Summer Honeymoon : సమ్మర్‌లో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? టాప్ 10 డెస్టినేషన్స్ ఇవే ! 

షేర్ చేయండి

సమ్మర్‌లో హనీమూన్ ( Summer Honeymoon ) ఏంటి అని చాలా మంది ఆలోచిస్తుంటారు. కానీ సమ్మరే కరెక్టు హనీమూన్ కోసం అనేలా, కొత్త జంటల కోసం టాప్ 10 హనీమూన్ డెస్టినేషన్స్ లిస్టు తయారుచేశాం. చదవండి.

ఎండా కాలం అనధికారికంగా మొదలైంది. దాంతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైంది. పెళ్లి తరువాత కొత్త జంటలు తమకు జీవితాంతం గుర్తుండే మధురమైన క్షణాల కోసం హనీమూస్ ప్లాన్ చేస్తుంటారు. అందుకే పెళ్లికి ముందు నుంచే ఒక మంచి రొమాంటిక్ హనీమూన్ డెస్టినేషన్ కోసం సెర్చ్ చేస్తుంటారు. 

Prayanikudu
| ప్రయాణికుడు వాట్సాప్ అప్డేట్ కోసం అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సమ్మర్‌లో హనీమూన్ ( Honeymoon in Summer ) ఏంటి అని చాలా మంది ఆలోచిస్తుంటారు. కానీ సమ్మరే కరెక్టు హనీమూన్ కోసం అనేలా, కొత్త జంటల కోసం టాప్ 10 హనీమూన్ డెస్టినేషన్స్ లిస్టు తయారుచేశాం. చదవండి.

1. టాాంజానియా | Tanzania Zanzibar

summer honeymoon destinations
| లగ్జరీతో పాటు అందమైన బీచుల్లో హనీమూన్ ప్లాన్ చేయాలంటే జాంజిబర్ మంచి ఆప్షన్ అవుతుంది.

తూర్పు ఆఫ్రికాలోని ఒక దేశమైన టాంజానియా ఎండాకాలంలో హనీమూన్ వెళ్లేందుకు మంచి డెస్టినేషన్ అని చెప్పవచ్చు. ఇక్కడి జాంజిబార్ ( Zanzibar ) అనే ప్రాంతం కొత్త జంటలకు బాగా నచ్చుతుంది. ఇక్కడి బీచులు ఎంత అందంగా ఉంటాయో అంతే ప్రశాంతంగా అక్కడి వాతావరణం ఉంటుంది

  • ఎక్కడ ఉండాలి ?  :  జాంజిబర్‌లోని నుంగ్వీ బీచ్ ( Nungwi Beach ) లో ఉన్న రాయల్ జాంజిబార్ హోటల్ అనేది ఉండటానికి మంచి ఛాయిస్ అవుతుంది. ఇక్కడి క్లిఫ్ రెస్టారెంట‌లో రొమాంటిక్ డిన్నర్ ఎంజాయ్ చేయవచ్చు.
  • ఏం చేయాలి ? :  ఇక్కడ మీరు స్టోన్ టౌన్‌ను అన్వేషించవచ్చు. ఇది ప్రపంచ వారసత్వ సంపదలో ( UNESCO World Heritage Site ) ఒకటి. ఇక్కడ చరిత్ర, అందమైన మార్కెట్ మిమ్మిల్ని తప్పకుండా ఇంప్రెస్ చేస్తాయి.
  • ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!

2. టాంజానియా – సఫారి | Tanzania Safari

summer honeymoon destinations
| టాజానియా సఫారీ

కొత్త జీవితాన్ని థ్రిల్లింగ్, సాహసంతో ప్రారంభించాలి అనుకునే జంటలకు టాంజానియాలో సఫారీ బాగా సెట్ అవుతుంది.  జులై ఆ సమయంలో ఇక్కడి సెరెంగెటి నేషనల్ పార్కుకు (Serengeti National Park ) భారీ సంఖ్యలో అడవి జంతువులు వలస వస్తాయి. 

