Medaram Special Trains : మేడారం జాతరకు 28 ప్రత్యేక జనసాధారణ రైళ్లు
Medaram Special Trains : మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు దక్షిణ మధ్య రైల్వే 28 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వాటికి సంబంధించిన రూట్స్, స్టేషన్స్ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో..
మేడారం సమ్మక్మ సారలమ్మ జాతర (sammakka Saralamma Jatara 2026) సందర్భంగా భక్తుల రద్దీని మేనేజ్ చేయడానికి సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
జాతర సమయంలో 28 జనసాధారన్ (రిజర్వ్ కాని) ప్రత్యేక ట్రైన్లను నడపనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు 2026 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు వివిధ మార్గాల్లో ప్రయాణిస్తాయి.
- ఇది కూడా చదవండి : రైల్ వన్ యాప్ ద్వారా అన్రిజర్వ్డ్ టికెట్లపై 3% డిస్కౌంట్
ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ - మంచిర్యాల, సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్, నిజామాబాద్ - వరంగల్, కాజిపేట్-ఖమ్మం, అదిలాబాద్- కాజీపేట్ మార్గాల్లో ప్రయాణిస్తాయి.
- Secunderabad -Mancherial Medaram Special Trains వచ్చేసి మౌలాలి, ఘట్కేసర్, బిబినగర్, భోనగిరి, జనగామ్, వరంగల్, రామగుండం వంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
- Sirpur Kagazhnagar Medaram Spcial Trains అనేవి మంచిర్యాల, బెల్లంపల్లి, అసిఫాబాద్ రోడ్డు వరకు కొనసాగుతాయి.
- Nizamabad -Warangal Medaram Special Train కామారెడ్డి, మేడ్చల్, కాజిపేట్ స్టేషన్లలో ఆగుతాయి.
- Kazipet–Khammam రూట్లో వరంగల్, మహబూబ్‌నగర్, దోర్నాకల్ లాంటి కీలక స్టేషన్లలో ట్రైన్ ఆగుతుంది.
- అదే Adilabad-Kazipet Medaram Special Trains బాసర, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి మార్గంలో వెళ్తాయి.
ఈ స్పెషల్ ట్రైన్లు అన్నీ సెకండ్ జనరల్ క్లాస్ కోచులతో ఉంటాయి. Unreserved ప్రయాణికుల కోసం ఈ ప్రత్యేక ట్రైన్లను ఏర్పాటు చేశారు. దక్షిణ మధ్య రైల్వే (South Central Railways) అధికారుల ప్రకారం భక్తులు ముందుగా ట్రావెల్ ప్లాన్ చేసుకుని జాతరకు సేఫ్‌గా, స్మూత్‌గా జర్నీని ఎంజాయ్ చేయగలరు.
ఇది మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికుడు పాఠకులకు ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాం.
Feature Image అనేది కేవలం రిప్రెసెంటేషన్ కోసం వినియోగించాం. అది ఫైల్ ఫోటో..
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
