Nihilist Penguin : బ్రతుకే అగమ్యం అని నేర్పే ప్రయాణికుడు ఈ నిహిలిస్ట్ పెంగ్విన్
ఈ మధ్య Nihilist Penguin అనే మీమ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చుట్టూ మంచు పర్వతాల మధ్య నిలబడి ఉన్న ఒక పెంగ్విన్… కింద ఒక క్యాప్షన్ ఉంది.
“Try చేశాను… కానీ ఏమీ మారలేదు అని
గుంపు నుంచి దూరంగా అంతులేని ప్రయాణం ఎందుకు మొదలుపెట్టింది ? పూర్తి చేయలేని లక్ష్యాన్ని చేరడానికి బయల్దేరి, ఖచ్చితంగా చేరలేని గమ్యంవైపు అది ఎందుకు సాగింది అనేదే ఇప్పుడు అందరు మదిలో ఉన్న ప్రశ్న.
మనం ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే దీనికి సమాధానం వెతకడమో, లేదా అది ఎక్కడికి వెళ్లిందో కనుక్కోవడమో కాదు ముఖ్యం. మనం ఈ పెంగ్విన్ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటున్నామో అనేదే ముఖ్యం.
చాలా మంది దీన్ని నెగెటివ్‌గా చూశారు.
కానీ ట్రావెల్ చేసే వాళ్లకు ఇది ఒక ఫెయిల్యూర్ స్టోరీ కాదు.
ఇది ఒక మూవ్‌మెంట్.
17 ఏళ్ల క్రితం తీసిన ఈ వీడియోలో పెంగ్విన్ ఒక విషయం చెప్పకనే చెబుతోంది ..
లైఫ్ ఎప్పుడూ గ్యారంటీ ఇవ్వదు.
ట్రావెల్ కూడా అంతే.
ట్రావెల్ అంటే రీసెట్ బటన్ కాదు.
చాలా మంది ట్రావెల్ ప్లాన్‌ను కొన్ని టార్గెట్లు పెట్టుకుని డిజైన్ చేస్తారు.
“ఈ ట్రిప్ తర్వాత లైఫ్ మారిపోతుంది” అని.
కానీ నిజానికి లైఫ్ మారకపోవచ్చు. గ్యారంటీ లేదు.
- ఇది కూడా చదవండి : Antarctica : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
ఈ జర్నీ నాకు క్లారిటీ ఇవ్వాలి…
నిజానికి ఆ క్లారిటీ రావడానికి ఆ జర్నీ ఉపయోగపడకపోవచ్చు.
ఈ ప్రయాణం నా గమ్యానికి చేరువగా తీసుకెళ్తుంది…
చివరికి ప్రయాణమే పూర్తయ్యి, గమ్యం దొరకకపోవచ్చు.
ప్రయాణాలంటే మాయాదర్పణం కాదు. వెంటనే మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేది కాదు.
రియాలిటీలో ట్రైన్ లేట్ అవ్వొచ్చు, బస్ మిస్ అవ్వొచ్చు,
వర్షం వల్ల అన్నీ క్యాన్సిల్ అవ్వొచ్చు,
బడ్జెట్ వల్ల ప్లాన్ మారవచ్చు…
కొన్ని సార్లు ముందుకు వెళ్లాలనే కోరిక కూడా తగ్గొచ్చు.
అయినా కూడా మనం ట్రావెల్ చేస్తూనే ఉంటాం.
ఎందుకు?
జీవిత పాఠాలు నేర్పే Nihilist Penguin | Lesson for Travellers
ఈ వీడియోలో పెంగ్విన్ తన ప్రయాణాన్ని ఆపలేదు.
ఫలితాలు ఎలా వస్తాయో ఏదీ ఫిక్స్ కాదు.
ఈ ప్రయాణానికి అర్థం ఏంటో కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు.
కొన్ని సార్లు ముందుకు వెళ్లడమే ప్రధానం.
ప్రయాణాల్లో బిగ్గెస్ట్ ఫ్రీడమ్ ఏంటి అంటే
ఎక్స్‌పెక్టేషన్స్ తక్కువ, ప్రెషర్ కూడా తక్కువ.
డెస్టినేషన్ బాగుంటే బోనస్.
కాకపోయినా కూడా జర్నీ వేస్ట్ కాదు.
ఒంటరి ప్రయాణాలు (Solo Travel)
సోలోగా ట్రావెల్ స్టార్ట్ చేసే సమయంలో చాలా సందేహాలు ఉంటాయి.
ఈ ప్రయాణం వర్తా?
