Travel Vlogging Tips : ట్రావెల్ వ్లాగర్ అవ్వాలంటే ఏం చేయాలి ? 10 టిప్స్
ట్రావెల్ వ్లాగింగ్కి ( travel vlogging ) ఇది స్వర్ణయుగం. ఉమా తెలుగు ట్రావెలర్, నా అన్వేషణ లాంటి పాపులర్ వ్లాగర్స్ను ( telugu travel vloggers) చూసి చాలా మంది ట్రావెల్ వ్లాగింగ్‌ను తమ కెరియర్‌గా ఎంచుకోవాలి అని భావిస్తున్నారు.
మరికొంత మంది తమ ఉద్యోగం, వ్యాపారం కొనసాగిస్తూనే ట్రావెల్ వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ చాలా మందికి ఎక్కడ, ఎలా మొదలు పెట్టాలో ( travel vlogging tips in telugu ) తెలియడం లేదు. అలాంటి వారి కోసం ఈ పోస్టు ఒక పెద్దబాలశిక్షలా ఉపయోగపడుతుంది.
Read Also: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
ముందుగా ఈ పోస్ట్ పెట్టడానికి నాకున్న అర్హతల గురించి చెబుతాను. అప్పుడు నా మాటకు విలువ ఉంటుంది అని నేను భావిస్తున్నాను.
అనే నేను…
నేను ఒక సీనియర్ జర్నలిస్టుని. 2023 అక్టోబర్‌లో ప్రయాణికుడు ( Prayanikudu) అనే పేరుతో య్యూట్యూబ్‌లో ట్రావెల్ వ్లాగ్స్ ప్రారంభించాను. జర్నలిస్టుగా 13 ఏళ్ అనుభవం ఉన్నా ట్రావెల్ వ్లాగర్‌గా నేను కూడా జీరో నుంచే మొదలు పెట్టాను.
ఉద్యోగాన్ని, వ్లాగింగ్‌ను మెయింటేన్ చేస్తున్నాను కాబట్టి అంత రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను. అయితే కనీసం వారానికి ఒక పోస్ట్ అనేది పెట్టడం వల్ల నా ఛానెల్ మానిటైజ్ అయింది. నాకు అంతో ఇంతో డబ్బులు కూడా వస్తున్నాయి. అదన్నమాట. ఇక అసలు విషయానికి వద్దాం.
ట్రావెల్ వ్లాగ్స్ ప్రారంభించాలనే మీ కసికి ఈ టిప్స్ సహాయపడతాయి అని ఆశిస్తున్నాను.
ముఖ్యాంశాలు
1.ఎలాంటి వ్లాగ్ చేయాలి ? | Types Of Travel Vlogging
ట్రావెల్ వ్లాగింగ్ చేయాలి అనుకుంటున్నప్పుడు ముందుగా మీరు ఎలాంటి వ్లాగ్స్ చేయాలని అనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. అంటే బడ్జెట్ ట్రావెలా ( budget travel ) , లగ్జరీ ట్రావెలా, ట్రైన్ జర్నీల వ్లాగ్సా, బస్సు ప్రయాణాల వ్లాగ్సా, అడ్వెంచ్ ట్రావెలా, డివోషనల్ ట్రావెలా, కల్చర్, ఫుడ్, సోలో, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పార్టనర్‌తో , ఇలా చాలా రకాల ఆప్షన్స్ కూడా ఉంటాయి.

పైన ప్రస్తావించిన వాటిలో ఎలాంటి వ్లాగ్స్ చేయాలి అనుకుటున్నారో నిర్ణయించుకోండి. లేదంటే మీరు అన్ని లేక కొన్ని రకాల వ్లాగింగ్ ( types of travel vlogging ) కొంత కాలం ట్రై చేయండి. దేనికి మంచి రెస్పాన్స్ వస్తోంది లేదా మీకు ఏది నచ్చుతుందో అని ఆలోచించిన తరువాత నిర్ణయించుకోవచ్చు.
2.సరైన ఎక్విప్మెంట్ | Equipment for Travel Vlogging
ట్రావెల్ వ్లాగింగ్‌లో ఎక్విప్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీ బడ్జెట్‌ను బట్టి మీరు ఎక్విప్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. నేను మాత్రం హిమాలయాలకు ( himalayas ) వెళ్లినా నా మొబైల్‌తోనే షూట్ చేశాను. అది ఐఫోన్ కూడా కాదు యాండ్రాయిడ్ బేసిక్ మొబైలే. మేబీ ఫ్యూచర్లో మంచి ఎక్విప్మెంట్ కొంటానేమో.
