ఇక్కడ క్రిస్మస్ తాతతో ఫోటో దిగవచ్చ | Santa Claus Village

షేర్ చేయండి

శాంతాక్లాస్ గురించి ప్రపంచంలో చాలా మందికి తెలిసే ఉంటుంది. క్రిస్మస్ సమయంలో పిల్లలకు వారికి నచ్చిన బహుమతులు ఇచ్చి మెప్పిస్తాడు అని చాలా మంది చెబుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే శాంటా నేటికీ నివసిస్తున్న అధికారిక నివసం అయిన శాంటా క్లాస్ గ్రామానికి ( Santa Claus Village ) వెళ్దామా మరి. 

గమనిక : ఇక్కడ ఉండేది నిజమైన శాంటాక్లాస్ కాదు. శాంటా అనే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి.

శాంటాక్లాస్ గ్రామం ఎక్కడుంది ? | Where Is Santa Claus Village ?

Santa Claus in Santa Claus Village
శాంటాక్లాస్ ప్రతీ రోజు సందర్శకులకు అందుబాటులో ఉంటాడు

ఫిన్లాండ్‌ దేశంలో ఉన్న రొవానియేమిని అధికారిక శాంటా క్లాస్ హోమ్ టౌన్ అని కూడా పిలుస్తుంటారు. ఇది ఆర్కిటిక్ సర్కిల్లోని ( Arctic Circle ) లో ఉంది. ఏడాది పొడవునా ఈ పట్టణం వింటర్ వండర్లాండ్‌లా ( winter Wonderland ) కనిపిస్తుంది. క్రిస్మస్ సందర్శంగా సందర్శకులతో ఈ పట్టణం కిటకిటలాడుతుంది. ఈ బ్లాగ్‌లో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్లాలి అనుకుంటే ఎలా వెళ్లాలో వివరిస్తాను. మరెన్నీ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. దాని కన్నా ముందు ఈ పట్టణం గురించి మనం తెలుసుకుందాం.

ముందు ఫిన్లాండ్ దేశం గురించి | Facts About Finland  

  • కరెన్సీ : యూరో (€)
  • టైమ్ జోన్ : EET ( GMT+)
  • జనాభా :  55 లక్షలు
  • భాషలు : ఫిన్నిష్, స్వీడిష్ అనేవి అధికారిక భాషలు, ఇంగ్లీష్ కూడా మాట్లాడుతారు.
  • ఇక్కడికి ప్రతీ ఏడాది సుమారు 50 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. ఇందులో భారతీయులు కూడా ఉంటారు.
  • రోవానియేమి చేరుకుని నుంచి బస్సు నెం.8 ఎక్కితే మీరు శాంతాక్లాస్ గ్రామానికి చేరుకొవచ్చు. మీరు ప్రైవేట్ ట్యాక్సీలో వెళ్లినా సరిపోతుంది.
Prayanikudu WhatsApp2
ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి | If You Want to Get Travel & Tourism Updates On Your WhatsApp Click Here

రోవానియేమి చరిత్ర | History Of Santa Claus Home Town

రోవానియేమిలో ఒకప్పుడు వివిధ తెగల ప్రజలు కలిసే వారట. 19వ శతాబ్దం సమయంలో ఇక్కడ సమీ ( Sami Tribe ) అనే తెగవాళ్లు శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఈ పట్టణం చాలా నష్టపోయింది. దీంతో మళ్లీ కష్టపడి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. కొత్త పట్టణ నిర్మాణ తీరు చాలా మందికి నచ్చడంతో ఇది మెల్లిమెల్లిగా పర్యాటక స్థలంగా మారింది.

Rovaniemi Home
రొవానియేమిలో ఒక ఇల్లు
  • మరింత మంది పర్యాటకలును ఆకట్టుకునేందుకు 1980 లో థీమ్ ఫార్కును ఏర్పాటు చేశారు. ఆ థీమ్ పార్క్ పేరే “ ది శాంటాక్లాజ్ హోమ్ టౌన్ “ .
  • ఇక్కడ శాంటా క్లాస్ అధికారిక నివాసం, ఆఫీస్‌తో ( Santa Claus Office ) పాటు కొన్ని రెస్టారెంట్స్, షాప్స్ ఇంకా చాలా ఏర్పాటు చేశారు.
  • అప్పటి నుంచి దేశ విదేశాల నుంచి ఇక్కడికి చాలా మంది ఇక్కడికి రావడం మొదలు పెట్టారు.

