Arunachalam : అరుణాచల గిరి ప్రదక్షిణ, దీపోత్సవానికి వెళ్లే వారి కోసం 27 టిప్స్

అరుణాచలం ఆలయం లేదా అరుణాచలేశ్వరర్ ( Arunachalam ) ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వెళుతుంటారు. మరీ ముఖ్యంగా “మహా దీపం” , గిరి ప్రదక్షిణ కార్యక్రమాలకు చాలా మంది వెళుతుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు తిరువణ్ణామలై వెళ్తుండటంతో అక్కడి స్థానిక పోలీసులు భక్తులకు కొన్ని సూచనలు జారీ చేశారు. వీటిని పాటించి ప్రశాంతంగా దీప దర్శనం, గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
  1. తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల కోసం తిరుపతి, చిత్తూరు రోడ్డులో ఏపీ ఆర్టిసీ బస్సుల ( APRTC In Arunachalam ) కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇందుకోసం 2 టెంపరరీ బస్టాండ్‌లను ఏర్పాటు చేశారు. వెల్లూరు రోడ్డులోని తిరువణ్ణామలై బైపాస్ రోడ్డు దగ్గర ఉన్న ఏఎకేఎస్ నగర్‌తో పాటు ముగాంబికా నగర్‌లో ఈ బస్టాండులను ఏర్పాటు చేశారు.
  2. అయితే కారులో వచ్చే భక్తుల కోసం 13 తాత్కాలిక కారు పార్కింగ్ ( Car Parking Arunachalam ) సదుపాయాలు కూడా కల్పించారు. భక్తులు ఇక్కడే తమ కార్లను నిలపాల్సి ఉంటుంది. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసి బస్సులను కూడా వాటి నిర్దేశిత ప్రదేశాల్లోనే నిలపాల్సి ఉంటుంది.
  3. ఆర్టీసీ బస్సుల పార్కింగ్ స్థలాల నుంచి ఆలయం వైపునకు వెళ్లేందుకు భక్తుల కోసం ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు.
  4. పార్కింగ్ లొకేషన్స్, డైరెక్షన్స్ కోసం తిరవణ్ణామలై డి స్ట్రిక్ట్ పోలీసులు ప్రత్యేక నెంబర్ ఏర్పాటు చేశారు. 936362230 అనే నెంబర్‌కు మీరు Hello అని మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన రూటు మ్యాపును లింక్ రూపంలో పంపుతారు.
  5. భక్తులు తమ వాహనాలను పార్కింగ్‌ కోసం కేటాయించిన ప్రాంతాల్లోనే పార్క్ చేయాల్సి ఉంటుంది.
  6. అరుణాచలం ఆలయం 4 గోపురాల దగ్గర కర్పూరం, దీపం వెలిగించరాదు.
  7. ఆలయం లోపల ఉన్న కొలనులోకి వెళ్లకూడదు. చెప్పులను ప్రదక్షిణ మార్గంలో విడవరాదు.
  8. గుర్తు తెలియని వ్యక్తులకు మీ ఫోన్లు, ఇతర సామానులు, బంగారం వంటివి అందిచరాదు. మీకు ఏదైనా సమస్య వస్తే పోలీసులను సంప్రదించవచ్చు.
  9. స్థానిక అధికారుల అనుమతి లేని దే అడవిలోకి వెళ్లడం చేయరాదు.
  10. అలాగే గిరి ఎక్కడం కూడా చేయరాదు. వంట కోసం సిలిండర్లు వాడకాన్ని కూడా నిషేధించారు.

పోలీసులు జారీ చేసిన సూచనలతో పాటు ఈ గిరి ప్రదక్షిణకు ముందు, ప్రదక్షిణ చేసే సమయంలో ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి

  1. గిరి ప్రదక్షిణ కోసం వెళ్లే సమయంలో కంఫర్ట్‌గా ఉన్న సంప్రదాయ దుస్తువులు ధరించండి. మీరు పాదరక్షకాలు ధరించకుండా కూడా గిరి ప్రదక్షిణ చేయవచ్చు. లేదంటే మంచి షూ ధరిచండి.
  2. మీతోపాటు ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్లడం మర్చిపోకండి.
  3. స్థానిక సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించండి.
ఇది కూడా చదవండి : Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు

4. అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోండి. రీ చార్జ్ అవ్వండి.

5. వీలు అయితే ఒంటరిగా కాకుండా కొంత మందితో కలిసి గ్రూపుగా వెళ్లండి. దీని వల్ల ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండటంతో పాటు సేఫ్‌గా ఉన్నాం అనే భావన కలుగుతుంది.

6. మీతోపాటు చాలా మంది గిరి ప్రదక్షిణకు వస్తూ ఉంటారు. అందుకే జాగ్రత్తగా, ఇతరులను ఇబ్బంది కలిగించకుండా కదలండి .

7. పవిత్ర స్థలాలు, కొన్ని ప్రదేశాల్లో ఫోటోగ్రాఫ్‌లు తీసే ముందు అక్కడి పరిస్థితిని బట్టి మలచుకోండి.

Tips For Arunachala Deepostava: మహ దీప దర్శనం కోసం వెళ్తున్న భక్తులు కోసం కొన్ని టిప్స్ అందిస్తున్నాము. వీటితో పాటు స్వీయ క్రమశిక్షణ కూడా అత్యంత కీలకం.

ఇది కూడా చదవండి : 51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?
  1. మంచి వ్యూ కోసం వీలైనంత త్వరగా ఆలయం పరిసరాల్లోకి వెళ్లండి.
  2. ఆలయ సంప్రదాయాల ప్రకారం పాటించాల్సిన విధివిధానాలను పాటించండి.
  3. మీకు ఏదైనా విషయంలో సందేహం ఉంటే, అర్థం కాకపోతే అక్కడే ఉన్న తెలుగు వారిని అడగండి.
  4. ఏదైనా సమస్య ఉంటే అధికారులను, పోలీసులను సంప్రదించండి.
  5. ఆలయ గోపురాల ( Arunachalam Temple Gopuras ) వద్ద దీపాలు, కర్పూరాలు వెలిగించకండి.
  6. దీప దర్శనం కోసం చాలా మంది మంచి స్పాట్ వెతుకుతూ ఉంటారు . మీ దర్శనం అయిపోతే వారికి అవకాశం ఇవ్వండి.

7. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ప్రాపంచిక విషయాలు మర్చిపోయి దేవుడిపై ధ్యాస పెట్టండి. మనసులో ఉన్న కోరికను విన్నవించుకోండి.

8. మీకు మెడిటేషన్ ( Meditation) చేయాలని ఉంటే ఆలయ పరిసరాల్లో ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా మెడిటేట్ చేయవచ్చు. అయితే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటే సందర్భాన్ని బట్టి నడచుకోగలరు.

9. స్థానిక ఆచారాలు సంప్రదాయాలను గౌరవించండి. ఏదైనా తెలియకపోతే అడిగి తెలుసుకోండి.

10. ఫోన్ చార్జింగ్ నిండుగా ఉండేలా చూసుకోండి. లేదంటే ఎవరినైనా కాంటాక్ట్ చేయడానికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

ఈ చిట్కాలను పాటించి అరుణాచల గిరి ప్రదక్షిణ, దీపోత్సవాన్ని ఆహ్లాదకరంగా పూర్తి చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా చిట్కాలు ఉంటే మీరు కామెంట్ చేసి చెప్పగలరు.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!