బుర్రకు బ్రేక్ కావాలా? అయితే లాంగ్కావి వెళ్తే సరి! | Langkawi Travel Guide
Langkawi Travel Guide :లాంగ్కావిలో యాక్టివిటీస్ అంటే సుడిగాలిలా కాకుండా చిరుగాలిలా ఉంటాయి. సింపుల్ అండ్ స్మూత్ యాక్టివిటీస్ ఉంటాయి.
మలేషియాలోని లాంగ్కావి ద్వీపంలో అడుగు పెట్టగానే టైమ్ కాస్త బ్రేక్ తీసుకుంటుంది. అంతా కాస్త స్లో అవుతుంది. అండమాన్ సముద్ర తీరంలో ఉన్న ఈ ఐలాండ్ బీచులు చాలా ప్రశాంతంగా ఉంటాయి.
- అలలు కలలో మనం అడుగులేసినట్టు మెల్లగా సాగుతాయి ఉంటాయి.
- క్రౌడ్, సౌండ్, హడావిడి లేని బీచ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.
- మొత్తానికి, స్లో టూరిజం ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
ఎలా చేరుకోవాలి? (How To Reach)
లాంగ్కావి అనేది అండమాన్ సముద్రంలో ఉన్న 99 చిన్నా-పెద్ద దీవుల సమూహం. కానీ లోటైడ్ అంటే నీటి స్థాయి కనిపిస్తే 104 దీవులు చూడవచ్చు
ఇక్కడికి మీరు విమానంలో సులభంగా చేరుకోవచ్చు. కౌలాలంపూర్ (Kuala Lumpur) నుంచి ప్రతీ రోజూ డైరెక్ట్ విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ ప్రయాణికులు ముందుగా కౌలాలంపూర్ చేరుకుని, అక్కడి నుంచి దేశీయ విమానాల్లో లాంగ్కావికి ప్రయాణించవచ్చు.
అలాగే, ఇక్కడికి చేరుకునేందుకు ఫెర్రీ ఆప్షన్ కూడా ఉంది. పెనాంగ్ లేదా కౌలా కెదాహ్ నుంచి లాంగ్కావికి రెగ్యులర్ ఫెర్రీలు నడుస్తాయి.
- ఇది కూడా చదవండి : వియత్నాం వెళ్లేందుకు భారతీయులు ఎందుకు ఇష్టపడుతున్నారు ?
యాక్టివిటీస్ (Activities)
లాంగ్కావిలో యాక్టివిటీస్ అంటే సుడిగాలిలా కాకుండా చిరుగాలిలా ఉంటాయి. సింపుల్ అండ్ స్మూత్ యాక్టివిటీస్ ఉంటాయి.
బీచ్ వాక్, సన్‌సెట్ చూడటం, మాంగ్రోవ్ వనాల్లో బోట్ రైడింగ్… ఇలా అన్నమాట.
- కేబుల్ కారులో ప్రయాణిస్తూ ఐలాండ్ అందాలను వీక్షించడం
- కేఫ్‌లలో ప్రశాంతంగా బ్రేక్‌ఫాస్ట్ చేయడం
- సముద్రాన్ని చూస్తూ ఛాయ్ తాగడం (లేదా కాఫీ కూడా ట్రై చేయొచ్చు)
ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ లిమిటెడ్‌గా ఉంటాయి.
అందుకే ఇక్కడ మరింత ప్రశాంతత కనిపిస్తుంది.
ఎందుకు వెళ్లాలి? (Why Visit Langkawi)
లాంగ్కావి అనేది సాధారణ పర్యాటక ప్రదేశం కాదు. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే క్రియేటర్స్ (Reels, Shorts Makers) ఎక్కువగా ఉండరు. అందుకే హడావిడి ఉండదు, ట్రావెల్ లిస్ట్ కంప్లీట్ చేయాలనే తొందర కూడా కనిపించదు.
కాబట్టి, నిజంగా బుర్రకు బ్రేక్ కావాలి అంటే…
లాంగ్కావి బెస్ట్ ప్లేస్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