ఇది కూడా చదవండి :  ఈ రాష్ట్రంలో  ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు..ఏ రాష్ట్రమో తెలుసా? 

రొవానియేమికి ఎలా వెళ్లాలి ? | Hyderabad To Rovaniemi

శాంతాక్లాస్ అధికారిక హోమ్‌టౌన్‌కు హైదరాబాద్ నుంచి డైర్టక్ట్ ఫ్లైట్స్ లేవు. ముందుగా మీరు హైదరాబాద్ నుంచి ఖతార్‌, రియాద్ లేదా వియన్నా వెళ్లి అక్కడ నుంచి ఫిన్లాండ్ విమానం ఎక్కవచ్చు. లేదంటే నెదర్లాండ్, జర్మనీకి కూడా వెళ్లొచ్చు. అక్కడి నుంచి మీరు ఫిన్లాండ్‌లోని హెల్సింకీ ( Helsinki ) చేరుకోవచ్చు.

Facts About Santaclaus Own Home Town
ఇక్కడ శాంటాక్లాస్‌తో మాట్లాడవచ్చు
  • హెల్సింకి నుంచి మీరు రోవానియేమి కోసం డొమెస్టిక్ ఫ్లైట్ క్యాచ్ చేసి స్థానిక రొవానియేమి ఎయిర్‌పోర్టు ( Rovaniemi Airport ) చేరుకోవచ్చు
  • యూరోప్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి ట్రైన్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. ఒకసారి చెక్ చేయండి.
  • వన్ వే ప్రయాణానికి మీకు 14 నుంచి 20 గంటల సమయం పడుతుంది. మీరు క్యాచ్ చేయబోయే ఫ్లైట్‌ను బట్టి ఈ సమయంలో మార్పు ఉంటుంది. 
  • టికెట్ ధర వన్‌వే ప్రయాణినికి రూ.39000 నుంచి మొదలై 80 వేల వరకు ఉంటుంది. సీజన్‌ను బట్టి ఇందులో మార్పులు ఉండవచ్చు.

భాషలు | Basic Finnish Words In English Telugu

రొవానియేమిలో చాలా మంది ఇంగ్లిష్‌లో మాట్లాడుతారు. కానీ కొంచెం ఫిన్నిష్ పదాలు వస్తే కాస్త సౌలభ్యంగా ఉంటుంది. అందుకోసం కొన్ని బేసిక్ పదాలు తీసుకొచ్చాం.

చూడాల్సిన ప్రదేశాలు | Places To Visit In Rovaniemi

రొవానియేమి అనేది మంచు ప్రపంచంలో ఉండాలి, కానీ అన్ని సదుపాయాలు ఉండాలి అనుకునే వారికి మంచి ఛాయిస్ అవుతుంది. యూరోప్‌లోని ( Europe ) స్విట్జర్లాండ్ ( Switzerland ) వంటి ప్రదేశాలకు మాత్రమే చాలా మంది వెళ్తుంటారు. కానీ మీరు స్విట్జర్లాండ్ లాంటి పాపులర్ డెస్టినేషన్స్‌ కాకుండా యూరోప్‌లోని మరో కోణాన్ని చూడాలి అనుకుంటే రొవానియేమికి వెళ్లవచ్చు. ఇక్కడ చూడటానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి.

  • శాంటాక్లాస్ గ్రామం | Santa Claus Village : ఇక్కడ మీరు శాంతాక్లాస్‌ను చూడవచ్చు. కలవవచ్చు. మాట్లాడవచ్చు. డబ్బులు ఇచ్చి అతనితో ఫోటో దిగవచ్చు. దీంతో పాటు అక్కడ మీరు గిఫ్టులు కొని ఇంటికి తీసుకురావచ్చు. హోటల్స్‌‌లో తినవచ్చు. ఇక్కడ షాపుల్లో శాంతా థీమ్‌లో ఉన్న వస్తువులు, దుస్తువులు కొనవచ్చు. శాంటాక్లాస్ పోస్టాఫిస్ ( Santa Claus Post Office ) నుంచి మీరు మీ కోసం ఒక లెటర్ కూడా పోస్ట్ చేసుకోవచ్చు.
Lapland Safari in Rovaniemi , Finland
ఇక్కడ చాలా పర్యాటక స్థలాలు ఉన్నాయి

ఆర్కిటిక్ సర్కిల్ | Arctic Circle : ఇక్కడ మీరు ఆర్కిటిక్ సర్కిల్‌ దాటవచ్చు. అక్కడ ఫోటో కూడా తీసుకోవచ్చు. ఇది శాంటా ఆఫీస్ ముందే ఉంటుంది.

