యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తరువాత భారతీయులు ఎక్కువగా సందర్శించే దేశం సౌదీ అరేబియా (Saudi Arabia). తన ప్రాచీన చరిత్ర, విశిష్ఠమైన భూభాగం వంటి అనేక అంశాలు సౌదీ అరేబియాను ట్రావెలర్స్‌కు ఫేవరిట్ స్పాట్‌గా మారుస్తున్నాయి.
ఇస్లాం మతానికి అతి ముఖ్యమైన ఎన్నో స్థలాలు కూడా ఇక్కడే ఉన్నాయి.
సౌదీ అరేబియలో ముస్లింలు మాత్రమే వెళ్లగలిగిన ప్రాంతాలు, ముస్లిమేతరులు వెళ్లగలిగిన ప్రాంతాల్లో కొన్నింటిని ఈ పోస్టులో షేర్ చేస్తున్నాం. చదవగలరు..
1.మక్కా | Mecca, Saudi Arabia
ఇస్లాం మతంలో అత్యంత పవిత్ర నగరాల్లో మక్కా నగరం మొదటి స్థానంలో ఉంటుంది.
ప్రతీ ముస్లిం తన జీవితంలో ఒక్కసారి అయినా మక్కాకు వెళ్లాలి అని కోరుకుంటాడు. ఇస్లాం ప్రకారం ప్రతీ ముస్లిం నిర్వహించాల్సిన అయిదు బాధ్యతల్లో హజ్ యాత్ర కూడా ఒకటి.
ఇక్కడి మసీదును అల్ మస్జిద్ అల్ హరామ్ ( Al Masjid Al Haram) అంటారు.
ఈ మసీదులోకి వెళ్లి కాబా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేస్తూ అల్లాను ప్రార్థిస్తారు.
మక్కా నగరం సౌదీ అరేబియాలోని మక్కా ప్రావిన్సులో ఉంది.
Read Also: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
మక్కా నగరంలోకి ముస్లిం మతస్తులు మాత్రమే వెళ్లగలరు. ఇతర మతస్తులకు ఈ నగరంలోకి ప్రవేశించే అనుమతి లేదు.
మక్కా వెళ్లినవారు ఎవరైనా ఉంటే మరిన్ని వివరాలు కామెంట్ సెక్షన్‌లో తెలపగలరు.ఇంకా ఏమైనా ఆసక్తికరమైన విషయాలు నేను మిస్ అయిన విషయాలు ఉంటే తెలపగలరు.
2.మదీనా | Medina
మదీనా అనేది ముస్లిం మతస్థుల పవిత్ర క్షేత్రాలలో ఒకటి. ఈ నగరం మక్కాకు 450 కిమీ దూరంలో ఉంటుంది.
ఈ నగరంలోకి ముస్లిమేతరులు, అన్య మతస్తులు కూడా వెళ్లవచ్చు.
అయితే ప్రపంచంలోనే అతి పెద్ద మసీదుల్లో ఒకటైన అల్ మస్జిద్ అల్ నవాబి ( al-masjid-al-nawab i) మసీదు ప్రాంగణంలోకి మాత్రం ఇతర మతస్థులకు వెళ్లే అనుమతి లేదు.
మొహమ్మద్ ప్రవక్త నిర్మించిన రెండవ మసీదు ఇదే. ఇది అల్ హరాం (al haram ) అనే ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలోకి ఇతర మతస్తులు వెళ్లరాదు.
అయితే మీరు ఈ నగరంలోని ఇతర ప్రాంతాల్లో సందర్శించవచ్చు. ఎవరూ పర్యటకులను ఆపరు.
3. క్యూబా మసీద్ / Quba Mosque
ప్రపంచంలోనే తొలి మసీదు ఇది. అందుకే ఇస్లాంలో క్యూబా మీసీదుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇది మదీనా నగరంలో ఉంది.
ఈ మసీదు పునాది రాయిని స్వయంగా మొహమ్మద్ ప్రవక్త వేశారు. ఇందులోకి ముస్లిం మతస్తులు మాత్రమే ప్రవేశించగలరు.
మదీనాలో ఇక్కడ అరేబియన్, పాకిస్థానీ, బంగ్లాదేశీ రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్లకు ఆప్షన్స్ ఎక్కువ. అయితే వెజిటేరియన్స్ కూడా ఫుడ్ కూడా లభిస్తుంది.
వీధుల్లో ఎక్కడ చూసినా రకరకాల పెర్ఫ్యూమ్‌లు అమ్మేవారు కనిపిస్తారు.
4. క్లాక్ టవర్ | Mecca Clock Tower
మక్కాకు వెళ్లే చాలా మంది మసీదు ప్రాంగణంలో ఉండే క్లాక్ టవర్‌లో ఉండాలి అని కోరుకుంటారు.
ఎందుకంటే ఇక్కడి హోటల్ నుంచి వారికి మసీదు ప్రాంగణం కనిపిస్తుంది.
ఈ టవర్లో మధ్యలో ఉన్న పెద్ద టవర్‌ను మక్కా క్లాక్ టవర్ అంటారు. ఇది ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద బిల్డింగ్ .
Read Also: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
ఈ క్లాక్ టవర్‌లోని ఒక్కో క్లాక్ ఎత్తు 187 అడుగులు. ప్రపంచంలోనే అతిపెద్ద క్లాక్ కూడా ఇదే.
5.అల్ ఉలా | Al-Ula
సౌదీ అరేబియాలో ముస్లిమేతరులు సందర్శించగల ప్రాంతాల్లో అల్ ఉలా కూడా ఒకటి. ఇక్కడ చాలా మంది ఎలిఫెంట్ రాక్‌ను చూసేందుకు వస్తుంటారు.
కొన్ని మిలియన్ల ఏళ్ల పాటు నీరు, గాలి కలిసి చెక్కిన సహజమైన భారీ శిల్పం ఇది.
అల్ ఉలా నాగరికత అనేది 2,00,000 ఏళ్ల కన్నా పురాతనమైనది. మదీనా నుంచి 5-6 గంటలు ప్రయాణించిన అలూలా చేరుకోవచ్చు.
ఇక్కడికి వస్తే మీరు భూమిపై కాదు మరో గ్రహంలో ఉన్న అనూభూతి కలుగుతుంది.
టూరిస్టులకు అనుమతి
సౌదీ అరేబియా ఈ మధ్యే పర్యటకులను తమ దేశంలో వివిధ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు అనుమతిస్తోంది.
అయితే మక్కా నగరంలోకి ముస్లిమేతరులు ప్రవేవించలేరు.మదీనాలో మసీదు ప్రాంగణం వరకు ముస్లిమేతరులు వెళ్లగలరు కానీ లోపలికి వెళ్లరాదు.
సౌదీలో మీరు క్యామెల్ రైడ్ ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ క్యామెల్ రైడ్ అనేది మిలియన్ డాలర్ల పరిశ్రమ.
మీరు ఎప్పుడైనా సౌదీ వెళ్లారా ? లేదా ప్లాన్ చేస్తున్నారా ? కామెంట్ చేయండి. అండ్ పోస్టులో ఏమైనా ఇబ్బందులు, సూచనలు, సలహాలు ఉంటే కామెంట్ చేయండి లేదా…kishoretelugutraveller@gmail.com కు మెయిల్ చేయగలరు.
మీ ఫీడ్ బ్యాక్ ఈ పోర్టల్‌ను మరింత సమర్థవంతంగా నడిపించేందుకు ఉపయోగపడుతుంది.
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.