Norway travel : సూర్యుడు అస్తమించడం మర్చిపోయిన దేశం
Norway travel : ఎండాకాలంలో నార్వేలోని ఉత్తర ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో సూర్యుడు అస్తమించడు. అర్ధరాత్రి అయిన తరువాత కూడా వెలుగు ఉండటం వల్ల ఈ ప్రత్యేక ప్రకృతి దృశ్యాన్ని మిడ్నైట్ సన్ అని పిలుస్తారు.
ఇక్కడ ప్రకృతికి ఒక వేరే క్లాక్ ఉన్నట్టు అనిపిస్తుంది. సాధారణంగా మనకు రోజూ ఉండే పగలు, రాత్రి మధ్య తేడా ఇక్కడ కనిపించదు.
రాత్రి అనే ఒక భావన లేకపోవడంతో సాయంత్రాలకు అంతే లేదేమో అనిపిస్తుంది. సూర్యుడు అస్తమించకుండా ఆకాశంలోనే తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. ప్రకృతి మధ్య నడిచే నడక అయినా, సముద్రం తీరంలో గడిపే సమయం అయినా.. అన్ని కూడా ఒక లాంగ్ గోల్డెన్ ఈవెనింగ్లా మారిపోతాయి. సమయం మెల్లిగా సాగుతున్న అనుభూతి కలుగుతుంది.
Beautiful Midnight Sun in Lofoten, Norway
— 𝕏 Travels, Hotels and Resorts (@em3dia) August 26, 2025
🎥m.j.fotografia I IG pic.twitter.com/MjdLe1eFFR
సందర్శనీయ స్థలాలు | Places To Visit
ఇక్కడ Tromsø, Lofoten Islands లో ప్రతీ నిమిషం ఒక సాయంత్రాన్ని రబ్బర్లా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడి పర్వతాలు, సముద్రం, వెలుగు కలిసి ఒక సినిమాటిక్ దృశ్యాన్ని క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.
- ఇది కూడా చదవండి : Rovaniemi : ఇక్కడ క్రిస్మస్ తాతతో ఫోటో దిగవచ్చు
హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి? | How To Reach From Hyderabad
Hyderabad నుంచి Osloకి కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకుని, అక్కడి నుండి డొమెస్టిక్ ఫ్లైట్స్ ద్వారా ట్రోమ్సే లేక లోఫోటెన్ ప్రాంతాలకు చేరుకోవచ్చు. అక్కడ సమ్మర్లో వెలుగును అనుభూతి చెందడం అనేది ఒక అరుదైన ట్రావెల్ మెమోరీగా మిగిలిపోతుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
