94 వేల బారియర్లు, 4 నదులపై వంతెనలు – ఇది మన Bullet Train మ్యాజిక్!
Bullet Train : బుల్లెట్ ట్రైన్ సూరత్-బిలిమోరా 50 కి.మీ సెక్షన్ లో OHE ఎనర్జైజ్ అయింది. 508 కి.మీ కారిడార్, 14 TSS, 94,000 బారియర్లతో టెస్టింగ్ కు రెడీ. పూర్తి వివరాలు.
భారతదేశపు మొదటి బుల్లెట్ ట్రైన్ కల నిజం కాబోతోంది. 20 నవంబర్ 2026న ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ లోని సూరత్-బిలిమోరా సెక్షన్ లో ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ (OHE) విజయవంతంగా ఎనర్జైజ్ చేశారు.
ఇది కేవలం కరెంటు ఇవ్వడం కాదు, టెస్టింగ్ కు ముందు అత్యంత కీలకమైన అడుగు. సూరత్ నుండి బిలిమోరా వరకు సుమారు 50 కిలోమీటర్ల ఎలివేటెడ్ ట్రాక్ పై అప్ అండ్ డౌన్ రెండు లైన్లలో ఈ పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో నాలుగు నదులపై వంతెనలు, జాతీయ రహదారి NH-53 పై ఒక స్టీల్ వంతెన నిర్మించారు. శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి దాదాపు 94,000 నాయిస్ బారియర్లు ఏర్పాటు చేశారు.
BREAKING: India’s first Bullet Train gets POWER! Surat-Bilimora 50km OHE energised on 20 Nov 2026. 508km MAHSR corridor with 14 TSS, 4 river bridges, 94k noise barriers. Testing begins soon! Ready for 320 kmph ride? #BulletTrain #SuratBilimora #prayanikudu https://t.co/fTZzCKrw5l
— PRAYANIKUDU (@PrayanikuduOff) November 21, 2026
మొత్తం 508 కిలోమీటర్ల కారిడార్ అత్యాధునిక 2×25 kV ఓవర్ హెడ్ ట్రాక్షన్ సిస్టమ్ తో నిర్మిస్తున్నారు. ఇది ప్రపంచంలో హైస్పీడ్ రైళ్లకు వాడే అత్యుత్తమ టెక్నాలజీ. ఈ కారిడార్ వెంట 14 ట్రాక్షన్ సబ్ స్టేషన్లు (TSS) వ్యూహాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇవి నేషనల్ గ్రిడ్ నుండి విద్యుత్ తీసుకుని బుల్లెట్ ట్రైన్ కు అందిస్తాయి.
మొదటి TSS బిలిమోరాలో, నవసారి జిల్లాలో పూర్తయింది. ఇది గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ కు చెందిన 220 kV అంబేతా గ్రిడ్ సబ్ స్టేషన్ నుండి విద్యుత్ పొందుతుంది. మొత్తం నెట్ వర్క్ ను సెంట్రలైజ్డ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షిస్తారు.
ఈ విజయం భారత రైల్వే భవిష్యత్తుకు, మన ప్రయాణాలకు కొత్త వేగాన్ని ఇస్తుంది. తెలుగు ప్రయాణికులుగా మనం కూడా ఈ అభివృద్ధిని చూసి గర్వపడాలి. 2027లో సూరత్-బిలిమోరా మధ్య తొలి ప్రయాణం ప్రారంభం కానుంది.
▶️ వీడియో చూడండి : థాయ్లాండ్ కంప్లీట్ ట్రావెల్ గైడ్
