఎన్ని విరిగిన ప్లేట్స్ ఉంటాయో…అంత స్ట్రాంగ్ కాఫీలా ఫ్రెండ్ షిప్ స్ట్రాంగ్‌గా ఉంటుందట.
మనం దోస్తుకు కేక్ ఇస్తాము కదా…వాళ్లు క్లీనింగ్ టాస్క్ ఇస్తారు. అంతేగా
ఇలా ఎందుకు చేస్తారు ? | why they do this?
పాత పగలు, కక్షలు కోపాలు బ్రేక్ అవ్వాలి అనడానికి సింబల్ ఇది. మనం ప్లేట్ల ఐడియాను పక్కన పెట్టి దోస్తులను చాయ్‌కి పిలిచి ఒక ఉస్మానియా బిస్కిట్ని రెండుగా బ్రేక్ చేసి షేర్ చేసుకుందాం.
- ఇది కూడా చదవండి : Oymyakon : ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామం
కోలంబియా | Colombia 🇨🇴 – Yellow Underwear Rule
జనవరి 1వ తేదీన ఇక్కడ ఎల్లో అండర్వేర్ వేసుకోవడం తప్పనిసరి. మనీ, సంతోషం కోసం ఇది అక్కడి మ్యాండటరీ అంట.
దీనిని అపార్థం చేసుకోవద్దు. అర్థం చేసుకోవద్దు కూడా. ఎందుకంటే ఇది వారి న్యూ ఇయర్ రిజల్యూషన్ అయి ఉంటది. మనది కాదు
ఇలా ఎందుకు చేస్తారు ? | why they do this?
పచ్చ రంగు అనేది సంపదకు, పాజిటివిటికి సింబల్‌గా భావిస్తారు.
- ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
రొమానియా | Romania 🇷🇴 – Bear Costume Dance
రొమానియాలో కొత్త సంవత్సరం సందర్భంగా ప్రరజలు ఎలుగుబంటి కాస్ట్యూమ్ ధరించి వీధుల్లో నాట్యం చేస్తారు.
చూడ్డానికి చాలా స్కేరిగా, అడవిలో ఉన్నట్టుగా ఉంటుంది.
ఇలా ఎందుకు చేస్తారు ? | why they do this?
ఎలుగుబంటి శక్తి వల్లి దుష్టశక్తులు దూరం అవుతాయి అనేది వారి నమ్మకం.
ఇది కూడా చదవండి : Lapland: ఇక్కడ క్రిస్మస్ తాతతో ఫోటో దిగవచ్చు
నెదర్లాండ్స్ | Netherlands 🇳🇱 – Ice Cold Sea Jump
జనవరి ఫస్ట్ ఉదయం ఇక్కడి ప్రజలు చలితో ఫ్రీజ్ అయిన సముద్రంలో జంప్ చేస్తారు. అది కూడా జాకెట్స్ లేకుండా. అస్సలు భయపడకుండా.
ఇలా ఎందుకు చేస్తారు ? | why they do this?
కొత్త సంవత్సరం పూర్తిగా మైండ్‌ను బాడిని రీసెట్ చేయడానికి ఇలా చేస్తారు.
మన దగ్గర కొత్త సంవత్సరం వేడి వేడి చాయ్ లేదా కాఫీ తాగుతాం.
వాళ్ల సైడ్ హెపోథెర్మియా టెస్ట్ చేస్తారు.
- ఇది కూడా చదవండి : రూ.19,999 కే భూటాన్ వెళ్లే బడ్జెట్ ప్యాకేజ్
జపాన్ | Japan 🇯🇵 – 108 Bell Rings

జపాన్‌లోని ఆలయాల్లో బెల్లును 108 సార్లు గంటను మోగిస్తారు. ప్రతీ రింగుకు ఒక మనిషి కోరిక నెరవేరుతుంది అని భావిస్తారు.
ఇలా ఎందుకు చేస్తారు ? | why they do this?
కొత్త సంవత్సరం పాత కోరికలు తీరి కొత్త మైండ్‌సెట్‌తో స్టార్ట్ చేయడం కోసం ఇలా చేస్తారు. చాలా ప్రశాంతంగా,చాలా డీప్ థాట్ కదా ఇది.
- ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
చిలీ | Chile 🇨🇱 – Cemetery New Year

ఇక్కడ కొత్త సంవత్సరాన్ని స్మశానంలో కుటుంబ సభ్యుల సమాధుల్లో చెక్ చేస్తారు.
తమ పూర్వికులతో కలిసి కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేయాలి అని భావిస్తారు.
ఇలా ఎందుకు చేస్తారు ? | why they do this?
జీవన్మరణాలను సమంగా గౌరవించాలని, ఈ రెండూ నిత్యం కొనసాగుతాయి అని వారు భావిస్తారు.
- ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
రియాలిటీ చెక్ | Reality Check (Prayanikudu Touch)
మనం జనవరి 1న తిరుమలలో క్యూలో ఉంటాము లేదా ట్రాఫిక్‌లో ఉంటాము లేదా ఏదో రిజల్యూషన్ బ్రేక్ చేస్తాము..
కానీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ప్లేటులు విరగ్గొడతారు, బుగ్గనిండా ద్రాక్షా పండ్లను నింపుతాారు, ఎలుగుబంటిలా డ్యాన్స్ చేస్తారు.
- ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
నిజానికి కొత్త సంవత్సరం అనేది సరదా వేడుక మాత్రమే కాదు. అది ఒక నమ్మకం కూడా. సంవత్సరాలు మారినా మారని సంప్రదాయలకు అది ప్రతీకగా నిలుస్తుంది కూడా.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
