ఈ మధ్య ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధాలే యుద్ధాలు. అశాంతే అశాంతి. ఇలాంటి సమయంలో ఏ దేశం సేఫో ( Safest Countries If WW3 Happens ) తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే కొన్ని దేశాలు రాజకీయంగా నిలకడను సాధించడంతో పాటు, భౌగోళికంగా యుద్ధ క్షేత్రాలకు దూరంగా ఉన్నాయి.
మరికొన్ని దేశాలు అంతర్జాతీయ సంక్షోభాలకు దూరంగా ఉంటాయి. మరికొన్ని తటస్థ వైఖరిని అవలంభించిన సంక్షోభాల నుంచి దూరంగా ఉంటాయి. ప్రపంచం యుద్ధం వచ్చినా కూడా సేఫ్‌గా ఉండే టాప్ దేశాలు ఇవే 10
ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
10. ఐస్లాండ్ | Iceland :
నార్త్ అట్లాంటిక్ ప్రాంతంలో ఉండటం వల్ల ఐస్లాండ్ దేశం ప్రపంచంలో ఏం జరిగినా దాని నుంచి దూరంగా సేఫ్‌గా ఉండగలదు. దీంతో పాటు ఈ దేశం నాటో సభ్య దేశం అయినా దేశానికి ఆర్మీ లేదు.
- జియో థర్మల్, హైడ్రో ఎలెక్ట్రికల్ పవర్ సదుపాయాల వల్ల ఈ దేశానికి ఎనర్జీ కోసం మరో దేశంపై ఆధారపడే అవసరం లేదు.
- దాంతో పాటు ఫిషరీ రంగంలో ఈ దేశం ఎంత డెవెలప్ అయింది అంటే మరో దేశంపై ఆహారం కోసం ఆధారపడే అవసరమే లేదు.
09. భుటాన్ | Bhutan
హిమాలయాల్లోనే అత్యంత ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న దేశం భుటాన్. ప్రపంచంలో అత్యంత సంతోషంగా, ప్రశాంతంగా ఉన్న దేశంగా పేరు సంపాదించుకుంది. శక్తివంతమైన దేశాలతో తక్కువగా మాట్లాతుంది. భుటాన్ అనవసర విషయాల్లో వేలు పెట్టదు. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోదు.
- ఇక్కడి జఠిలమైన మంచుకొండలు , పర్వత శ్రేణులు ఈ దేశానికి నేచర్ ఇచ్చిన ఆర్మీయే అని చెప్పాలి.
- దీంతో పాటు వ్యవసాయ రంగంలో కూడా ఈ దేశం చాలా ముందుంది.
- ఇతర దేశాలపై ఆధారపడే తత్వం తక్కువ.
08. న్యూజిలాండ్ | New Zealand
న్యూజిలాండ్ అనేది సౌత్ పసిఫిక్‌లో ఉన్న ఐలాండ్ దేశం. ఈ భౌగోళిక స్వరూపమే ఈ దేశాన్ని యుద్ధ క్షేత్రాల నుంచి దూరంగా ఉంచుతుంది. ఈ దేశంలో న్యూక్లియర్ ఆయుధం లేదు. ఎందుకంటే న్యూజిలాండ్ అణ్వాయుధాలకు వ్యతిరేకం.
- తక్కువ జనాభా ఉండటం వల్ల ప్రపంచంలో ఏదైనా ఆపద తలెత్తినా వీరికి మాత్రం తిండికి ఢోకా ఉండదు.
- ఇక్కడ ఒక పెర్ఫెక్ట్ దేశానికి ఏం కావాలో ఆ వనరులు ఉన్నాయి. ఇంకో దేశంపై ఆధారపడే అవసరమే లేదు.
- ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
07. స్విట్జర్లాండ్ | Switzerland
జగమంత కుటుంబ నాది అనే పాలసి స్విట్జర్లాండ్‌ది. మేము ఇటువైపు కాదు అటువైపు కాదు అనే విదేశాంగ విధానాన్ని కొన్ని శతాబ్దాలుగా పాటిస్తోంది.
- ఏమైనా తేడాలొస్తే తమ ప్రజలందరినీ కాపాడే విధంగా షెల్టర్లు ఏర్పాటు చేసింది స్విట్జర్లాండ్.
- ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండే ఈ దేశం వాయు మార్గాన్ని చక్కగా, టైట్‌గా కంట్రోల్ చేస్తోంది.
- వ్యవసాయ రంగంలో ముందుండటం వల్ల మరో దేశంపై ఆధారపడే అవసరం ఈ దేశానికి రాదు.
6. ఫిజీ | Fiji
భౌగోళికంగా ఫిజి ఉన్న ప్రాంతాన్ని గమనిస్తే ఒక్క విషయం మీకే అర్థం అవుతుంది. అదేంటి అంటే ఫిజీ ఘర్షణలు జరిగే ప్రాంతాలకు చాలా దూరం. దాంతో పాటు ఘర్షణలకు కూడా చాలా చాలా దూరం.
- ఎవరితో గొడవలు లేవు అనేందుకు తక్కువ మిలటరీని మెయింటేన్ చేస్తుంది.
- ఇక్కడి జీవవైవిధ్యం ( biodiversity ), వ్యవసాయ రంగంపై పట్టు వల్ల ఆహారం కోసం మరో దేశంపై ఆధారపడే అవసరం అంతగా లేదు.
- రాజకీయంగా ఈ మధ్య స్థిరత్వాన్ని సాధించడం మరో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
5. నార్వే | Norway
ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా తమతో సంబంధం లేదు అన్నట్టుగా ఉండే దేశాలలో నార్వే ఒకటి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోదు. ఎవరైనా ఈ దేశంపై కన్నేయాలని లేదా కయ్యానికి కాలు దువ్వాలి అనుకున్న కఠినాతికఠినమైన పర్వత శ్రేణులు ఉన్న నార్వే భౌగోళిక స్వరూపం ఎవరినీ ఆ పని చేయనివ్వదు.
- నార్వేలో జనాభా తక్కువ. అందుకే అందరికీ రక్షణనను అందించగలదు.
- రిన్యూవబుల్ ఎనర్జీలో ముందుంటుంది. మరీ ముఖ్యంగా హైడ్రోపవర్ వనరులు ఎక్కువ.
- చమురు, సహజవాయువుల నిల్వ అధికంగా ఉండటం వల్ల ఎనర్జీ విషయంలో కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
- ఇక్కడ అత్యవసర సమయంలో ఆహారం, ఎనర్జీ సరఫరా చేసేందుకు పౌరసరఫరా విధానం ఎప్పుడూ సంసిద్దంగా ఉంటుంది.
- Read Also : Ravana Lanka : రావణుడి లంక ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు
4. కేనడా | Canada
ఈ మధ్య కాలంలో భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న ఈ దేశం గతంలో ఇంత అగ్రెసివ్‌గా ఎప్పుడూ లేదు. మిలటరీ పరంగా కూడా ఎప్పుడూ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితలను ఎదుర్కోలేదు.
- కెనడా చాలా పెద్ద దేశం. ఇక్కడి భౌగోళిక స్వరూపం మిగితా దేశాల నుంచి దీన్ని వేరు చేస్తుంది.
- అద్భుతమైన సహజ వనరులు ఉన్న దేశం ఇది. నీరు, కలప పుష్కలం అని చెప్పవచ్చు.
- అత్యవసర పరిస్థితులు, సంక్షోభం కోసం ముందుగానే మౌళిక వసతులను నిర్మించుకుంది.
3. ఆస్ట్రేలియా | Australia
భౌగోళికంగా పెద్ద దేశమే అయినా… ఆస్ట్రేలియా యుద్ధ క్షేత్రాలుగా మారిన దేశాలు, ఖండాల నుంచి చాలా దూరం అని చెప్పవచ్చు. మిగితా ప్రపంచానికి దూరంగా ఉండటం, ఇక్కడ పుష్కలమైన వనరులు ఈ దేశానికి ప్లస్ పాయింట్స్.
- ఆస్ట్రేలియా ఇప్పటికే ఆహారాన్ని, ఖనిజాలను, ఎనర్జీని రిజర్వ్ చేసుకుని పెట్టుకుంది.
- చర్యలో పాల్గొనకుండానే చర్యను ప్రభావితం చేసే విధంగా పాశ్యాత్య దేశాలతో స్నేహంగా ఉన్నాం అని ఇతర దేశాలకు అనిపించకుండా…వారితో స్నేహాన్ని కొనసాగిస్తోంది.
- ఆస్ట్రేలియా చుట్టూ సముద్రమే ఉంది. ఇది కూడా ఈ దేశానికి ప్లస్ పాయింట్.
2. చిలీ | Chile
చిలీ దేశం ప్రశాతంగా తన పని తను చేసుకుంటూ వెళ్లే దేశం. ఒకరిని ఇంప్రెస్ చేయాలని ఉండదు, ఒకరిని కంప్రెస్ చేయాలని ఉండదు. మనం మంచిగుంటే ప్రపంచం మంచిగుంటది అన్నట్టు ఉంటుంది చిలీ.
- ఆండెస్ పర్వతాలు ( Andes Mountain ) ఒకవైపు, పసిపిక్ మహా సముద్రం మరో వైపు ఉండటంతో ఈ దేశం సహజంగా చాలా ప్రొటెక్టివ్. దీంతో పాటు సంక్షోభాల నుంచి సహజంగానే దూరంగా ఉంటుంది.
- ఆర్థికంగా మెరుగైన దేశమైన చిలీ ఆహార భద్రతలో కూడా ముందుంటుంది.
- ఆర్మీకి సంబంధించిన యాక్టివిటీస్ ఎక్కువగా ఉండవు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితుల జోలికి వెళ్లదు.
- సంక్షోభాలు, వైపరిత్యాలకు ఈ దేశం నిత్యం సిద్ధంగా ఉంటుంది.
- ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్
1.ఐర్లాండ్ | Ireland
అంతర్జాతీయ అంశాలపై ఐర్లాండ్ న్యూట్రల్‌గా ఉంటుంది. నాటో ( NATO ) నుంచి ఈ దేశం దూరంగా ఉంటుంది. దీంతో ఐర్లాండ్ రిస్కు జోన్ నుంచి బయట ఉండేలా చూసుకుంటుంది.
- వ్యవసాయ రంగంలో ఈ దేశం చాలా ముందుంది. పాటు స్థానిక ఆహార ఉత్పత్తి రంగాన్ని ఈ దేశం ప్రోత్సహిస్తుంది.
- ప్రపంచ శాంతికోసం దౌత్యాన్ని ప్రోత్సాహిస్తుంది. మానవ హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది.
- దగ్గర్లో యూకే ( United Kingdom ) లాంటి నాటో దేశం ఉండటం అనేది సహజంగానే ఒక మంచి సెక్యూరిటీ ఉన్నట్టే.
ఈ లిస్టులో ప్రస్తావించిన ప్రతీ దేశానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ దేశం ఒకటి లేదా పలు కారణాల వల్ల తమ ప్రజలను ప్రపంచ సంక్షోభం నుంచి దూరంగా, క్షేమంగా ఉంచగలవు. సంక్షోభ సమయంలో ఏ దేశంలో ఉంటే బెటరో మీకు వివరించాను. మీకు తెలిసిన మరేదైనా దేశం ఉంటే కామెంట్ చేయగలరు.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.