నా ఆర్థిక పరిస్థితి వల్ల నేను అడ్జస్ట్ అవుతున్నాను. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ఆలోచించండి. ఉన్న దాంతో కానిచ్చేయాలా..లేక మంచి ఎక్విప్మెంట్ కొనాలా మీరు డిసైడ్ అవ్వండి.

కెమెరా | Camera For Vlogs
వ్లాగ్స్ చేయడానికి లక్షలు పోసి కెమెరాలు కొనే అవసరం లేదు. డబ్బు ఉంటే కొనండి. మీ డబ్బు మీ ఇష్టం. అయితే మధ్య తరగతి కష్టాల్లో ఉన్న నాలాంటి చాలా మందికి మొబైల్ కెమెరానే సీడ్ క్యాపిటల్.

స్టార్టింగ్‌లో మంచి కెమెరా ఉన్న ఫోన్ సరిపోతుంది. వ్లాగ్స్ నుంచి డబ్బు వచ్చే కొద్ది ఆ డబ్బుతో ఎక్విప్మెంట్ కొనవచ్చు. గుర్తుంచుకోండి మంచి పాలిచ్చే బర్రెకు మంచి తవుడు వేస్తారు. అలాగే డబ్బు బాగా వచ్చినప్పుడు మాత్రమే కాస్ట్లీ ఎక్విప్మెంట్ కొనండి.
అంతే కానీ అప్పు చేసి కొనడం మంచి ఐడియా కాదు. ఎందుకంటే వ్లాగ్స్ హిట్ అయ్యి డబ్బు వచ్చేందుకు సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు కూడా పట్టవచ్చు.
మైక్ : Wireless Mic
వ్లాగ్స్ అనేవి 90 శాతం ఔట్‌డోర్‌లో రికార్డు చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు బయటి సౌండ్ వల్ల మీరు మాట్లాడేది తక్కువగా వినిపిస్తే చూసేవాళ్లకు నచ్చదు. అందుకే ఒక వైర్లెస్ మైక్ ( wireless mic ) కొనండి .

మీ బడ్జెట్‌ను బట్టి రూ.500 నుంచి రూ.50,000 వరకు మైక్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ బ్లాగ్ రాస్తున్న సమయానికి నేను రూ.3250 విలువ చేసే బోయా మైక్ వాడుతున్నాను. అంతకు ముందు గ్రెనోరో కూడా కొంత కాలం వాడాను. బోయా మైక్ Vs Grenareo mic పై నేను వ్లాగ్ కూడా చేశాను. అవసరం అనిపిస్తే చూడండి.
గింబల్ లేదా సెల్ఫీ స్టిక్ | Gimbal Or Selfie Stick
ట్రావెల్ వ్లాగ్స్ చేసే సమయంలో వెనక బ్యాగ్రౌండ్‌తో పాటు మన ముఖం కనిపించేలా రికార్డు చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఒక సెల్ఫీ స్టిక్ ఉంటే బాగుంటుంది. నార్మల్ సెల్పీ స్టిక్ రూ.300కు కూడా దొరుకుతుంది.
Read Also: Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
అయితే సెల్ఫీ స్టిక్ వల్ల ట్రావెల్ వ్లాగర్స్కు కొంత ఇబ్బంది కూడా ఉంటుంది. ఎందుకంటే మనం వాక్ చేస్తూ షూట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వేసే ప్రతీ అడుగుకు కెమెరా కదులుతూ ఉంటుంది. దీంతో వీడియో షేక్ అవుతుంది. నా వీడియోలు చూస్తే ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు. అయితే సెల్ఫీ స్టిక్ వల్ల ట్రావెల్ వ్లాగర్స్కు కొంత ఇబ్బంది కూడా ఉంటుంది. ఎందుకంటే మనం వాక్ చేస్తూ షూట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వేసే ప్రతీ అడుగుకు కెమెరా కదులుతూ ఉంటుంది. దీంతో వీడియో షేక్ అవుతుంది. నా వీడియోలు చూస్తే ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు.
ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మీరు గింబెల్ ( mobile gimbal ) కొనడానికి ప్రయత్నించండి. ఈ గింబెల్ కెమెరాను స్డడీగా ఉంచుతుంది.