చేస్తే ఏం వస్తుంది?
అసలు ఎందుకు వెళ్లాలి?
దీనికి Nihilist Penguin సమాధానం చాలా సింపుల్
ఈ ప్రయాణం చేస్తే ఏం రాకపోవచ్చు.
కానీ వెళ్లడమే ఇంపార్టెంట్.
ఎందుకంటే ఒకచోటే ఉండటం కన్నా ముందుకు వెళ్లడం ఉత్తమం.
మంచి టైమ్ కోసం వెయిట్ చేయడం కన్నా,
వస్తుందో రాదో తెలియని మంచి టైమ్ కోసం ముందుకు దూకడం ఉత్తమం.
మన ప్రయత్నం వల్ల ఏమీ మారకపోయినా,
అది ఫెయిల్యూర్ కాదు అని కూడా Nihilist Penguin చెప్పకనే చెబుతోంది.

పెంగ్విన్ కాలనీలో అన్నీ సేఫ్ ప్లేస్ వైపు వెళ్తే,
ఇది మాత్రం 5,000 కిమీ విస్తారమైన ఖండంలోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది.
దానికి విజయం సాధించిందో లేదో, దానికి తెలిసో తెలియదో తెలియదు.
కానీ ఏ పెంగ్విన్ చేయని ఒక కొత్త ప్రయాణాన్ని
అనుకోకుండానే ప్రారంభించింది.
ఇంకో కోణంలో ఆలోచిస్తూ తినడం, పడుకోవడం, నడవడం మళ్లీ తినడం మళ్లీ పడుకోవడం మళ్లీ నడవడం…ఇదే కాల చక్రంలో ఇరుక్కుపోయిన తోటి పెంగ్విన్‌లకు భిన్నంగా కొత్త ప్యాటర్న్ కోసం పాత సిస్టమ్‌కు దూరంగా వెళ్లిన రెబల్ ఈ పెంగ్విన్ అని కూడా చెప్పవచ్చు. ఇది తన అంతం అని దానికి తెలిసి ఉండొచ్చు. దూరం అనంతం అని కూడా తెలిసి ఉండొచ్చు.
ఇందులో విజయం సాధించే అవకాశం శూన్యం.
కానీ అది ఫలితాల కోసం కాదు,
క్షణిక విజయాల కోసం కాదు
తను అడుగు ముందుకేసింది కేవలం ముందుకు వెళ్లడానికేనేమో
మనం ఒక టూర్ ఫినిష్ చేసి వచ్చిన తర్వాత కూడా
అదే జాబ్, అదే సమస్యలు, అదే రొటీన్ ఉండొచ్చు.
ఏమీ పెద్దగా మారకపోవచ్చు.
ఎందుకంటే ప్రయాణాలే జీవితాన్ని పూర్తిగా మార్చేస్తే,
ఎవరూ ఇళ్లు కట్టుకునేవారు కాదు…
అందరూ క్యాంపుల్లోనే ఉండేవారు.
అయితే దీనర్థం మన ప్రయాణం వేస్ట్ అయ్యిందా?
కాదు.
దీనర్థం
మనం అద్భుతాలు ఆశించడం మానేశాము.
రియాలిటీని అక్సెప్ట్ చేశాము.
ఏమీ మారదని తెలిసినా ట్రిప్ ప్లాన్ చేస్తాం.
ఎందుకంటే ఒక ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు కదా.
నిజానికి ప్రయాణాలు జీవితాన్ని ఫిక్స్ చేసే ఫెవిక్విక్ కాదు.
ప్రయాణాలు జీవితాన్ని షేక్ చేయడం కాదు ఫేస్ చేయడం.
గమ్యం చేరుతామా లేదా అన్నది కాదు,
దారిలో ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం.
కాబట్టి నెక్ట్స్ టైమ్ జీవితంలో చౌరస్తాలో నిలబడి
“ఏ దారి?” అని ఆలోచిస్తున్నప్పుడు
ఏ దారి అయినా సరే,
ప్రయాణం ఆగదు అని గుర్తు పెట్టుకోండి. జీవితంలో కొన్ని ఒంటరి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అప్పుడు నిహిలిస్ట్ పెంగ్విన్‌ను గుర్తుపెట్టుకోండి. గుంపు లేదా మంద నుంచి దూరంగా ఉండటం, భిన్నంగా ఉండటం, కొత్త దారుల్లో నడవడం అనేవి జీవితంలో భాగం అని ఈ బుల్లి పెంగ్విన్ చెప్పకేనే చెబుతోంది.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
