ఫస్ట్ టైమ్ మేడారం ట్రావెలర్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు | First Time Medaram Jatara Travel Guide
First Time Medaram Jatara Travel Guide : మేడారం జాతరకు తొలి సారి వెళ్లే ప్రయాణికులు, భక్తులకు ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే మెమొరీస్ కూడా ఇస్తుంది.
జాతర రోజుల్లో మేడారం అటవీ ప్రాంతానికి లక్షలాది భక్తులు వస్తారు. ఫస్ట్ టైమ్ విజిటర్స్ అక్కడి గ్రౌండ్ రియాలిటీ ముందుగానే తెలుసుకుంటే, ట్రావెల్ స్ట్రెస్ లేకుండా స్మూత్‌గా యాత్రను పూర్తి చేయవచ్చు.
క్రౌడ్ రియాలిటీ | Medaram Crowd
గతంతో పోలిస్తే ఈసారి మేడారం జాతరకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్ నుంచి గద్దెల వరకు భక్తుల రాకపోకలకు అనుగుణంగా ప్లానింగ్ అమలు చేస్తున్నారు.
అయితే సొంత వాహనాల్లో వచ్చే భక్తులు గద్దెలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ చేసి, అక్కడి నుంచి నడుచుకుంటూ దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో దర్శనానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది.
ఇలాంటి సందర్భాల్లో ఓపిక, సౌకర్యవంతమైన ఫుట్‌వేర్ చాలా అవసరం అని ఫస్ట్ టైమ్ ట్రావెలర్స్ గుర్తుంచుకోవాలి.
- ఇది కూడా చదవండి : Medaram Jatara Circuit : నాలుగు జిల్లాలను కదిలించే ట్రావెల్ సర్క్యూట్
సదుపాయాలు | Medaram Facilities
జాతర సమయంలో భక్తుల కోసం టెంపరరీ వాటర్ పాయింట్స్, టాయిలెట్స్, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కానీ పీక్ క్రౌడ్ ఉన్న సమయంలో ఇక్కడ కొంత వెయిటింగ్ తప్పదు. వయసులో పెద్దవాళ్లు, చిన్నపిల్లలతో వచ్చే వారు వేగం కంటే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.
నెట్వర్క్ సమస్య… Network and Payments
అటవీ ప్రాంతం కావడంతో మొబైల్ నెట్వర్క్ సమస్యలు సర్వసాధారణం. డిజిటల్ పేమెంట్స్ అన్ని చోట్ల వర్క్ అవ్వకపోవచ్చు. కాబట్టి కాస్త క్యాష్తో పాటు బ్యాకప్ ప్లాన్ ఉండటం మంచిది. పేమెంట్ ఫెయిల్ అయితే మీ సమయం మాత్రమే కాదు, ఇతర భక్తుల సమయమూ వృథా అవుతుంది.
వాతావరణం
జాతర సమయంలో మేడారం పరిసరాల్లో వాతావరణం సాధారణంగా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఉదయం, రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉంటుంది. దర్శనం కోసం ఉదయం 8 గంటల లోపు వెళ్లితే భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉంటుంది.
అటవీ ప్రాంతం కావడంతో పర్యావరణ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. వన విభాగం, స్థానిక పోలీస్ అధికారుల సూచనలు అనుసరించాలి. ప్లాస్టిక్ వినియోగం నివారించాలి, అలాగే నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లకూడదు.
ఫస్ట్ టైమ్ మేడారం జాతరకు వెళ్లే భక్తులు రద్దీని మైండ్‌లో పెట్టుకుని, టైమ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేస్తే, ఈ యాత్ర ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభవంగా మారుతుంది.

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