ఆన్లైన్లో గింబెల్స్ మీకు రూ.3500 నుంచి రూ.30 వేల వరకు ధరలో అందుబాటులో ఉంటాయి. రివ్యూస్ చూసి కొనండి. అంత బడ్జెట్ లేదు అనుకుంటే య్యూబ్యూబ్లో మొబైల్‌తో వ్లాగ్స్ ఎలా చేయాలి అనే టాపిక్‌పై చాాలా వీడియోలు ఉంటాయి. వాటిని చూసి ప్రాక్టిస్ చేయండి. చాలా మంది పెద్ద యూట్యూబర్లు నేటికి సింపుల్‌గా మొబైల్‌తో రికార్డు చేస్తుంటారు. వారి నుంచి టిప్స్ ( Travel Vlogging Tips ) తెలుసుకోండి.
3.ఎడిటింట్ | Travel Vlogs Editing
కావాల్సిన కంటెంట్ రికార్డు చేశాక దాన్ని ఎడిటింగ్ చేయడమే నెక్ట్స్ పని. దీని కోసం మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉంటే అందులో ఫైనట్ కట్ ప్రో, అడాబ్ ప్రీమియర్ ప్రో, డావించి రిసాల్వ్ వంటి ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్‌లో ఏదో ఒకటి ఇన్స్టాల్ చేయండి.

వీటిని ఎలా వాడాలో యూబ్యూబ్‌లో వీడియో చూసి నేర్చుకోవచ్చ.ల్యాప్ టాప్ లేకపోతే మొబైల్లో కూడా నేర్చుకోవచ్చు. కైన్ మాస్టర్, ఇన్షాట్ లాంటి యాప్స్ బాగా ఉపయోగపడతాయి. నేను ఇప్పటికీ ఇన్షాట్ యాప్‌లోనే ఎడిట్ చేస్తాను.
4.కంటెంట్ ప్లానింగ్ | Content Planning For Travel Vlogging
వ్లాగ్ అంటే కంటెంట్. ఇందులో మీరు ఏం చూపించాలి అనుకుంటున్నారో మీరు ఎలా కనిపించాలి అనుకుంటున్నారో ముందుగానే ఒక ప్లాన్ చేస్తే ఔట్పుట్ బాగుంటుంది. ఒక క్లారిటీతో మీ పని మీరు చేసుకొవచ్చు.ఏ ట్రావెల్ వ్లాగర్ కూడా తను వెళ్లే నెక్ట్స్ డెస్టినేషన్ గురించి రిసెర్చ్ చేయకుండా వెళ్లడు. నేను కూడా ఎక్కడికి వెళ్లినా ఆ ప్లేస్ గురించి తెలుసుకునే వెళ్తాను. మీరు ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారో ఎలా వెళ్లాలి అనుకుంటున్నారో…ఏ ఏ ప్లేసెస్ కవర్ చేయాలి అనుకుంటున్నారో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ప్రతీ వీడియోకు ఒక థీమ్ నిర్ణయించుకోవాలి.
Read Also: UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు

ఆలయాలకు సంబంధించిన వ్లాగ్‌కు ఒక స్టైల్ ఉంటుంది. బీచులో తీసే వ్లాగ్‌కు ( Beach Vlogs) ఒక థీమ్ ఉంటుంది. ఎవరూ వెళ్లని చూపించని ప్రదేశాలు, కట్టడాాలు, మార్కెట్లు ఇలా చాలా థీమ్స్ మీరు ఎంచుకోవచ్చు.మీరు వెళ్లాలి అనుకుంటున్న ప్లేస్ గురించి ఫ్యాక్ట్స్ తెలుసుకోండి. రకరకాల సోర్సుల నుంచి సమాచారం సేకరించండి. వాటిని చదవండి గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు ఏం మాట్లాడినా అది చూసేవారికి ఉపయోగపడేలా ఉంటుంది. లేదంటే మీ వీడియో హిట్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి.
4. పబ్లిక్‌లో ఎలా మాట్లాడాలి ? | How To Record In Public
చాలా మంది వ్లాగ్ చేయడానికి భయపడే అంశం పబ్లిక్‌లో ఎలా మాట్లాడాలి అని. దీని కోసం నేనేం చేశానో చెబుతాను. ముందు ఈ వ్లాగింగ్ వల్ల నా జీవితం మెరుగు అవుతుంది. ఆర్థికంగా పుంజుకుంటాను అని నాకు తెలుసు. మొహమాటం వల్ల లైఫ్‌ను మార్చుకునే అవకాశాన్ని మిస్ అవ్వను అని నిర్ణయించుకోవాలి.
