Tiruchanur Teppotsavam : తిరుచానూరులో ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు
Tiruchanur Teppotsavam: తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 29వ తేదీన ఆధ్యాత్మిక వైభవం మధ్య ఘనంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ ఉత్సవం చివరి రోజున శ్రీ పద్మావతి అమ్మవారు అలంకరించిన తెప్పపై పద్మసరోవరంలో ఏడు ప్రదక్షిణలు చేస్తూ వేలాది మంది భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు.

ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేలుకొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చనలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం అత్యంత వైభవంగా జరిగింది.
సాయంత్రం ఉత్సవ మూర్తులను పద్మసరోవరం దగ్గరకు వేంచేపు చేసి, గోవింద నామస్మరణల మధ్య తెప్పోత్సవం భక్తి పరవశంతో నిర్వహించారు.
తెప్పోత్సవం అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు గరుడవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో దివ్య విహారం చేస్తూ భక్తులను కటాక్షించారు. ఈ మహోత్సవాన్ని చూడటానికి ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందారు.
తిరుచానూరు తెప్పోత్సవాలు ప్రతి సంవత్సరం భక్తి, సంప్రదాయం, ఆలయ వైభవాన్ని ప్రతిబింబించి ప్రముఖ ఆధ్యాత్మిక వేడుకగా నిలుస్తున్నాయి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.