  • ఎక్కడ ఉండాలి ? : ఇక్కడి మారా నది ( Mara River ) సమీపంలో సయారీ క్యాంప్‌లో మీరు ఉండవచ్చు. ఈ క్యాంపు నుంచి మారా నది సొగసు చూస్తేనే తెలుస్తుంది. దీంతో పాటు వన్య ప్రాణులను కూడా మీరు వీక్షించవచ్చు.
  • ఏం చేయాలి ? :  ఇక్కడ మీరు హాట్ ఎయిర్ బెలూన్‌‌లో వాయు విహారం చేయవచ్చు. దీంతో పాటు నదీ తీరంలో పలు యాక్టివిటీస్ కూడా చేయవచ్చు. సెరెంగెటీ నేషనల్ పార్క్ అందాన్ని వీక్షింవచ్చు.
  • ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?

3. కుక్ ఐలాండ్స్ | Cook Islands

summer honeymoon destinations
| చిన్న దేశం అని తీసిపాడేకండి. బీచు ఎలా ఉందో చూడండి.

న్యూజిలాండ్‌కు ( New Zealand ) సమీపంలో ఉండే ఒక చిన్న దేశం కుక్ ఐలాండ్స్. ఎండాకాలంలో ( Summer Honeymoon ) ఇక్కడి బ్యూటి మిమ్మల్ని తప్పుకుండా ఇంప్రెస్ చేస్తుంది. ఈ దేశానికి నలువైపులా సముద్రం ఉంటుంది. ఇక్కడి బీచులు, ఈ దీవి చాలా అందంగా ఉంటుంది.

  • ఎక్కడ ఉండాలి ? :  ఇక్కడ మీరు రారోటోంగన్ ( Rarotongan Resort)  లో ఉంటే అక్కడి బీచు బ్యూటీని ప్రతీ క్షణం చూడవచ్చు.  డైనింగ్ విషయానికి వస్తే రొమాంటిక్ డిన్నర్‌కు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ.
  • ఏం చేయాలి ? :  ఇక్కడ మీరు తాబేళ్లతో కలిసి స్విమ్మింగ్ చేయవచ్చు. అందమైన బీచుల్లో స్నార్కలింగ్ చేయవచ్చు. దీంతో పాటు స్థానికంగా నివసించే ప్రజల ఆచారాలు, సంప్రదాయలు తెలిపే కార్యక్రమాలకు హాజరు jeచ్చు.
  • ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్ 

4. తాహితి | Tahiti

summer honeymoon destinations
| ఇది అరుదుగా కనిపించే సీన్

ఫ్రెంచ్ ఫాలినేసియాలో (French Polynesia )  భాగం అయిన తాహితి అనేది చాలా అందమైన ఐల్యాండ్. ఇక్కడి బ్లాక్ సాండ్ బీచులు, పచ్చని కొండలు ఇవన్నీ ఒక ఊహకు అందనంత అందంగా ఉంటాయి.

  • ఎక్కడ ఉండాలి ? :  ఇక్కడ ఇంటర్‌కాంటినెంటల్ తాహితిలో మీరు ఉండవచ్చు. నీటిపై ఉండే నివాసాలు అనేవి పైసా వసూల్ అనేలా ఉంటాయి.
  • ఏం చేయాలి ? : జూలై నెలలో ఇక్కడ హీవా ( Heiva Celebration ) వేడుక నిర్వహిస్తారు. ఇక్కడ తాహితీ మ్యూజియం చూడవచ్చు. వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయవచ్చు.
  • ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది

5. నాసౌ | Nassau

summer honeymoon destinations
| బహామాస్ అంటేనే టూరిజానికి పెట్టింది పేరు.

బహామాస్ (Bahamas ) దేశ రాజధాని అయిన నాసౌ తన బీచులకు చాలా ఫేమస్. ఇక్కడి స్థిరమైన ఉష్ణోగ్రతల వల్ల చాలా మంది ఇక్కడికి సమ్మర్‌లో కూడా వస్తుంటారు. ఇక్కడి నైట్‌లైఫ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు.