చాలా మంది వ్లాగ్ చేయడానికి భయపడే అంశం పబ్లిక్‌లో ఎలా మాట్లాడాలి అని. దీని కోసం నేనేం చేశానో చెబుతాను. ముందు ఈ వ్లాగింగ్ వల్ల నా జీవితం మెరుగు అవుతుంది. ఆర్థికంగా పుంజుకుంటాను అని నాకు తెలుసు. మొహమాటం వల్ల లైఫ్‌ను మార్చుకునే అవకాశాన్ని మిస్ అవ్వను అని నిర్ణయించుకోవాలి. కర్తవ్యం దైవంతో సమానం. అందుకే పనిని గౌరవిస్తూ మన పని మనం చేసుకోవాలి. ఎవరు ఏమనుకున్నా మన పని మనం చేసుకోవాలి.
ఇది కూడా చదవండి : Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
అయినా మొహమాటంగా అనిపిస్తుంది అంటే మీరు వ్లాగ్ చేసేటప్పుడు కేవలం మీ కెమెరా వైపు మాత్రమే చూసి షూట్ అయ్యాక అక్కడి నుంచి వెళ్లిపోండి. ఎవరితో ఐ కాంటాక్ట్ పెట్టుకోకండి.
ఎవరైనా మీవైపే తీక్షణంగా చూస్తుంటే అతని దగ్గరికి వెళ్లి అతడిని కూడా వీడియోలో ఇంక్లూడ్ చేయండి. లేదా అతని చేతికి కెమెరా ఇచ్చి ఒక నిమిషం రికార్డు చేస్తారా అని అడగండి. ఇవన్నీ నేను ప్రాక్టికల్‌గా చేసినవే. ఇప్పుడు నేను వ్లాగ్ చేయాలనుకుంటే చేసేస్తాను. ఆలోచించను అసలు.
మీకు ఇంకో విషయం చెబుతాను చాలా మంది వీడియోలో కనిపించాలి అనుకుంటారు. మీరు అడుగుతారేమో అని కూడా ఆలోచిస్తుంటారు. మరి మీరెందుకు వాళ్లు మీ గురించి నెగెటీవ్‌గా ఆలోచిస్తున్నారేమో అని అనుకుంటారు ?
5. కథలా చెప్పండి…కథలు కాదు | Narration In Travel Vlogging
ఒక నవల హిట్ అయినా లేదా సినిమా సూపర్ హిట్ లేదా ర్యాప్ సాంగ్ అయినా అది కథాబలంతోనే హిట్ అవుతుంది. లేదా హీరో మ్యానరిజంతో హిట్ అవుతుంది. మీరు మంచి వ్లాగర్ అవ్వాలి అనుకుంటే రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోండి. మీ వ్లాగ్‌లో మీరే హీరో లేదా హీరోయిన్ కదా.

ఒక ప్రదేశం గురించి చెప్పాలి అనుకుంటే ఒక కథ వర్ణిస్తున్నట్టు వివరించండి. ఇంట్రెస్టింగ్గా చెప్పండి. కథలో ఆరంభం, విరామం అంతం ఎలా ఉంటుందో అలా ప్లాన్ చేయండి. మధ్య మధ్యలో మీకు వచ్చే ఇబ్బందులు వాటిని మీరు ఎలా సాల్వ్ చేశారో చెప్పండి.
వినేవారు నెక్ట్స్ ఏం జరుగుతుందో అని వేచి చూసేలా చెప్పవచ్చు. అయితే ట్రావెల్ వ్లాగ్స్‌లో మీరు చెప్పే సమాచారం మాత్రం ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే చాలా మంది వ్లాగ్స్ చూసేది తమకు తెలియంది ఏమైనా ఉంటే అది తెలుసుకోవాలని మాత్రమే.
6. ఎంగేజ్ చేయండి
మీరు ఉమా తెలుగు ట్రావెలర్ వీడియోలు ( Telugu travel videos ) చూసినా లేదా నా వీడియోలు చూసినా ఒక విషయం గమనిస్తారు. మధ్య మధ్యలో నాకు తెలియని విషయాల గురించి మాట్లాడినప్పుడు…అర్థం కాకపోతే ప్రేక్షకులను దీనిపై కామెంట్ చేయమని అడుగుతాము.
Read Also : సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు?