శాంటా పార్క్ | Santa Park : ఇక్కడ చాలా మంది క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ మ్యాజిక్ కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ అండర్‌గ్రౌండ్‌‌లో ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది. 

  • ఫిన్లాండ్ వస్తే మీకు తప్పుకుండా నార్తెర్న్ అరోరా లైట్స్ చూడటానికి ప్రయత్నించండి. ఆకాశంలో ఎవరో ఆకుపచ్చని రంగులు చల్లినట్టు ఉంటుంది సీన్.
Northern Aurora Lights From Rovaniemi, Lapland, Finland
నార్నెర్న్ అరోరా లైట్స్

రిమానియేమమి మ్యూజియం | Rovaniemi Art Museum : ఫిన్లాండ్ చరిత్ర, అక్కడి కళారూపకాలను మీరు ఇక్కడ చూడవచ్చు.

ఊనాస్వరా హిల్ | Ounasvaara Hill : ఈ పట్టణాన్ని మొత్తంగా పై నుంచి చూడాలి అనుకుంటే మీరు ఉనాస్వారా కొండ వద్దకు వెళ్లవచ్చు. ఇది హైకింగ్ చేయాలనుకునే వారికి కూడా మంచి ఛాయిస్ అవుతుంది. ఇక్కడి నుంచి మీరు నార్తెర్న్ అలోరా లైట్స్ ( Northern Aurora Lights ) కూడా చూడవచ్చు. 

రీన్‌డీర్ స్లీ రైడ్ | Reindeer Sleigh Ride : మీరు కూడా శాంటా క్లాస్‌లా రీన్‌డీర్‌పై సవారీ చేయవచ్చు. మంచు దారుల్లో రయ్ రయ్ అంటూ దూసుకెళ్లవచ్చు.

Reindeer in In Rovaniemi
ఇక్కడ రీన్ డీర్ సవారీ చేయవచ్చు
  • ఇక్క మీరు స్నో షూయింగ్, స్నో మొబైల్ సఫారీ, ఐస్ ఫిషింగ్ కూడా చేయవచ్చు.
  • ఇక్కడ ఐస్ గ్యాలరీ ఉంటుంది. మంచుతో చేసని రకరకాల శిల్పాలను చూడవచ్చు.

హస్కీ సఫారి | Husky Safari : హస్కీ కుక్కలు అనేవి మంచు ప్రపంచంలో బాగా బతకగలవు. కానీ మనం వాటిని కాంక్రీట్ జెంగిల్లో కూడా పెంచుతున్నాం. అది పక్కడ పెడితే శాంటా‌క్లాస్ గ్రామానికి వస్తే మీరు హస్కీ స్లెడ్‌పై సవారీ చేయవచ్చు. దీన్ని హస్కీ సఫారీ అంటారు. 

Husky Safari in Rovaniemi
కాసేపు హస్కీ స్లెడ్‌పై సవారీ చేయండి

ఏం తినాలి ? | Food To Eat In Rovaniemi

రోవానియేమి అనేది ఫిన్లాండ్‌లోని ల్యాప్‌లాండ్ ( Lapland ) అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ మీరు ల్యాప్‌లాండ్ క్యూజిన్‌ను ( Lappi , Lapland Dishes ) ఎంజాయ్ చేయవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి.

  • సాల్మన్ ఫ్రెష్ : ఇక్కడ స్థానికంగా మంచు సరస్సులు, నదుల్లో పట్టే సాల్మన్ చేపలతో రకరకాల డిషెస్ ప్రిపేర్ చేస్తారు. వీటిని అలుగడ్డ ( బంగాళ దుంప ), లింగాన్‌ బెర్రీ సాస్‌తో సర్వ్ చేస్తారు.
  • కర్జలాన్ పిరక్క | Karjalanpiirakka : ఇది బియ్యం లేదా ఆలూతో చేసే ఒకరకమైక పేస్ట్రీ. చాలా మంది దీన్ని ఇష్టంగా తింటుంటారు. దీని పేరే పలకడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది.
  • ప్యూల్లా | Pulla : ఇది ఇలైచీ ఫ్లేవర్‌తో తయారు చేసే ఒక స్వీట్ బ్రెడ్. రోజంతా వివిధ ప్రాంతాలను అన్వేషించిన తరువాత సరదాగా స్నాక్స్‌లా దీన్ని ఆరగించొచ్చు.

దీంతో పాటు సాల్మోన్ చేపతో చేసిసిన సూప్స్ ఎంజాయ్ చేయవచ్చు. రీన్ డీర్ సూప్, చికెన్ వాఫిల్ కూడా ఎంజాయ్ చేయవచ్చు. 

ఎక్కడా ఉండాలి ? | Accommodation in Rovaniemi

రొమానియేమి అనేది చాలా పాపులర్ డెస్టినేషన్. ఇక్కడ మీరు స్టే చేయాలి అంటే కొంచెం జేబులు దులపాాల్సిందే. కొంచెం కాస్ట్‌లీ అన్నమాట. మినిమం రూ.12000 పెట్టాల్సి ఉంటుంది హోటల్ కోసం. అది కూడా దొరికితేనే.. పోటీ ఉంటే రేటు కార్డు మారిపోవచ్చు. అందుకే అడ్వాన్స్ బుకింగ్ కోసం ప్రయత్నిచండి.

Santa Claus in Rovaniemi
సొంత ఊరిలో శాంటా
  • ఇక్కడ మీకు గ్లాస్ రూఫ్ ఉన్న క్యాబిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అందులో మీ బెడ్డుపైనుంచే మీరు నార్తెర్న్ లైట్స్ చూడొచ్చు.

డ్రెస్కింగ్ :  ఇక్కడికి వచ్చే ముందు కొంచెం దుస్తువుల ( Dressing in Rovaniemi ) గురించి రీసెర్చ్ చేయండి. తీవ్రమైన చలి ఉంటుంది. మైనస్ 14 అనేది సాధారణ ఉష్ణోగ్రత ఇక్కడ.

రవాణా : రొవానియేమీలో మీకు ట్యాక్సీ కార్లు ( Transportation in Rovaniemi ) అందుబాటులో ఉంటాయి. లేదంటే మీరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కూడా వాడుకోవచ్చు. 

వీసా : రావానియేమి ఫిన్లాండ్‌లో ఉంది. ఇక్కడికి మీరు రావాలి ( Visa To Europe ) అనుకుంటే మీకు షెంజెన్ వీసా ( Schengen Visa For Indians ) అవసరం అవుతుంది. 

ఇక్కడ చేయకూడనివి | Things not To do in Rovaniemi

  •  స్థానికులతో మాట్లాడే సమయంలో వారి ఆచారాలు, ఆలోచనలను గౌరవించండి. ఫోటోలు, వీడియోలు తీసే ముందు వారి అనుమతి తీసుకోండి. 
  • చెత్తను చెత్త బుట్టల్లో వేయండి. ఫిన్లాండ్ చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఆ అందాన్ని కాపాాడండి.
  • ఇక్కడ నేచర్ కొన్ని సార్లు వైల్డ్‌గా ఉంటుంది. అందుకే స్థానిక అధికారుల సలహాలు సూచనలు పాటించండి. జనాలు ఉన్న చోటే ఉండండి.

ముగింపు

రొవానియేమి అనేది మిగితా పర్యాటక స్థలాల్లా ( Travel ) కాదు. ఇది చాలా స్పెషల్ ప్రదేశం. ఎందుకంటే ఇక్కడ మీరు శాంటాను కలవచ్చు, ఫోటో దిగవచ్చు. దీంతో పాటు ఇక్కడ మీరు ఎన్నో స్నో యాక్టివిటీస్ చేయొచ్చు. నార్తెర్న్ లైట్స్ చూడవచ్చ. నాలుకను లపలపలాడించే రుచులను ఎంజాయ్ చేయవచ్చు. మొత్తానికి ఇక్కడికి వస్తే క్రిస్మస్ ( Christmas ) ఇంకా అయిపోలేదేమో అనిస్తుంది. పైగా కేవలం 20 గంటల్లోనే హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

ప్రపంచ యాత్ర గైడ్

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!