Maori Tribal Dance : మేడారం జాతరలో మావోరి గిరిజన నృత్యం
Maori Tribal Dance: ములుగు జిల్లాలో జరుగుతున్న సమ్మక్క–సారాలమ్మ జాతరలో ఒక ప్రత్యేక కల్చరల్ ఈవెంట్ జరిగింది. న్యూజిలాండ్ నుంచి వచ్చిన మావోరి (Maori Tribe) గిరిజన కళాకారులు తమ సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో భక్తులు, పర్యాటకుల మనసులు గెలుచుకున్నారు.
జాతర ప్రాంగణంలో జరిగిన ఈ నృత్య ప్రదర్శనలో కళాకారులు సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. వారి అడుగుల కదలికలు, లయబద్ధమైన నృత్యం, భావవ్యక్తీకరణతో పాటు ముఖ కవలికలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి.
ఈ కల్చరల్ ఎక్స్ఛేంజ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజన సంప్రదాయాల మధ్య ఉన్న సామీప్యత, సమానతలు స్పష్టంగా కనిపించాయి. ప్రకృతి పట్ల గౌరవం, పెద్దల పట్ల భక్తి, సముదాయ జీవనం వంటి విలువలు గిరిజన సంస్కృతిలో ఎంత ముఖ్యమో ఈ ప్రదర్శన తెలియజేసింది.
“Remember the Māori haka that went viral in the New Zealand Parliament?
— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) January 26, 2026
Today, the haka was performed at Medaram ahead of the Sammakka–Saralamma Jatara.” pic.twitter.com/BM8yG0sm3Z
మేడారం జాతరను కేవలం ఆధ్యాత్మిక సమ్మేళనంగా మాత్రమే కాకుండా, ఒక గిరిజన సంస్కృతి వేదికగా నిలబెట్టే దిశగా ఇలాంటి అంతర్జాతీయ కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Medaram Sammakka Saralamma Jatara 2026 తెలంగాణ గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. సమ్మక్క–సారాలమ్మ వనదేవతలకు అంకితమైన ఈ జాతర గిరిజన పరంపరలు, భక్తి ,ఆచారాలకు ప్రత్యక్ష నిదర్శనం.
ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్సవం సందర్భంగా మేడారం అటవీ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతుంది. భక్తి, ఆచారాలు, గిరిజన జీవన విలువలు కలిసిన ఈ జాతర తెలంగాణలో అతిపెద్ద గిరిజన ఉత్సవంగా గుర్తింపు పొందింది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