ఉదాహరణకు రిషికేష్‌లో ( rishikesh ) మంచి సౌత్ ఇండియన్ ఫుడ్ కోసం వెతుకుతూ అది కనిపించకపోతే వ్యూవర్స్ ఎవరైనా రిషికేష్ వచ్చి వుంటే కామెంట్ బాక్సులో మంచి ప్లేస్ సజెస్ట్ చేయమని అడగవచ్చు. దీంతో తెలిసిన వారు కామెంట్ చేస్తారు. వీడియో ఎంగేజ్మెంట్ పెరుగుతుంది.
ఛీప్ ట్రిక్స్ చేయకండి ప్లీజ్
ఎంగేజ్మెంట్ పెంచుకోవడానికి చాలా మంది తుప్పాస్ మార్గాలు ఎంచుకుంటారు. కొన్ని షార్ట్స్ వీడియోలో మీరు చూసే ఉంటారు.
“ మీకు మీ అమ్మ ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో ఐ లమ్ మై మదర్ అని టైప్ చేయండి…నాన్న ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేయండి. ఇద్దరూ ఇష్టం అయితే ఐ లవ్ మై మమ్మీ డ్యాడీ అని కామెంట్ చేసి వీడియోను లైక్ చేసి ఇద్దరికి షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ చేయండి. చూద్దాం మీరు పేరెంట్స్‌ని ఎంత ప్రేమిస్తున్నారో” అని ఇలాట్రై చేయకండి. ఇదొక రోత పద్ధతి.
ఒక అంశంపై వ్యూవర్స్ ఏమనుకుంటున్నారో తెలిపేలా ఎంకరేజ్ చేయండి. అంతే కాని వారి ఇమోషనల్‌గా పిండేయాలి అనుకోకండి. మొదటికే మోసం వస్తుంది.
7. ఎస్సీఓ నేర్చుకోండి | Learn SEO for Travel Vlogging
యూబ్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేసేస్తె సరిపోదు. అది టార్గెట్ ఆడియెన్స్‌కు చేరాలి అంటే మీరు ఎస్సీఓ ( SEO ) చేయాలి. దీని గురించి మీకు యూట్యూబ్‌లో చాలా వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ మీరు నేర్చుకోవచ్చు.

మంచి టైటిల్, దానికి తగిన విధంగా డిస్క్రిప్షన్, ట్యాగ్స్, సబ్ టైటిల్స్ ఇలా అన్ని విషయాలపై మీకు అవగాహన ఉండాలి. అప్పుడు మీ వీడియో త్వరగా టార్గెట్ ఆడియెన్స్‌ను రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.ఒక్కసారి నేర్చుకుంటే జీవితాంతం మీకు పనికొస్తుంది ఎస్సీఓ అనేది.
8. ఎడిటింగ్‌లో మెళకువలు
వీడియోను ఇలా తీసి అలా పెడితే వ్యూవర్ కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోతాడు. అందుకే మొదటి సారి చూస్తున్న వ్యక్తి కూడా మీ వీడియోను ఎక్కువ సేపు చూసేలా ఎడిట్ చేయాలి. దీంతో పాటు మంచి మ్యూజిక్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యూజిక్‌ను మీరు యూట్యూబ్ ఆడియో లైబ్రెరీ ( youtube audio library నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా కొన్ని ఫ్రీ సోర్సెస్ ఉంటాయి.వాటి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ మ్యూజిక్ వాడినా అది వాడే పర్మిషన్ మీకు ఉండా లేదా చెక్ చేయండి. లేదంటే కాపీరైట్ వచ్చేస్తుంది.
Read Also:Also Read : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
ట్రావెల్ వ్లాగ్ ఎడిటింగ్‌లో ( travel vlog editing ) రకరకాల మెళకువలను మీరు యూట్యూబ్‌లో చూసి నేర్చుకోవచ్చు. నేర్చుకున్న వాటిని ఒక్కొక్కటిగా అమలు చేయడానికి ప్రయత్నించండి. అయితే అన్నీ ఒకేసారి చేయాలని తొందరపడకండి. ఒక గుడిసెను ఒక్క రోజులో కట్టేయొచ్చు…కానీ తాజ్ మహల్ కట్టాలి అంటే ఏళ్లు పడుతుంది. మంచి ఛానెల్ బిల్డ్ అవ్వాలి అంటే కూడా టైమ్ పడుతుంది.