  • ఎక్కడ ఉండాలి ? :  ఇక్కడ మీరు సాండల్స్ రాయల్ బహామియన్‌లో నివసించవచ్చు. పెద్దలకు మాత్రమే ప్రవేశం ఉండే ఈ రిసార్టులో లగ్జీరీ స్వీట్స్, ప్రైవేట్ పూల్స్, అదిరిపోయే భోజనం ఉంటుంది.
  • ఏం చేయాలి ? :  నాసౌ చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. స్థానిక క్లబ్స్‌లో నైట్ లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు. దీంతోపాటు ఎన్నో వాటర్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయవచ్చు.
  • Read Also  : Ravana Lanka : రావణుడి లంక ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు 

6. సెయింట్ లూషియా  | Saint Lucia

summer honeymoon destinations
| కరేబియన్ దీవుల్లో ఎన్ని అందాలో…

సెయింట్ లూషియా అనేది కరేబియన్ సముద్రంలో ( Caribbean Sea ) ఉన్న ఒక ఐలాండ్ కంట్రీ. ఇక్కడి బీచు అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సముద్ర తీరంలో మీరు ప్రశాంతంగా వాక్ చేయవచ్చు. లేదంటే ఎన్నో వాటర్ యాక్టివిటీస్ చేయవచ్చు.

  • ఎక్కడ ఉండాలి ? :  శాండల్స్ గ్రాండే సెయింట్ లూషియా హనీమూన్ జంటలకు మంచి ఛాయిస్ అవుతుంది. ఇక్కడి బీచ్ ఫ్రంట్ బంగ్లాతో పాటు, మంచి భోజనాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయవచ్చు.
  • ఏం చేయాలి ? :  స్థానికంగా ఉండే బొటానికల్ గార్డెన్ విజిట్ చేయవచ్చు. సల్ఫర్ స్ప్రింగ్స్‌లో ( Sulphur Springs ) మడ్ బాత్ చేయవచ్చు. లేదంటే మీరు స్థానికంగా జరిగే స్ట్రీట్ పార్టీలు అటెండ్ చేసి అక్కడి సాంప్రదాయాల గురించి తెలుసుకోవచ్చు.
  • ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts

7. యాంటిగ్వా | Antigua

summer honeymoon destinations
| ఆంటిగ్వా

కరేబియన్ దీవుల్లో ( Caribbean Islands ) యాంటిగ్వా కూడా ఒకటి. ఇక్కడి అందమైన బీచులు కొత్త జంటలకు పెర్ఫెక్ట్ హనీమూన్ డెస్టినేషన్ ( Summer Honeymoon ) అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు రిలాక్స్ అవ్వొచ్చ. అంతే కాకుండా కొన్ని ప్రాంతాలను అన్వేషించవచ్చు.

  • ఎక్కడ ఉండాలి ? : ప్రపంచంలోనే అత్యంత రొమాంటిక్ రిసార్టుగా ( Most Romantic Resort in World ) పేరు పొందిన సాండల్స్ గ్రాండే యాంటిగ్వాలో మీరు స్టే చేయవచ్చు. విలాసవంతమైన విడిదికి ఇది పెట్టింది పేరు. 
  • ఏం చేయాలి ? :  షర్లీ హైట్స్ ( Shirley Heights ) అనే వ్యూపాయింట్‌కి చేరుకుని అందమైన సూర్యాస్తమయాన్నిచూడవచ్చు. దీంతో పాటు ఇక్కడ జరిగే వేడుకల్లో కూడా పాల్గొనవచ్చు.
  • ఇది కూడా చదవండి : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు

8. గ్రెనేడా | Grenada 

summer honeymoon destinations
| గ్రెనాడా అందాలు

వెస్టిండీస్‌లోని  ( West Indies ) కరేబియన్ దీవుల్లో గ్రెనడా కూడా ఒకటి. కరేబియన్ దీవుల్లో బీచులు ఎంత అందంగా ఉంటాయో గ్రెనేడా బీచులు కూడా అంతే అందంగా ఉంటాయి. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్, అద్భుతమైన పురాతన సంప్రదాయాలు మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేస్తాయి.

  • ఎక్కడ ఉండాలి ? : శాండల్స్ గ్రెనడా రిసార్టులో మీరు విలాసవంతమైన స్టే ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని రూమ్స్‌లో బీచుకు దగ్గర్లోనే అందమైన పూల్స్ సదుపాయం కూడా ఉంటుంది.
  • ఏం చేయాలి ? : ఆగస్టు ఆ సమయంలో ఇక్కడ స్పైస్ మాస్ ఫెస్టివల్ ( Spicemas Festival ) జరుగుతుంది. దీంతో పాటు మీరు ఇక్కడ జరిగే చాకొలెట్ ఈవెంట్స్‌కు హాజరుకావచ్చు. గ్రెనాడా కోకోవా ( Cocoa – చాక్‌లెట్ దీనితోనే తయారు అవుతుంది ) కు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది.
  • Read Also : సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు? 

9. సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ | St Kitts & Nevis

summer honeymoon destinations
| సింపుల్‌‌గా కనిపిస్తున్నా…చాలా బ్యూటిఫుల్ జంట ద్వీపాలు

సముద్రం మధ్యలో పర్వతాలతో రోడ్డు వేసినట్టు ఉండే జంట ద్వీపాలు ఇవి. ఇక్కడి వర్షాధారిత వనాలు, అందమైన బీచులు ఇవన్నీ కలిపితే ఇది కొత్త జంటలకు పెర్ఫెక్ట్ హనీమూన్ డెస్టినేషన్ అని చెప్పవచ్చు.

  • ఎక్కడ ఉండాలి ? : ఇక్క పార్క్ హయాత్ (Park Hyatt) హోటల్లో మీరు విలాసవంతమైన విడిదిని ఏర్పాటు చేసుకోవచ్చు. సముద్ర తీరాలు కనిపించే విధంగా ఉండే రూమ్స్‌లో నుంచి బీచులను చూడవచ్చు.
  • ఏం చేయాలి ? : ఇక్కడి మౌంట్ లియాంవుగా ( Mount Liamuiga ) ‌కు ట్రెక్కింగ్ చేయవచ్చు. దీంతో పాటు అంత హడావిడి లేని బీచుల్లో ప్రశాంతంగా రిలాక్స్ అవ్వొచ్చు. లేదంటే ఇక్కడి అందాలను వీక్షించేందుకు ట్రైన్ రైడ్ చేయవచ్చు.
  • Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు

10.మైకోనోస్ | Mykonos , Greece

summer honeymoon destinations
| ఇలాాంటివి మనకు సినిమాల్లోనే కనిపిస్తుంటాయి.

గ్రీస్ దేశం అందం ఏంటో చూడాలి అంటే ఇక్కడి మైకోనోస్ అనే ద్వీపానికి వెళ్లాల్సిందే.  ఇక్కడి బీచులతో పాటు, ఆకట్టుకునేలా ఉండే గ్రామాలు,  ఆహ్లాదకరమైన నైట్ లైఫ్ ఇవన్నీ కలిపి మైకోనోస్‌‌ను ఒక మంచి హనీమూన్ డెస్టినేషన్‌గా మార్చాయి.

  • ఎక్కడ ఉండాలి ? :  ఇక్కడ మీకు స్టే చేయడానికి ఎన్నో మంచి ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. మరీ ముఖ్యంగా మైకోనోస్ గ్రాండ్ హోట్ అండ్ రీసార్ట్ అనేది మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇక్కడ విలాసవంతమైన విడిదితో పాటు ఇన్ఫినిటీ పూల్స్ తో పాటు సముద్రం అందాల్ని వీక్షించే అవకాశం లభిస్తుంది.
  • ఏం చేయాలి ? :  ఇక్కడ మీరు ఐకానిక్ విండ్‌మిల్స్ విజిట్ చేయవచ్చు. దీంతో పాటు లిటిల్ వెనిస్‌ వెళ్లవచ్చు. సారో ( Psarou) లాంటి అందమైన బీచుల్లో రిలాక్స్ అవ్వొచ్చు. నైట్ క్లబ్స్‌లో నైట్ లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు.
  • ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు

పైన ప్రస్తావించిన 10 హనీమూన్ డెస్టినేషన్స్‌లో ( Summer Honeymoon ) కొన్నింటి పేరు కూడా మనం గతంలో విని ఉండకపోవచ్చు. ఎందుకంటే అవి అంత పాపులర్ కాదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే హనీమూన్ అనేది మోస్ట్‌లీ  ప్రశాంతంగా, హడావిడి లేకుండా, టూరిస్టుల రద్దీ లేకుండా ఉండే ప్రాంతాల్లో ప్లాన్ చేస్తే బెటర్. ఇందులో ప్రస్తావించిన ప్రతీ డెస్టినేషన్ కూడా మీకు పోటీలేని ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తాయి. హ్యాప్పీ మేరీడ్ లైఫ్.

ఈ  Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!