ఆ ఆలయంలో 20,000 ఎలుకలు..నిత్యం భక్తుల పూజలు | Karni Mata Rat Temple
Karni Mata Rat Temple : రాజస్థాన్లో ఉన్న దేశ్నోకే అనే చిన్న ఎడారి పట్టణంలో ఒక డిఫరెంట్ ఆలయం ఉంది. మొత్తం భారతదేశంలోనే ఇలాంటి మరో ఆలయం లేదు. అదే కర్నీ మాతా ఆలయం.
ఇతర ఆలయాల్లో లేదా ఇతర ప్రదేశాల్లో ఎలుకలు వస్తే తరిమేస్తాం. కానీ ఈ ఆలయంలో మాత్రం ఎలుకలకు స్వాగతం పలుకుతారు, పూజిస్తారు.
ఇక్కడ ఉన్న 20,000కి పైగా ఉన్న ఎలుకలను కబ్బాస్ (Kabbas) అని పిలుస్తూ భక్తితో పూజిస్తారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక్కడ 14వ శతాబ్దానికి చెందిన కర్నీ మాతాను దుర్గామాత అవతారంగా భావిస్తారు. ఈ ఆలయంలో ప్రధానంగా చరణ్ కమ్యూనిటీ వారు అమ్మవారిగా నేటికీ పూజిస్తున్నారు.
- ఇది కూడా చదవండి : Floating Post Office : నీటిపై తేలే పోస్టాఫీస్…ఎక్కడ ఉందో తెలుసా?
పురాణాల ప్రకారం కర్నీ మాతా కుమారుడు నీటిలో మునిగి మరణించాడు అని చెబుతారు. అప్పుడు ఆమె తన కుమారుడికి ప్రాణం పోయమని యముడిని కోరిందట. అయితే దీనికి యముడు అంగీకరించలేదు. దీంతో కర్నీ మాతా, తన భక్తులు యమలోకానికి వెళ్లరు అని ప్రకటించిందని స్థానికులు చెబుతున్నారు.
Explore Karni Mata Mandir, a place where the presence of rats is seen as a divine blessing… pic.twitter.com/TeylodTabF
— Ranvijay Singh (@ranvijayT90) February 27, 2024
స్థానికుల కథనాల ప్రకారం, కర్నీ మాత భక్తులు మరణం తర్వాత ఇక్కడ ఎలుకలుగా పునర్జన్మిస్తారని, అనంతరం మళ్లీ మనుషులుగా పుడతారని నమ్మకం ఉంది. అందుకే ఈ ఎలుకలను కర్నీ మాత భక్తుల ఆత్మలుగా ఇక్కడికి వచ్చే భక్తులు విశ్వసిస్తారు.
ఈ నమ్మకం వల్లే ఇక్కడ ఎలుకలను గాయపరచడం పెద్ద పాపంగా భావిస్తారు. భక్తులు చెప్పులు లేకుండా నడుచుకుంటూ, ఎలుకలకు పాలు, ధాన్యాలు, స్వీట్లు తదితర ఆహారాన్ని అందిస్తారు. ఒకవేళ భక్తుల కాలిపై నుంచి ఎలుక పరుగెత్తుకుంటూ వెళ్తే, అది శుభసూచకంగా భావిస్తారు.
నల్ల ఎలుకల మధ్య అరుదుగా తెల్ల ఎలుకలు కనిపిస్తే అది అత్యంత శుభసూచకంగా భావిస్తారు. ఎందుకంటే ఆ తెల్ల ఎలుకను కర్నీ మాతగా లేదా ఆమె సంతానంగా భక్తులు నమ్ముతారు.
ఈ రోజుల్లో ఎలుకలు తిరిగే ప్రదేశాన్ని అపరిశుభ్రంగా, ఆనారోగ్యాలకు కారణమని చాలా మంది భావించినా, గత 500 సంవత్సరాలకు పైగా ఈ ఆచారం నిరంతరంగా కొనసాగుతోంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.