9. షేర్ చేయండి | How Plan Travel Vlog Promotion
కష్టపడి ఒక వ్లాగ్ చేశారు అనుకోండి… మరి నెక్ట్స్ ఏంటి ? చూసేవాళ్లు కావాలి కదా ? యూట్యూబ్ మీ వీడియోను సజెస్ట్ చేయడం మొదలు పెట్టడానికన్నా ముందు మీకు కొన్ని వ్యూస్ వస్తే ఎంకరేజింగ్‌గా ఉంటుంది.అందుకే మీ సోషల్ మీడియా ఖాతాలో వాటిని షేర్ చేయండి. తెలిసిన వారికి కూడా వాట్సాప్‌లో షేర్ చేయవచ్చు. కొంచెం సబ్‌స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి అన్నా అని అడిగి చాలా మందిని మీ ఛానెల్‌కు సబ్‌స్క్రైబ్ చేయవచ్చు. అడగందే దేవుడు కూడా వరం ఇవ్వడు కదా.
గుడి నుంచి తెచ్చే ప్రసాదం ఎలా పంచుతామో…మన కష్టానికి ప్రతిఫలం అయిన లింకును కూడా అలాగే షేర్ చేయాలి. ఎందుకంటే పని దైవంతో సమానం.
10. ఇతర క్రియేటర్లతో పరిచయం…
కూరగాయల మార్కెట్లో టమాటాలను కిలో రూ.30 కి అమ్మేవారు పది మంది కనిపిస్తారు. ఒకే క్వాలిటీ టమాటాలే అయినా రోజు ముగిసే సరికీ అందరూ తమ సరుకు అమ్మేసి ఇంటికెళ్తారు. ఇక్కడ ఎవరికి ఎవరూ పోటీ కాదు. అందరి ప్రయత్నం డబ్బు సంపాదించడమే. దేవుడు ప్రతీ టమాటా బండీ వాడికి కొంత మంది కస్టమర్లను డిసైడ్ చేస్తాడు.

అలాగే యూట్యూబ్‌లో ఎంత మంది విజయవంతమైన ట్రావెల్ వ్లాగర్స్ ఉన్నా మీరు కూడా ఒక రోజు సక్సెస్ అయ్యే అవకాశం నూటికి నూరు శాతం ఉంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా మీరు తిన్నా తినకపోయినా ఏమైనా కంటెంట్ రెగ్యులర్‌గా అప్లోడ్ చేయడం. అలాగే మీ ఛానెల్‌ను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లాలి అంటే ప్రముఖ ట్రావెల్ వ్లాగర్స్తో ( famous travel vloggers) పరిచయాలు పెంచుకోండి. వారి నుంచి టిప్స్ తీసుకోండి. వారిని మీ వీడియోలో చూపించే ప్రయత్నం చేయండి.
Read Also: Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
ఒక మార్వాడీలా ఆలోచించండి. వ్లాగింగ్ అనేది ప్యూర్లీ బిజినెస్. ఇది సరదాకోసం చేస్తున్నాను అనే వాళ్లను నమ్మకండి.
ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి. వాటిని మళ్లీ ఎప్పుడైనా షేర్ చేస్తాను. ముందు వీటిని పాటించి ఒక మంచి రోజు డిసైడ్ చేసుకుని తొలి అడుగు వేసేయండి. బిజినెస్‌మ్యాన్‌లో మహేష్ బాబు అన్నట్టు ఎవడి మాటా వినకు మనిషి మాట అస్సలు వినకు. నీ టార్గెట్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ..ఎయిమ్ ఫర్ 2 మిలియన్స్..
యూబ్యూబ్‌ని నీ వ్లాగ్స్‌తో నింపేయ్. దెబ్బకి నా అన్వేషణ అన్వేష్ ( naa anveshana ), ఉమా తెలుగు ట్రావెలర్ ( uma telugu traveller ) కూడా నిన్ను ఫాలో అవ్వాలి.
గమనిక: ఈ వెబ్సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని లింక్స్ లేదా ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.
Watch More Vlogs On : Prayanikudu
- Pandharpur: 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం
- Hemkund Sahib Trek : హిమాలయాల్లో బ్రహ్మకమలం దర్శనం
- Kamakhya Temple: కామాఖ్య దేవీ కథ
- Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం
- Shillong : అందగత్తెల రాజధాని షిల్లాంగ్
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ప్రపంచ యాత్ర గైడ్
- అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
- Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
- Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
- Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
- Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
- ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
- UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
- సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు?
- Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
- Oymyakon : ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామం