ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో భారత దేశం కూడా ఒకటి. మన దేశం రైల్వే నెట్వర్క్ ( Indian Railways ) విషయంలో కూడా టాప్‌లో ఉంటుంది.
7300 రైల్వే స్టేషన్లు 67,000 కిలో మీటర్ల లైన్లతో కోట్లాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతోంది ఇండియన్ రైల్వే
అయితే మన దేశంలో ఒక రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు.ఆ రాష్ట్రమే సిక్కిం (Sikkim).
నార్త్ ఈస్ట్ రాష్ట్రమైన సిక్కిం హిమాలయాల్లో కొలువైన అందమైన ప్రదేశం.
కానీ ఎన్నో కారణాల వల్ల ఇక్కడ రైల్వే నెట్వర్క్ లేదు. ఆ ఇబ్బందులు ఏంటో చూడండి.
ముఖ్యాంశాలు
1.భౌగోళిక స్వరూపం
సిక్కింలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేకపోవడానికి ఇక్కడి భౌగోళిక స్వరూపమే కారణం. రాష్ట్రంలో ఎంతో ఎత్తైన హిమాలయ పర్వతాలే ( himalayas) కాదు అతి లోతైన లోయలు కూడా ఉన్నాయి.
Read Also: Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి?
దీంతో పాటు ఇక్కడ కొండ చరియలు కూడా ఎక్కువగా విరిగిపడుతుంటాయి. దీంతో ఇక్కడ రైల్వే నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి అధికారులు ఆలోచిస్తుంటారు. అయితే ఇక్కడ రోడ్డు రవాణా వ్యవస్థ చాలా డెవెలప్ అయింది.
2. రోడ్డు, వైమానిక రవాణా
సిక్కింలో రైల్వే స్టేషన్ లేదనే కానీ ఇక్కడ రోడ్డు రవాణా వ్యవస్థ చాలా బాగుంది. దీంతో పాటు వైమానిక సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
సిక్కిం రాజధాని గ్యాంగ్టక్‌కు ( Gangtok) పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నుంచి నేషనల్ హైవే 10 దారిలో చేరుకోవచ్చు.
దీంతో పాటు ఇక్కడ పాక్యాంగ్ ( Pakyong Airport) ఎయిర్ పోర్టు కూడా ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.
3. రైల్వే ప్రయత్నాలు | Indian Railways
ఇప్పటి వరకు సాధ్యం కానిది ఇకపై సాధ్యం కాకపోవచ్చు అని అనలేం కదా. సిక్కింలో రైల్వే నెట్వర్క్ సాధ్యం అవుతుందా లేదా అనే విషయంపై రైల్వే మంత్రిత్వ శాఖ ఆలోచన మొదలుపెట్టింది.
దాంతో పాటు సిక్కింకు రైల్వే లైన్లు కనెక్ట్ చేసేందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లోని సిలిగురి ( Siliguri) నుంచి సిక్కింగ్ రాజధాని గ్యాంగ్టక్ వరకు రైల్వే లైన్ ప్లాన్ చేస్తోందట.
Read Also: Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
అయితే ఈ రైల్వే లైన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అనే విషయంపై ప్రస్తుత అధికారికంగా సమాచారం అందుబాటులో లేదు.
4.సిక్కిం ఆగదు | Sikkim
రైల్వే నెట్వర్క్ లేకపోయినా సిక్కిం డెవెలెప్మెంట్ ఆగలేదు.సిక్కిం కొత్తగా ఆలోచించడం ఆపలేదు. పర్యటకాన్ని తన ప్లస్ పాయింట్‌గా మార్చుకుని దూసుకెళ్తోంది ఈ రాష్ట్రం.
అద్భుతమైన సిక్కిం భౌగోళిక స్వరూపం, జీవ వైవిధ్యం, విశిష్టమై సంప్రదాయాలు, ఆచారాల వల్ల సిక్కిం పర్యటకులకు ( sikking tourism) ఫేవరిట్ డెస్టినేషన్‌గా మారింది.
అందుకే రైల్వే స్టేషన్ లేకపోయినా ఇతర రోడ్డు మార్గంలో లేదా వాయు మార్గంలో ఇక్కడికి చేరుకుంటారు ప్రయాణికులు.
5. ఆట ఇప్పుడే మొదలైంది
సిక్కిం కథ ముగియలేదు. ఏదోక రోజు ఇక్కడికి రైల్వే సదుపాయం కూడా వస్తుంది అని ఆశిస్తున్నాం. అప్పటి వరకు మీ ప్రయాణాన్ని మాత్రం ఆపకండి. ఎందుకంటే నార్త్ ఈస్ట్ ఇండియా చాలా బాగుంటుంది. నేను వెళ్లి వచ్చాను కాబట్టి ఒక్కటి మాత్రం చెబుతాను…మీకు తప్పకుండా పైసా వసూల్ అవుతుంది.
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ఇవి కూడా చదవండి